E-Paper
Advertisement

Top 20 News: ఉత్పత్తి లేకపోతే జీతం కూడా లేదు…దుమారం రేపుతున్న పవన్ వ్యాఖ్యలు

Top 20 News: ఉత్పత్తి లేకపోతే జీతం కూడా లేదు…దుమారం రేపుతున్న పవన్ వ్యాఖ్యలు

1. వరదల్లో 1000 మందికి పైగా మృతి

ఇండోనేసియా, థాయ్‌లాండ్, శ్రీలంకలో ఇటీవల వచ్చిన వర్షాలు, వరదలు ఆ దేశాలను అతలాకుతలం చేశాయి. ఈ ఘటనల్లో వెయ్యి మందికి పైగా మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. ఆయా దేశాల్లో వరద సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో కనీసం 604 మంది చనిపోయారని ఆ దేశ అధ్యక్షుడు వెల్లడించారు.

2. నేడు మూడో విడత పంచాయతీ నామినేషన్లు

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. నేటి నుంచి మూడో విడత ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైది. కానుంది. మరోవైపు నిన్నటితో రెండో విడత ఎన్నికలకు నామినేషన్లు ముగిశాయి. 4 వేల 332 సర్పంచ్‌ స్థానాలకు 12 వేల 479 నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తోంది. ఇక తొలి విడత నామినేషన్లకు నేటితో ఉపసంహరణ గడువు ముగియనుంది. ఇక ఏకగ్రీవాలపై నేతలు ఫోకస్ చేస్తున్నారు.

3. ఉత్పత్తి లేకపోతే జీతం కూడా లేదు

విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగుల నవంబర్ జీతాల్లో కోత విధించింది. 100 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించకపోవడంతో లక్ష్యానికి ఎంత శాతం తగ్గితే అంత శాతం జీతాలు కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. మార్కెటింగ్‌కు 84 శాతం, బ్లాస్ట్ ఫర్నెస్ కు 83 శాతం, కోక్ ఓవెన్‌కు 93 శాతం వరకు కోత విధించారు. జీతాల కోతకు నిరసనగా ఎస్ఎంఎస్-2 విభాగం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.

4. పెరుమార్చుకున్న ప్రధానమంత్రి భవనం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఇకనుంచి సేవాతీర్థ్‌గా పిలవనున్నారు. దశాబ్దాలుగా సౌత్‌బ్లాక్‌లోని పీఎంవో నుంచి ప్రధానులు విధులు నిర్వర్తిస్తుండగా ఆ కార్యాలయం కొత్త భవనంలోకి మారనుంది. ఈ నేపథ్యంలోనే పేరు మార్పుపై ప్రకటన వచ్చింది.

5. శబరిమలకు అదనపు రైళ్లు

శబరిమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌. ఇప్పటికే 60 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తాజాగా మరో 10 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించారు.ఈ ప్రత్యేక రైలు సర్వీసులు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మీదుగా శబరిమలకు నడపనున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 13 నుంచి 31 మధ్య వివిధ తేదీల్లో ఈ రైళ్లు సర్వీసులందించనున్నాయి.

6. కారు ప్రమాదంలో ముగ్గురు మృతి

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చండ్రుగొండ నుంచి సత్తుపల్లి వైపు వేగంగా వస్తున్న కారు.. డివైడర్ ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డివైడర్ వద్ద ఎలాంటి సైన్ బోర్డులు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

7. ఎక్సైజ్ అధికారులపై వేటు

ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కట్టా రాజు డైరీ ఎఫెక్ట్ ఎక్సైజ్ అధికారులపై వేటు పడింది. ఎక్సైజ్ కానిస్టేబుల్ భాస్కర్ సస్పెండ్ అయ్యాడు. మరో నలుగురిపై బదిలీ వేటు పడింది. డైరీలోని అంశాల అదారంగా బెల్ట్ షాపుల డేటాలో భాస్కర్ కీలకంగా వ్యవహారించాడు.

8. గురుకుల పాఠశాలలో ర్యాగింగ్

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. రాజపేట గురుకుల కాలేజ్ లో.. ఆరుగురు పదవ తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు. క్రికెట్ బ్యాట్లతో దాడి చేయడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ర్యాగింగ్ ఘటన బయటకు రాకుండా లోలోపల.. ఐదుగురు విద్యార్థులను హాస్టల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది.

9. మేడ్చల్ జిల్లాలో నకిలీ పత్రాల ముఠా హల్‌చల్

మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలోని బిట్స్ కాలనీలో నకిలీ పత్రాల ముఠా హల్‌చల్ చేస్తోంది. ఫోర్జరీ సంతకాలు చేసి, నకిలీ పత్రాలు సృష్టించి, నిరుపేదల ప్రభుత్వ పట్టా భూములను కబ్జా చేస్తున్నారని బాధితులు శామీర్‌పేట పోలీసులను ఆశ్రయించారు. నిర్మాణాలు లేని ఖాళీ స్థలాలపై కన్నేసిన కొందరు రియల్ వ్యాపారులు నకిలీ పత్రాలతో ఇళ్లు నిర్మిస్తూ ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు.

10. దుమారం రేపుతున్న పవన్ వ్యాఖ్యలు

తెలంగాణ నేతల దిష్టి వల్లే కోనసీమ ప్రాంతంలో కొబ్బరి మొక్కలు ఎండిపోయాయంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. తక్షణమే పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ, విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓ అడుగు ముందుకేసి పవన్‌ కల్యాణ్‌ సినిమాలు ఆడనివ్వమని హెచ్చరించారు.

