పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్.. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన ఈఓఎస్-ఎన్1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపుతున్నారు. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇది.
సంక్రాంతి పండగ తర్వాత మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈనెల 16న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పర్యటన ప్రారంభిస్తా రు. తర్వాత బహిరంగసభలో ప్రసంగిస్తారు. 16వ తేదీన సదర్‌మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవంతోపాటు, చనాఖా-కోర్టు ప్రాజెక్టు సందర్శన, సభ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
సంక్రాంతి పండగ సందర్భంగా నారావారిపల్లెకు వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. కుటుంబ సభ్యులతో కలిసి మూడు రోజుల పాటు నారావారిపల్లెలో గడపనున్నారు. అలాగే ఈ నెల 13, 14 తేదీల్లో స్వర్ణ నారావారిపల్లి అభివృద్ధిలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ తన సతీమణితో కలిసి షిరిడీ సాయినాధుని దర్శించుకున్నారు. ఆలయంలో జరిగిన కాకడ హారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వారు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ సభ్యులు, అధికారులు లోకేష్ దంపతులకు స్వాగతం పలికి.. దుశ్శాలువతో సత్కరించారు. పూజల అనంతరం వారు స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
తెలంగాణలో భూ భారతి స్టాంప్ డ్యూటీ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ప్రజలు చెల్లించిన సొమ్మును పక్కదారి పట్టించడంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనగాం సహా పలు జిల్లాల్లో భూభారతిలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో గత ఐదేళ్లలో జరిగిన లావాదేవీలపైనా పూర్తిస్థాయిలో ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు.
టోల్‌ప్లాజాల వద్ద సంక్రాంతి రద్దీ కొంత మేర తగ్గుముఖం పట్టింది. పండుగ కోసం ఇప్పటికే చాలా మంది శని, ఆదివారాల్లో సొంతూళ్లకు వెళ్లడంతో ఓ మోస్తరుగా మాత్రమే రష్ నెలకొంది. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు సాఫీగా వెళుతున్నాయి.
ఖమ్మంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో భాగంగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఓ మందుబాబు బైక్‌తో ఢీకొట్టాడు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని కానిస్టేబుల్ రాము ఆపేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో బైక్ ఆపకుండా కానిస్టేబుల్ ఢీకొట్టాడు. దీంతో కింద పడిపోయిన కానిస్టేబుల్ రాము తలకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్‌కు తరలించారు. మరోవైపు బైక్ నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో SOT పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ముత్తంగి ORR టోల్ గేట్ వద్ద్ డీసీఎంలో తరలిస్తున్న 92 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్‌కు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి తరలిస్తున్న సోలాపూర్‌కు చెందిన గంగారాం, మహేష్, విజయ్ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి పటాన్‌చెరు పోలీసులకు SOT పోలీసులు అప్పగించారు. వీరి వద్ద నుంచి 11 వేలు నగదు, కారు, డీసీఎం వ్యాన్‌ను సీజ్ చేశారు.
హైదరాబాద్ బోరబండలో దారుణం జరిగింది. తనతో సరిగా మాట్లాడటంలేదన కోపంతో ఓ యువతిని యువకుడు హతమార్చాడు. గతంలో పబ్‌లో పరిచయమైన ఆమె, ఇటీవల మరో బార్‌లో చేరి తనతో సరిగ్గా మాట్లాడకపోవడంతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉండగా.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని కేశంపేటలో విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన బీహార్‌కు చెందిన గుడ్డు కుమార్ యాదవ్ అనే యువకుడ.. తాను సంపాదించిన డబ్బునంతా పోగొట్టుకుని మనస్తాపంతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 6న అదృశ్యమైన అతని మృతదేహం చౌలపల్లి రహదారి సమీపంలో లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సంక్రాంతి పండగా నేపథ్యంలో ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బస్సులను కూకట్‌పల్లిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏడు బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇటు ఎటువంటి నిబంధనలు పాటించకుండా వస్తున్నవారిపై చర్యలు తీసుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను ఢీకొట్టి నుజ్జునుజ్జైంది ఓ కారు. కారును తప్పించబోయి డివైడర్ ఎక్కేసింది మరో కంటైనర్ లారీ. కారులో ఎయిర్‌బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు ప్రయాణికులు. జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సందడి నెలకొంది. ఈత పోటీలతోపాటు ఫుడ్ ఫెస్టివల్‌ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. అదేవిధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చూసేందుకు పెద్ద ఎత్తు న ప్రజలు తరలిరావడంతో ఆత్రేయపురంలో సందడి వాతావరణం నెలకొంది. ఇక పడవల పోటీల్లో పాల్గొనేందుకు నాలు గు రాష్ట్రాల నుంచి పోటీదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అనకాపల్లి జిల్లా పరవాడ సేఫ్ జోన్ షాప్‌లో ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి సర్వీస్ టెక్నీషియన్ మృతి చెందాడు.ఫైర్ ఎక్స్టింగ్విషర్ సిలిండర్‌లో గ్యాస్ నింపుతుండగా ప్రమాదం జరిగింది. డ్రై కెమికల్ పౌడర్ నింపిన అనంతరం.. నై ట్రోజన్ గ్యాస్ అధికంగా నింపడంతో గ్యాస్ సిలిండర్ పేలడంతో సర్వీస్ టెక్నీషియన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్‌గేట్ వద్ద వాహనాల రద్దీ తగ్గుతోంది. నిన్న,మొన్న విపరీతంగా ఉన్న రద్దీ ఇవాళ క్రమ క్రమంగా తగ్గుతోందని పోలీసులు చెబుతున్నారు.గత మూడు రోజులుగా 70 వేల వాహనాలు టోల్‌గేట్ దాటినట్టు టోల్ నిర్వాహకులు చెబుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే పటిష్ట ఏర్పాట్లు చేశారు పోలీసులు.
దేశవ్యాప్త వాయు కాలుష్యంపై కేంద్రం స్పందన సరిగ్గా లేదని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం విఫలమైందని, ఐదేళ్లలో పీఎం 2.5 స్థాయిలు పెరిగాయని ఆరోపించారు. దేశంలోని 44 శాతం నగరాలు తీవ్ర కాలుష్యంతో ఉన్నాయని సీఆర్‌ఈఏ నివేదికను ఆయన ఉటంకించారు.
సరిహద్దు వెంబడి పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. జమ్మూకాశ్మీర్‌లోని ఓల్‌ఓసీ వద్ద డ్రోన్లు కలకలం రేపా యి. సాంబా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లో డ్రోన్ల కదలాడాయి. మొ త్తం ఐదు డ్రోన్లను భద్రతా దళాలు గుర్తించాయి. ఆ వెంట నే ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తనను తాను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. వికీపీడియా తరహాలో ఎడిట్ చేసిన ఫోటోను ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఇటీవల అమెరికా దాడుల తర్వాత అధ్యక్షుడు మదురోను నిర్బంధించగా.. ప్రస్తుతం డెల్సీ రోడ్రిగ్జ్ అక్కడ తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తమిళ సినీ నటుడు అరుణ్ విజయ్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆయనకు.. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. మార్చిలో ప్రారంభం కానున్న తన కొత్త చిత్రం విజయవంతం కావాలని స్వామివారి ఆశీస్సులు కోరుకున్నట్లు అరుణ్ విజయ్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఘనవిజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టింది. విరాట్ కోహ్లి తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ సెంచరీకి చేరువవ్వగా, గిల్, అయ్యర్, రాహుల్ రాణించారు. టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లి.. వన్డేల్లో మాత్రం పరుగుల ప్రవాహంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.