E-Paper
Advertisement

Stock Market : వరుసగా నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. 25 లక్షల కోట్ల సంపద ఆవిరి..

Stock Market : వరుసగా నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. 25 లక్షల కోట్ల సంపద ఆవిరి..
Advertisement

Stock Market : దేశీయ స్టాక్‌ మార్కెట్లు మదుపరులను అయోమయానికి గురి చేస్తున్నాయి. గత వారం రోజుల్లో ఇన్వెస్టర్ల అంచనాలు తలకిందుల అవుతున్నాయి. మంగళవారం మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. నిజానికి ఉదయం మార్కెట్లు భారీ లాభాల్లోనే మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 561 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్లు లాభాల వరకు ఎగబాకాయి. అయితే కొద్దిసేపటికే సూచీలు నేల చూపులు చూశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్ల నుంచి అమ్మకాల వైపు మళ్లారు. దీంతో.. సెషన్స్ ముగిసే సమయానికి మదుపరులు భారీ నష్టాలు మూటగట్టుకున్నారు. సెన్సెక్స్‌ 1,053 పాయింట్లు, నిఫ్టీ 330 పాయింట్లు కోల్పోయాయి. దీంతో.. ఏకంగా ఎనిమిదిన్నర లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోంది.

అయితే.. మంగళవారం ఒక్కోరోజే కాదు.. గత వారంరోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇన్వెస్టర్ల అంచనాలు తలకిందులు అవుతున్నాయి. వారం క్రితం వరకూ భారీ లాభాల్లో ఉన్న మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. 73 వేల 400 పాయింట్లకు పైగా ఎగబాగిన సెన్సెక్స్ సూచీలు ఒక్కసారిగా పడిపోయాయి. ఏకంగా 3 వేలకుపైగా పాయింట్లు పడిపోయాయి. దీంతో.. వారంరోజుల్లో 25 లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోయింది.

Advertisement

బుధవారం కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 9.21 గంటల సమయంలో సెన్సెక్స్ 221 పాయింట్లు నష్టపోయి 7018 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 50 పాయింట్లు కుంగి.. 21,188 వద్ద కొనసాగుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.14 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్-30 సూచీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, టాటా స్టీల్, హెచ్ సీఎల్ టెక్, ఐటీసీ, టీసీఎస్, నెస్లే ఇండియా, హేచ్ యూఎల్ షేర్లు లాభాల్లో ఉండగా.. యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్ఎం, మారుతీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Advertisement

.

.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×