BigTV English

MLA: అమ్మాయిలను పంపించు.. ఎమ్మెల్యే చిన్నయ్య పెద్దల పనులు?.. ఆడియో, వీడియో వైరల్..

MLA: అమ్మాయిలను పంపించు.. ఎమ్మెల్యే చిన్నయ్య పెద్దల పనులు?.. ఆడియో, వీడియో వైరల్..

MLA: అతనో ఎమ్మెల్యే. పక్కా మాస్ లీడర్. గతంలో ఓ టోల్‌ప్లాజా సిబ్బందిని కొట్టి వార్తల్లో నిలిచారు. ఈసారి అంతకుమించి బ్రేకింగ్ న్యూస్ అయ్యారు. ఓ డెయిరీ నిర్వాహకురాలు ఆ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేశారు. తనను ఆర్థికంగా వాడుకున్నారని.. అమ్మాయిలను పంపించాలని ఒత్తిడి చేశారని అన్నారు. తాను సహకరించకపోతే.. తప్పుడు కేసులు పెట్టి, అనుచరులతో బెదిరిస్తున్నారంటూ ఆ మహిళ తన ఆవేదనను ఆడియో, వీడియోల్లో వ్యక్తం చేయడం కలకలం రేపుతోంది. బీఆర్ఎస్‌కు చెందిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది.


ఆమె ఓ డెయిరీ సంస్థ ప్రధాన భాగస్వామి. మంచిర్యాల జిల్లాలో పాల ఉత్పత్తి కోసం పెద్ద ఎత్తున వ్యాపారం స్టార్ట్ చేశారు. బిజినెస్‌లో భాగంగా ఎమ్మెల్యే చిన్నయ్యను కలిశారు. తన దగ్గర వర్క్ చేసే మరో యువతితో కలిసి ఎమ్మెల్యేతో మీటింగ్‌కు అటెండ్ అయ్యారు. అయితే, ఎమ్మెల్యే చిన్నయ్య కన్ను ఆ అందమైన యువతిపై పడింది. మీ బిజినెస్ రన్ అవ్వాలంటే.. ఆ అమ్మాయిని తన దగ్గరకు పంపించాలంటూ ఆ మహిళా వ్యాపారిపై ప్రెజర్ తీసుకొచ్చాడన ఎమ్మెల్యే చిన్నయ్య. ఓసారి హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు పిలిపించి.. తమను ఆల్కహాల్ తాగమని ఒత్తిడి చేశారని కూడా సదరు మహిళ ఆడియో, వీడియోల్లో ఆరోపణలు చేసింది. తాను చెప్పినట్టు వింటే వ్యాపార విస్తరణకు సహకరిస్తానని.. కొందరు తన మనుషులను పార్ట్‌నర్స్‌గా చేసుకోవాలని కూడా వేధించాడని ఆమె అంటోంది.

ఎమ్మెల్యే టార్చర్ భరించలేక పోలీస్ స్టేషన్‌కు వెళితే వారు పట్టించుకోవడం లేదని.. తనకు ఎమ్మెల్యే నుంచి ప్రాణభయం ఉందని ఆ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. డెయిరీ ఏర్పాటుకు డబ్బు తీసుకుని మోసం చేశారని.. పాడి రైతులను మోసం చేసినట్టు తనపై కేసులు పెట్టించారని.. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ఆరోపించింది. ఆమె రిలీజ్ చేసిన ఆడియో, వీడియో, వాట్సాప్ చాట్.. తెగ వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే ఇమేజ్ ఫుల్‌గా డ్యామేజ్ అవుతోంది.


ఆ మహిళ ఆరోపణలపై ఎమ్మెల్యే చిన్నయ్య స్పందించారు. తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఇలాంటి చవక బారు ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. ఆ ఆడియో, వీడియోలో ఆమె మాట్లాడిన మాటల్లో నిజం లేదని ఖండించారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×