E-Paper
Advertisement

Top 20 News: మంత్రివర్గం నుంచి పవన్ కళ్యాణ్‌ను బర్తరఫ్ చేయాలి.. ఫార్ములా ఈ-కారు రేసులో కొత్త మలుపు

Top 20 News: మంత్రివర్గం నుంచి పవన్ కళ్యాణ్‌ను బర్తరఫ్ చేయాలి.. ఫార్ములా ఈ-కారు రేసులో కొత్త మలుపు

1. దుమ్ము రేపుతున్న పవన్ వ్యాఖ్యలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాని డిమాండ్ చేశారు సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ నారాయణ. పవన్ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య ఐక్యతకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన అన్నారు. సాంకేతికంగా విడిపోయినా, ప్రజలంతా కలిసే ఉన్నారని, సీఎం రేవంత్ రెడ్డి తన కుమార్తెను ఆంధ్ర ప్రాంతం వారికి ఇచ్చి వివాహం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

2. ఫార్ములా ఈకార్-రేస్‌ కేసులో కొత్త మలుపు

ఫార్ములా ఈకార్-రేస్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐఏఎస్‌ అరవింద్‌కుమార్‌పై ఏసీబీ విచారణకు సిద్దమైంది. ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ డీవోపీటీకి సీఎస్ లేఖ రాశారు. అరవింద్‌కుమార్‌పై చర్యలకు అనుమతి కోరారు సీఎస్‌. ఇప్పటికే కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతినిచ్చారు.

3. పవన్ వ్యాఖ్యలను ఖండించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణ విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పటివరకు ఎందుకు క్షమాపణ చెప్పడం లేదని అనిరుధ్ రెడ్డి నిలదీశారు. క్షమాపణ చెప్పేంత వరకు జడ్చర్లలో పవన్ సినిమాలు ఆడనిచ్చేది లేదని తేల్చి చెప్పారు.

4. భూమి వేలంలో ప్రభుత్వానికి రెండు వేల కోట్ల ఆదాయం

హైదరాబాద్‌లోని కోకాపేట నియోపోలిస్ భూములకు మూడో విడత వేలం జరగనుంది. ఈరోజు హెచ్ఎండీఏ నిర్వహించే వేలంలో 19, 20 ప్లాట్ నంబర్‌లోని భూములను వేలం వేయనుంది. మొత్తం ఎనిమిది ఎకరాల్లో వేలం నిర్వహించనుంది. ఇప్పటికే రెండు విడతల్లో నాలుగు ప్లాట్లలోని 19 ఎకరాలకు హెచ్ఎండీఏ వేలం నిర్వహించింది. ఈ వేలంలో ప్రభుత్వానికి 2 వేల708 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.

5. ఏపీలో చార్టర్డ్ విమానాల రగడ.. వైసీపీ, టీడీపీల మధ్య డైలాగ్ వార్

చార్టర్డ్ విమానాల వాడకంపై ఏపీలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. ప్రస్తుతం వైసీపీ, టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. అధికారిక పర్యటనల కోసం చార్టర్డ్‌ విమానాలను ఉపయోగిస్తున్నారని.. మంత్రి లోకేష్‌ ఇప్పటి వరకు 77సార్లు హైదరాబాద్‌కు వెళ్లారని.. ఇలా వెళ్లిన ప్రతీసారి ప్రత్యేక విమానాలను ఉపయోగించారని ఆరోపించారు. అయితే లోకేష్‌ సొంత ఖర్చులతోనే వెళ్లారంటూ క్లారిటీ ఇచ్చింది

6. సీఎం రేవంత్ స్పందన

హైదరాబాద్‌లోని హయత్ నగర్ వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడి ఘటనపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. మూగ బాలుడు ప్రేమ్‌చంద్‌కు మెరుగైన వైద్యం ఆందిచాలని ఆదేశించారు. తక్షణ సాయం అందించాలని సీఎంఓకి సూచించారు. బాలుడిని స్వయంగా పరామర్శించి, బాగోగులు తెలుసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.

7. గంజాయి మత్తులో యువత

సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. పుట్టయ్య కాంప్లెక్స్ వద్ద స్థానికులపై దౌర్జన్యానికి పాల్పడింది. సుమారు 20 మంది యువకులు గంజాయికి అలవాటు పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ యువకుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. అయిన్నప్పటికీ, గంజాయి బ్యాచ్ ఆగడాలను పోలీసులు అరికట్టలేకపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

8. వైసీపీ ఫణీంద్ర రాసలీలలు

శింగనమల వైసీపీలో ఫణీంద్ర రాసలీలల వీడియో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఫణీంద్రను వైసీపీ ఇంచార్జ్‌ శైలజనాథ్‌ మందలించారు. ఇవాళో, రేపో పార్టీ నుంచి సస్పెండ్‌ చేసే ఛాన్స్‌ ఉంది. వైరల్‌ అయిన వీడియోపై వైసీపీలో తీవ్ర చర్చ నడుస్తోంది.

9. తప్పుడు ఆరోపణల కారణంగా యువకుడు మృతి

కృష్ణా జిల్లా యడదిబ్బ గ్రామంలో పదవ తరగతి విద్యార్థి యశ్వంత్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుక్కను కొట్టడానికి వెళ్ళిన తన కుమారుడిపై ఇతరులు 1500 డబ్బులు దొంగిలించాడనే నింద వేశారని తండ్రి రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తామన్నా తీసుకోకుండా.. భవిష్యత్తులో ఇంట్లో ఏది పోయినా యశ్వంత్‌దే బాధ్యత అని బెదిరించారని తండ్రి ఆరోపించారు.

