BigTV English

Tirupati:తిరుపతిలో నవమి సందడి

Tirupati:తిరుపతిలో నవమి సందడి

Tirupati:శ్రీ కోదండరామాలయంలో మార్చి 20 నుంచి 28వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను అన్ని విభాగాల అధికారులు సమష్టిగా కృషిచేసి విజయవంతం చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం కోరారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మార్చి 20న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు .ప్రధానంగా మార్చి 22న ఉగాది ఆస్థానం, 24న గరుడ సేవ, 25న హనుమంత వాహనం జరుగుతాయన్నారు.


మార్చి 31న శ్రీ సీతారాముల కల్యాణం, మార్చి 30 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు తెప్పోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయం వద్ద, వాహన సేవల్లో ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. బ్రహ్మోత్సవాల గురించి వివిధ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. మెరుగైన పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

తిరుపతి మధ్యలో వెలసిన ఆలయం. ప్రతి సంవత్సరం మార్చి నెలలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు . క్రీ.శ. 1480లో సాళువ నరసింహరాయల గౌరవార్థం ఈ ఆలయాన్ని తిరుపతికి చెందిన శఠగోప దాసర్ నరసింహరాయ మొదలి అనే వ్యాపారి నిర్మించి విగ్రహాలను ప్రతిష్టించాడు. అలాగే క్రీ.శ. 1530 జనవరి 14వ తేదీన అచ్యుత దేవరాయల గౌరవార్థం కుమారా రామానుజయ్యంగార్ ఒక కొయ్య తేరును నిర్మించి బ్రహ్మోత్సవాలలో వాడుకోవడానికి సమర్పించాడని చరిత్ర ద్వారా తెలుస్తుంది


రావణాసురుని సంహరించాక అయోధ్యకు వెళ్తూ తిరుపతిలో శ్రీరాముడు ఒక రాత్రి గడిపాడట. రాముడు రాకను పురస్కరించుకుని తిరుపతిలో కోదండరామాలయం వెలిసిందని “సవాల్-ఇ.జవాబ్”లో ప్రస్తావించారు. అదే కాదు కోదండరామస్వామి ఆలయాన్ని కలియుగంలో అరవై నాలుగువ సంవత్సరం జనమేజయుడు అనే రాజు ఆలయ గోపురం, మంటప ప్రాకారాలు నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. యాదవ రాజులు వాటిని అభివృద్ధి చేశారని చరిత్ర చెబుతోంది.

Positive Vibrations : ఇంట్లో ఈ మార్పులు చేస్తే పాజిటివ్ వైబ్రేషన్స్

Cholesterol : కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసే ఆహార పదార్థం..

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×