11. మద్యం విక్రయించినా, సేవించినా.. పథకాలు కట్!

గుజరాత్‌లోని బనాస్‌కాంఠా జిల్లా ఛాప్రా గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయించే లేదా సేవించే వారికి పంచాయతీ అందించే ప్రభుత్వ సేవలు అందించకూడదని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇందుకు సంబంధించి పంచాయతీ కార్యాలయంలో నోటీసును అంటించింది. ఈ నిర్ణయాన్ని గ్రామ యువత, మహిళలు స్వాగతిస్తున్నారు.

12. సోషల్ మీడియాపై ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం

పదహారేళ్ల కన్నా తక్కువ వయసున్న వారు సోషల్‌ మీడియా వాడకుండా నిషేధిస్తూ చట్టం తెచ్చిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఈ డిసెంబర్‌ 10 నుంచి అమలుకు సిద్ధమైంది. దీంతో వేలాది మంది టీనేజర్ల సామాజిక మాధ్యమ ఖాతాలు ప్రభావితం కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ ప్రభుత్వం మాత్రం చట్టం అమలు చేస్తామని స్పష్టం చేసింది.

13. ఇమ్రాన్ ఖాన్ బాగానే ఉన్నారు: సోదరి ఉజ్మా ఖానుమ్‌

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మృతిచెందారంటూ వచ్చిన వదంతులకు ఎట్టకేలకు తెరపడింది. ఆయన జైల్లో సురక్షితంగానే ఉన్నారని సోదరి ఉజ్మా ఖానుమ్‌ తెలిపారు. అయితే మానసికంగా వేధిస్తున్నట్లు ఆరోపించారు. దీంతో ఉజ్మాతో పాటు ఓ లాయర్‌ ఆయన్ని కలిసేందుకు జైలు అధికారులు మంగళవారం అనుమతించారు.

14. రూ.600 కోట్లతో పరారైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు

నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రముఖులు, నాయకుల నుంచి అధిక వడ్డీ ఆశ చూపి సుమారు రూ.400 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు వసూలు చేసి విదేశాలకు పరారయ్యాడు. అనంతపురం, బెంగళూరు, హైదరాబాద్ కేంద్రాలలో వెంచర్ల పేరుతో మోసం చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఉన్నత అధికారులు ఉన్నందున బాధితులు ఫిర్యాదు చేయలేకపోతున్నట్లు సమాచారం.

15. విస్తరిస్తున్న గంజాయి మత్తు

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి పుట్టయ్య కాంప్లెక్స్ వద్ద గంజాయి బ్యాచ్ స్థానికులపై దౌర్జన్యానికి పాల్పడుతోంది. దాదాపు 20 మంది యువకులు గంజాయికి అలవాటు పడ్డారని గుర్తించిన పోలీసులు, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే, ఈ గంజాయి బ్యాచ్ ఆగడాలను పోలీసులు అరికట్టలేకపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

16. హైదరాబాద్‌లో ఫిల్మిసిటీ నిర్మించనున్న అజయ్ దేవగణ్

హైదరాబాద్‌లో మరో ప్రపంచ స్థాయి ఫిల్మ్‌ సిటీ రానున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో పలు రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 8, 9 తేదీల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సదస్సులోనే బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ ఫిల్మ్‌ సిటీ నిర్మాణానికి ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుని సంతకాలు చేయనున్నారు.

17. జో బైడెన్‌ సంతకాలు చెల్లవు: డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ తన పదవీకాలంలో ఆటోపెన్‌ ఉపయోగించి సంతకాలు చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులు ఏవీ చెల్లవని ప్రకటించారు. అవి నిరుపయోగం అని తెలిపారు.

18. ట్యాక్సీ యాప్ వచ్చేస్తుంది

ప్రైవేట్ కంపెనీల అధిక ఛార్జీల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో భారత్ ట్యాక్సీ యాప్‌ను తీసుకురానున్నట్లు హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులకు తక్కువ ఛార్జీలు, డ్రైవర్లకు సున్నా కమిషన్ లభించేలా డిజైన్ చేస్తున్నారు. సహకార సంస్థల దన్నుతో పనిచేసే ఈ యాప్‌ను సహకార్ ట్యాక్సీ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహిస్తుంది.

19. రిటర్న్ అఫ్ హార్దిక్ పాండ్య

టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య పునరాగమనం అదిరింది. గాయం నుంచి కోలుకుని వచ్చిన ఈ ఆల్‌రౌండర్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తాచాటాడు. హార్దిక్‌ చెలరేగడంతో ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన గ్రూపు-సి మ్యాచ్‌లో బరోడా 7 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది.

20. మీడియా తప్పుచేస్తుంది: జాన్వీ కపూర్‌

నటి జాన్వీ కపూర్‌ ప్రముఖుల మరణాల సమయంలో మీడియా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తల్లి శ్రీదేవి మరణించినప్పుడు అవాస్తవాలు రాయడం, ఆమె బాధను హేళన చేస్తూ మీమ్స్ చేయడం బాధించిందన్నారు. ధర్మేంద్ర విషయంలోనూ ఇలాగే దిగజారి ప్రవర్తించారని మండిపడ్డారు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×