10. మెడికల్ కాలేజీలో ఘర్షణపై చర్యలు తీసుకున్న పోలీసులు

ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో జరిగిన ఘర్షణపై సీరియస్‌గా స్పందించారు పోలీసులు. సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదుతో ఏలూరు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి థర్డ్ ఇయర్ చదువుతున్న నలుగురు మెడికోలపై FIR నంబర్ 311/25 తో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

11. పెళ్లిలో గొడవ.. చిన్నారి మృతి

పెద్దపల్లి జిల్లా దేవునిపల్లిలో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం విషయంలో భార్యభర్తల మధ్య జరిగిన గొడవ పది నెలల చిన్నారి ప్రాణాలను బలిగొంది. దేవునిపల్లికి చెందిన శేర్ల హరీశ్ తన వివాహేతర బంధాన్ని ప్రశ్నించిన భార్య భవానితో గొవడ పడ్డాడు. గత నెల 18న పది నెలల పాప విష్ణు ప్రియను హరీశ్ కాలితో తన్ని, మంచానికి బాదాడు.

12. ఔటర్ రింగ్ రోడ్డుకు సిటీ నుంచి మరో కొత్త ఎక్స్‌ప్రెస్ వే

ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిటీ లోపలి నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు వేగంగా చేరుకునేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌ – సైబరాబాద్‌ను అనుసంధానం చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందించాలని హెచ్‌ఎండీఏకు ఆదేశాలు జారీ చేసింది.

13. ఎయిర్ పొల్యూషన్ లో ఢిల్లీ తో పోటీ పడుతున్న హైదరాబాద్

ఢిల్లీలో వాయుకాలుష్యం కాటుకు ప్రజలు ముప్పు తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ఇవే పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి. చలికాలంలో పొగమంచుకు ఇప్పుడు పొల్యూషన్ కూడా తోడయ్యింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లు ఉండాల్సిన దానికంటే రెట్టింపు రీడింగ్స్‌ను చూపిస్తున్నాయి.

14. డ్రగ్స్ ఒవర్ డోస్ తో మరణించిన ఇద్దరు యువకులు

హైదరాబాద్‌ చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రోమన్ హోటల్ ఎదురుగా ఉన్న ఓ ప్యాసింజర్ ఆటోలో ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతులను ఝంగీర్, ఇర్ఫాన్‌గా గుర్తించారు. డ్రగ్స్ ఒవర్ డోస్ కావడంతో మరణించిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

15. మామిడి రైతుల ఆందోళన

చిత్తూరు జిల్లా గుడిపాల తాజా మాంగో జ్యూస్ ఫ్యాక్టరీ ఎదుట మామిడి రైతులు ధర్నా చేపట్టారు. ఆరు నెలలుగా డబ్బులు చెల్లించలేదని చెన్నై-బెంగళూరు హైవేపై బైఠాయించారు మామిడి రైతులు. కిలో మామిడికి రూ.8 ఇస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం ఇప్పుడు రూ.4 ఇస్తామనడంతో మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో మామిడికి రూ.8 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

16. మల్లికార్జున్ ఖర్గే తో తెలంగాణ సీఎం, మంత్రులు భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. సీఎంతో పాటు ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ షట్కర్, రఘువీర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కడియం కావ్యలు ఖర్గేను కలిశారు.

17. మూడో రోజుకు చేరిన పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్ సమావేశాలు మూడో రోజుకు చేరాయి. నేడు లేబర్ కోడ్స్‌ను వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన నిర్వహించనున్నాయి. పార్లమెంట్‌లో ఇండి కూటమి పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశం కానున్నారు. ఈ భేటీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.

18. శివ నిర్వాణతో రవితేజ

కథానాయకుడు రవితేజ సినిమాల విషయంలో జోరు చూపిస్తున్నారు. ఇటీవలే ‘మాస్‌ జాతర’తో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన.. సంక్రాంతి బరిలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో సందడి చేయనున్నారు. ఈలోగానే మరో కొత్త సినిమాని పట్టాలెక్కించేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ముస్తాబవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో చకచకా కొనసాగుతోంది.

19. బీసీసీఐ షరతులను అంగీకరించిన కొహ్లీ

అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనపుడు ఫిట్‌నెస్, ఫామ్‌ కాపాడుకునేందుకు దేశవాళీ టోర్నీల్లో ఆడాలన్న బీసీసీఐ షరతుకు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సరే అన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24 నుంచి జరిగే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీకి తాను అందుబాటులో ఉంటానని తన రాష్ట్ర జట్టు దిల్లీకి అతను సమాచారం ఇచ్చాడు. ఈ విషయాన్ని దిల్లీ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు రోహన్‌ జైట్లీ ధ్రువీకరించాడు.

 

20. ఆపరేషన్ సింధూర్ డ్రోన్లను మళ్ళి కొంటున్నారు

అత్యవసర నిబంధనల కింద అదనంగా హెరాన్‌ మార్క్‌-2 డ్రోన్లను కొనుగోలు చేయడానికి భారత్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇజ్రాయెల్‌ రక్షణ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్‌ సిందూర్‌ భారత సైనిక దళాలకు ఇవి బాగా ఉపయోగపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×