BigTV English

IND vs AUS: వన్డే సిరీస్ కూడా మనదేనా? పాండ్యాకు కెప్టెన్ టాస్క్..

IND vs AUS: వన్డే సిరీస్ కూడా మనదేనా? పాండ్యాకు కెప్టెన్ టాస్క్..

IND vs AUS: టెస్టు సిరీస్‌ అయితే గెలుచుకున్నాం.. ఇక ఇప్పుడు అందరి దృష్టి వన్డే సిరీస్‌ పైనే.. భారత్‌ ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం వాంఖడే వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే ఇరుజట్లు కూడా ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాయి. తొలి వన్డేకు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరమయ్యాడు. అతని స్థానంలో హార్ధిక్‌ పాండ్యాకు జట్టు బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. అయితే భారత వన్డే జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు 11 టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మరోవైపు, ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్‌ గా వ్యవహరించనున్నాడు. స్మిత్ ఐదేళ్ల తర్వాత వన్డేలకు కెప్టెన్‌గా కనిపించనున్నాడు. అతను 2014 నుంచి 2018 వరకు ఆస్ట్రేలియాకు రెగ్యులర్ కెప్టెన్‌గా ఉన్నాడు.


ముఖ్యంగా ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ సిరీస్ కొంతమంది భారత ఆటగాళ్లకు చాలా కీలకంగా మారనుంది. టెస్టు జట్టులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రవీంద్ర జడేజా.. వన్డేల్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాల్సి ఉంది. 2021 నుంచి టీమిండియా ఆడిన వన్డే మ్యాచుల్లో కేవలం మూడింటిలోనే జడ్డూకు చోటు దక్కింది. అతను లేకపోవడంతో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్ తదితరులు ఏడో స్థానంలో ఆడారు. వీళ్లంతా కూడా తమకు వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకొని రాణించారు. ఇలాంటి సమయంలో ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో జడ్డూ రాణించకపోతే ఈ ముగ్గురిలోనే ఒకరికి తన స్థానాన్ని ఇవ్వాల్సి వస్తుంది.

ఇక టీ20ల్లో టాప్ బ్యాటర్‌గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్.. వన్డేల్లో మాత్రం తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. టీ20 ఫార్మాట్‌లో సెంచరీల మీద సెంచరీలు చేస్తున్న అతను.. వన్డేల్లో మాత్రం కేవలం 28.86 సగటుతో పరుగులు చేశాడు. దీంతో జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు తలెత్తాయి. అతను ఈ ఫార్మాట్లో అవుటవుతున్న విధానం చూస్తుంటే తన డిఫెన్స్, ఎటాక్ గేమ్స్ మధ్య బ్యాలెన్స్ కోల్పోయినట్లు కనిపిస్తుందని చాలా మంది మాజీలు విమర్శించారు. ఇంకా చాలా ఓవర్లు ఉండగా తన 360 డిగ్రీస్ షాట్లు ఆడబోయి అవుటవడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ కూడా లేకపోవడంతో సూర్యకు బంగారం వంటి అవకాశం లభించినట్లే. మరి దీన్ని అతను ఏమాత్రం ఉపయోగించుకుంటాడో చూడాలి.


వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టులో మూడో పేసర్ స్థానం కోసం శార్దూల్ ఠాకూర్ పోటీలో ఉన్నాడు. అతనికి యవ పేసర్ ఉమ్రాన్ మాలిక్ నుంచి గట్టి పోటీ ఉంది. అయితే అవసరమైనప్పుడు బ్యాటుతో కూడా విలువైన పరుగులు చేయడం శార్దూల్‌కు ఉన్న పెద్ద ప్లస్. ఈ క్రమంలో తన బౌలింగ్ కూడా మెరుగ్గా ఉందని శార్దూల్ నిరూపించుకుంటే.. అనుభవం ఉన్న అతనికి జట్టులో చోటిచ్చేందుకే సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనికి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ చక్కని వేదికగా కనిపిస్తోంది. ఈ సిరీస్‌లో కనుక శార్దూల్ రాణిస్తే.. జట్టులో మూడో పేసర్ స్థానం అతను అందిపుచ్చుకున్నట్లే.

Sunil Gavaskar: నాటు నాటు సాంగ్ స్టెప్పులేసిన సునీల్ గవాస్కర్.. వీడియో వైరల్

Rahul Gandhi : కేంబ్రిడ్జ్ ప్రసంగంపై రచ్చ.. సభలోనే బదులిస్తా: రాహుల్ గాంధీ ‌

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×