E-Paper
Advertisement

Railway Projects: ఐదు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్!

Railway Projects: ఐదు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్!
Advertisement

TG Railway Projects: తెలంగాణలో పలు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోద తెలిపింది. ఈ మేరకు రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో మూడు ట్రాక్షన్‌ సబ్‌ స్టేషన్ల సామర్థ్యం పెంపుతో పాటు ఐదు ప్రత్యేక రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. భూసేకరణ, నిర్మాణం, నిర్వహణ వేగవంతం చేసేందుకు నిర్ణయం తుసుంది. ఈ మేరకు ఐదు ప్రాజెక్టులకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఐదు రైల్వే ప్రాజెక్టులు ఇవే!

Advertisement

⦿ తాజా ఉత్తర్వులలో భాగంగా సికింద్రాబాద్‌-కాజీపేట సెక్షన్‌లో విద్యుత్‌ లైన్ల సామర్థ్యం పెంచేందుకు ఘట్‌ కేసర్, ఆలేరులలో కొత్త ట్రాక్షన్‌ సబ్‌స్టేషన్లు నిర్మిస్తారు. దీనికి సంబంధించి భువనగిరి, కీసర ఆర్డీవోలను భూసేకరణ, పనుల పర్యవేక్షణ ప్రత్యేక అధికారులుగా రైల్వేశాఖ నియమించింది.

⦿ పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుత లెవెల్‌ క్రాసింగ్‌ల స్థానంలో మూడు కొత్త రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి కూడా అనుమతి ఇచ్చింది. పెద్దపల్లి-రాఘవపూర్, రాఘవపూర్‌-రామగుండం సెక్షన్లలోని లెవెల్‌ క్రాసింగ్‌ నంబర్లు 40, 46, 49 వద్ద ఈ ఆర్వోబీలను చేపట్టనున్నారు.

Advertisement

⦿ డోర్నకల్‌ జంక్షన్‌ వద్ద 10.5 కిలోమీటర్ల పొడవు గల  రైల్‌ ఓవర్‌ రైల్‌ (ఆర్వోఆర్‌) ఫ్లైఓవర్‌ నిర్మించనున్నారు.

⦿ ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల పరిధిలో ఆర్వోఆర్‌ ఫ్లైఓవర్‌ రానుంది.

10 ఏళ్ల తర్వాత కొత్త రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్

అటు రాష్ట్రంలో 10 ఏళ్ల తరువాత నూతన రైల్వే లైన్‌ కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాదాపు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రామగుండం–మణుగూరు రైల్వే లైన్ నిర్మాణానికి సూత్రప్రాయ ఆమోదం లభించింది. సుమారు 4,000 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే మార్గం నిర్మించేందుకు ఓకే చెప్పింది. ఈ కొత్త రైల్వే లైన్ తో సింగరేణి కార్మికులు, భక్తులు, స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభించనుంది. అదే సమయంలో బొగ్గు రవాణా వేగవంతం అవుతుంది. విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలకు లాభం కలుగుతుంది. సమ్మక్క-సారక్క జాతరకు వెళ్ళే వేలాది భక్తులకు ప్రత్యేక కనెక్టివిటీ ఇస్తుంది.

Read Also:  పొగమంచు ఎఫెక్ట్.. 2 నెలల పాటు పలు రైళ్లు రద్దు!

రైల్వే మార్గం రోడ్లు, జాతీయ రహదారి NH-63, ప్రాంతీయ రవాణా వ్యవస్థలతో సమన్వయం అవుతుంది. పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాల మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ పారిశ్రామిక, సామాజిక అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు.

Read Also:  ప్రయాణీకులకు గుడ్ న్యూస్, తిరుపతికి అదనపు రైళ్లు!

Related News

బెంగళూరు–విజయవాడ ప్రయాణానికి కొత్త దారి.. ఏకంగా 110 కి.మీ తగ్గనున్న దూరం!

మగ జీవులను నీచంగా చూసే.. భయంకరమైన ఆడ జంతువులు.. ఇవి చాలా డేంజర్ భయ్యా!

ఇండియన్ బుల్లెట్ రైల్ రెడీ.. ఇక పట్టాలు ఎక్కుడే తరువాయి..

భూగర్భంలో వింత నగరం.. ఏకంగా 20 వేల మంది హ్యాపీగా ఉండొచ్చు.. ఇంతకి ఎక్కడుందో తెలుసా?

భోగాపురం నుంచి అంతర్జాతీయ సర్వీసులు, అక్టోబర్ 27 నుంచి మరొక దేశానికి, వారానికి రెండు సార్లు

శ్రీకృష్ణుడి ద్వారకా తరహాలో.. సముద్ర గర్భంలో దాగి ఉన్న.. టాప్-5 ప్రాచీన నగరాలు ఇవే!

నాగార్జునసాగర్ టూర్ ఇక మరింత థ్రిల్లింగ్.. సరికొత్త అడ్వెంచర్ స్పాట్ గా ఎత్తిపోతల జలపాతం!

ఓరి దేవుడా.. కుక్కను వెతుక్కుంటూ వెళ్తే.. 17 వేల ఏళ్ల నాటి అద్భుతాలు బయటపడ్డాయ్!

Big Stories

Advertisement
×