BigTV English

Balakrishna : ‘ఆహా’ బాల‌య్య‌.. ఇటు సాంగ్.. అటు డాన్స్‌.. ఇర‌గ‌దీసేశాడు..

Balakrishna : ‘ఆహా’ బాల‌య్య‌.. ఇటు సాంగ్.. అటు డాన్స్‌.. ఇర‌గ‌దీసేశాడు..
Balakrishna

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ‌కు అల్లు ఫ్యామిలీకి ఆహా వ‌ల్ల మంచి రిలేష‌న్ ఏర్ప‌డింది. ఆహాలో బాల‌య్య చేసిన అన్‌స్టాప‌బుల్ రెండు సీజ‌న్స్ బ్లాక్ బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. దీంతో నంద‌మూరి హీరోపై ఉన్న నెగెటివిటీ అంతా కూడా ఎగిరిపోయింది. ఇండియాలోనే ఈ టాక్ షో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఆహా కోసం బాల‌కృష్ణ మ‌రో ఫీట్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ స్టార్ హీరో కూడా చేయ‌ని గొప్ప ప‌ని అనే చెప్పాలి. ఆరు ప‌దులు దాటిన మ‌న నంద‌మూరి హీరో ఆహా వారి కార్య‌క్ర‌మంలో హోస్ట్‌గా పాల్గొంటున్నారు. ఇంత‌కీ అది ఏ షోనో తెలుసా! తెలుగు ఇండియన్ ఐడిల్ 2.


ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. బాల‌కృష్ణ ఈషోకి ఆయ‌నే గెస్ట్‌గా, హోస్ట్‌గా ప‌ని క‌నిపిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే మ‌రో గ‌మ్మ‌త్తైన విష‌యం ఇక్క‌డే దాగుంది. ఆహా వాళ్లు విడుద‌ల చేసిన లేటెస్ట్ తెలుగు ఇండియ‌న్ ఐడల్ 2 ప్రోమోస్‌లో బాలకృష్ణ డాన్స్‌తో అద‌ర‌గొట్ట‌డ‌మే కాకుండా, ఆయ‌నే పాట కూడా పాడారు. అస‌లు ఓ షో కోసం ఓ స్టార్ హీరో ఇలా చేస్తార‌ని ఊహించ‌రు. కానీ అక్క‌డుండేది బాల‌య్య‌. కాబ‌ట్టి ఆయ‌న‌కు న‌చ్చితే చాలు చేసుకుంటూ వెళ్లిపోతారు. ఇప్పుడు ఆహా విష‌యంలోనూ అంతే.. మ‌న‌సుకు న‌చ్చ‌టంతో స్టేజ్‌పై ఏకంగా ర్యాప్ షో చేసేస్తున్నారు మ‌రి. ప్రోమోస్ చూసిన నెటిజ‌న్స్ ద‌టీజ్ బాల‌య్య అని అప్రిషియేట్ చేస్తున్నారు.

ఒక వైపు సినిమాలు, మ‌రో వైపు రాజ‌కీయాల‌తో బిజీగా ఉంటూనే నంద‌మూరి బాల‌కృష్ణ‌.. మ‌ధ్య మ‌ధ్య‌లో సినిమాల‌కు, క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌కు స‌మ‌యాన్ని కేటాయిస్తున్నారు. ఈ ఏడాది వీర సింహారెడ్డితో సంద‌డి చేసిన బాల‌య్య ఇప్పుడు అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో NBK 108 సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో శ్రీలీల.. బాల‌కృష్ణ కుమార్తె పాత్ర‌లో న‌టిస్తుంద‌ని టాక్‌.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×