నేడే తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్. రెండ్రోజుల అంతర్జాతీయ సదస్సు నేడే ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరుకాన్నారు. మధ్యాహ్నం గ్లోబల్ సంబరాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభి స్తారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.
దేశవ్యాప్తంగా ఇండిగో విమాన కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనిపై పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వడానికి ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ అదనంగా ఒక రోజు గడువు కోరారు. ఇండిగో విజ్ఞప్తి మేరకు DGCA అదనంగా 24 గంటల సమయాన్ని మంజూరు చేసింది.
తెలంగాణలోని జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేపు ఆవిష్కరించనున్నారు. ఈమేరకు సీఎస్ రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన మూడు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కేరళ-హైదరాబాద్ ఇండిగో ఎయిర్‌లైన్స్.. ఫ్రాంక్‌ఫర్ట్-హైదరాబాద్ లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్.. లండన్-హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్‌లైన్స్‌కు బెదిరింపులు వచ్చాయి. మూడు విమానాలు సేఫ్ ల్యాండింగ్ అయ్యాయి. వెంటనే ప్రయాణికులను ఐసోలేషన్‌కు తరలించారు.
ఏపీ సీఎం చంద్రబాబు విశాఖపట్నం నగర అభివృద్ధిపై కీలక ప్రకటన చేశారు. నగరంలో త్వరలోనే ఆధునిక సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సివిక్ అప్పోజిషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్టుకు బదులిస్తూ సీఎం ఈ హామీ ఇచ్చారు.
కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీ కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. కాంట్రాక్టర్ ఇంతియాజ్‌ను మావోయిస్టులు హత్య చేశారు. ఇక ఇంతియాజ్‌ను చంపేశారని పోలీసులు సైతం నిర్ధారించారు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఇరాపల్లిలో వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపింది. కాగా.. నిన్న సాయంత్రం ఇంతియాజ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
గుంటూరు జిల్లా మంగళగిరి ఇందిరానగర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కృష్ణుడి విగ్రహం తొలగింపుపై వివాదం నెలకొంది. మంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి విగ్రహాన్ని తొలగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది విగ్రహం తొలగింపు పనులు మొదలుపెట్టారు. అయితే విగ్రహం కదిలిస్తే ఊరుకోమంటూ యాదవసంఘాలు ఆందోళన చేస్తున్నాయి.
శ్రీసత్యసాయి జిల్లా ఎర్రదొడ్డి గంగమ్మ గుడి ఆలయ ఈవో మురళీకృష్ణ చేతివాటం ప్రదర్శించారు. ఐదు కిలోల వెండి ఆభరణాలు, ఖరీదైన చీరలు చోరీ చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దీంతో ఈవోపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం చాన్నాళ్లుగా జరుగుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరు జిల్లాలో మరో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసు నమోదైంది. ఇప్పటికే రెండు కేసులు నమోదు కాగా, తాజాగా నూజివీడుకు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి ఈ వ్యాధి నిర్ధారణ అయింది. గత నెల 29న తీవ్ర జ్వరం, మలబద్దకంతో ఏరియా ఆసుపత్రిలో చేరిన అతనికి, చికిత్సలో భాగంగా ఎలీసా టెస్ట్ చేయగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా తేలింది.
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో దారుణం జరిగింది. రాయచోటిలోని లక్ష్మీపురంలో ఉండే ఓ వ్యక్తి రాత్రి 3 గంటల సమయంలో బైక్ మీద తన ఇంటికి వెళుతున్న సమయంలో కుక్కలు వెంట పడ్డాయి. కుక్కల బారి నుంచి తప్పించుకోవాలని వెహికల్ స్పీడ్ పెంచాడు. ఆ క్రమంలో ఎదురుగా ఉన్న గుడిని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు.
ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నిన్న పోలింగ్ ముగియగా.. ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 15 స్థానాల కోసం ఎన్నికలు జరగగా.. 31 మంది బరిలో నిలిచారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు దిగారు. స్టీల్‌ప్లాంట్‌లో మిగిలిన భూమిని నిర్వాసితులకు.. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేయాలని ఆందోళన చేస్తున్నారు. లేదంటే అప్పటివరకు జీవన భృతి చట్టాన్ని అమలుచేయాలని ప్రతి ఆధార్ కార్డు.. కుటుంబానికి 25 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాను చలి వణికిస్తోంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత అత్యల్పంగా నమోదవుతున్నాయి. గ్రామాల్లో మంచు దుప్పటి కప్పుకొని ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. దీంతో గిరిశిఖర ప్రాంతాలు రద్దీగా మారుతున్నాయి.
పరకామణి చోరీ విషయంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఫైరయ్యారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. తాను చాలా పెద్ద తప్పు చేశానని స్వయంగా నిందితుడు రవికుమార్ చెప్పినా.. జగన్ ఈ అంశాన్ని చాలా చిన్నదని అనడాన్ని తప్పుపట్టారు. లక్షల కోట్లు దోచుకున్న జగన్.. ఈ కేసు చాలా చిన్నదని చెప్పడంలో ఆశ్చర్యం లేదని ఆరోపించారు బుద్దా వెంకన్న.
మనాలీలో సందర్శకుల తాకిడి గణనీయంగా పెరిగింది. శీతాకాలం నేపథ్యంలో అక్కడి ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలిని అనుభూతి చెందడానికి ఇక్కడికి వస్తున్నట్లు పర్యాటకులు తెలిపారు.
అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలోవేయ మరోసారి విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా ఉబికి వస్తోంది. 100 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతోంది. హవాయి జాతీయ ఉద్యానవనం లోపల ఉన్న కాల్డెరాలోనే లావా నిలిచిపోయిందని స్పష్టం చేశారు.
దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో దారుణం జరిగింది. ప్రిటోరియా సమీపంలోని ఓ హాస్టల్‌లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది మృతిచెందగా.. మరో 14 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. సాయుధులైన ముగ్గురు వ్యక్తులు హాస్టల్‌లోకి చొరబడ్డారు. 25 మందిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు.
భారత యువ షూటర్ సురుచి సింగ్ షూటింగ్ ప్రపంచకప్ ఫైనల్లో పసిడితో మెరిసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో స్వర్ణం సొంతం చేసుకుంది. మరో భారత షూటర్ సంయమ్ సింగ్ రజతం గెలుచుకుంది. ఈ ఏడాది ప్రపంచకప్‌లో నాలుగు స్వర్ణాలు సొంతం చేసుకున్న సురుచి ప్రపంచకప్ ఫైనల్లోనూ అంచనాలను అందుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 ఫిఫా ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నమెంట్, మునుపటి కంటే భిన్నంగా సరికొత్త ఫార్మాట్‌లో జరగనుంది. ఈసారి 32 జట్లకు బదులుగా ఏకంగా 48 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి.
గుమ్మడి నర్సయ్య సినిమా కోసం తెలుగు నేర్చుకుంటాన్నారు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవితంపై సినిమా రానున్న విషయం తెలిసిందే. గుమ్మడి నర్సయ్య పేరుతో రానున్న ఈ మూవీలో ఆయన నటిస్తున్నారు.