E-Paper
Advertisement

BCCI: నోరు మూసుకుని, మేం చెప్పిన‌ట్లే ఆడాలి.. కోహ్లీ, రోహిత్ ప‌రువు తీసిన బీసీసీఐ

BCCI: నోరు మూసుకుని, మేం చెప్పిన‌ట్లే ఆడాలి.. కోహ్లీ, రోహిత్ ప‌రువు తీసిన బీసీసీఐ
Advertisement

BCCI: టీమిండియాకి ఆడాలంటే దేశవాళి టోర్నీలు ఆడాల్సిందే..! బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫెయిల్యూర్ తర్వాత బీసీసీఐ తీసుకు వచ్చిన కొత్త నిబంధన ఇది. భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తే చాలు.. ఇక దేశవాళిల్లో ఆడాల్సిన అవసరం లేదని ఫీల్ అయిపోయిన క్రికెటర్లకు ఈ రూల్ తో గట్టి షాక్ తగిలింది. అప్పుడెప్పుడో 9 సంవత్సరాల క్రితం దేశవాళీ క్రికెట్ ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు.. 13 ఏళ్ల పాటు దేశవాళి మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ ఈ ఏడాది ప్రారంభంలో రంజీ మ్యాచ్ లు ఆడారు.

Also Read: IPL 2026 Released Players List: 10 ఫ్రాంచైజీలు రిలీజ్ చేసేది ప్లేయ‌ర్లు వీళ్లే..లిస్ట్ లో ర‌షీద్‌, ష‌మీ కూడా?

Advertisement

అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టి-20, టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. అయితే వీరు టీం ఇండియాకు ఆడాలి అంటే.. దేశవాళిల్లో పాల్గొనాల్సిందేనని వీరికి బీసీసీఐ సందేశం పంపింది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ డిసెంబర్ 24 నుండి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే అవకాశం ఉంది.

విరాట్ కోహ్లీ – రోహిత్ శర్మకు బిసిసిఐ స్పష్టమైన సందేశం:

రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీకి బీసీసీఐ స్పష్టమైన సందేశం పంపింది. భారత్ కోసం ఆడాలంటే తప్పకుండా దేశవాళిల్లో ఆడాల్సిందేనని తేల్చిచెప్పింది. వన్డేల్లో ఆడాలంటే మ్యాచ్ ఫిట్నెస్ కోసం వారు దేశవాళీల్లో ఆడాలని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. లేదంటే జట్టులో చోటు కష్టమేనని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో తాను విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ముంబై క్రికెట్ అసోసియేషన్ కి సమాచారం అందించినట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ 26 నుండి ప్రారంభం కాబోతున్న సయ్యద్ ముస్తక్ అలీ టీ-20 టోర్నమెంటులో కూడా పాల్గొనేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని {MCA} కి తెలిపాడు రోహిత్ శర్మ. ఇక సౌత్ ఆఫ్రికా – భారత్ మధ్య నవంబర్ 30 నుండి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అతడు సయ్యద్ ముస్తక్ అలీ టోర్నమెంట్ లో చాలా తక్కువ మ్యాచులు మాత్రమే ఆడే అవకాశం ఉంది.

విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ పాల్గొంటాడా..?

Advertisement

విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటాడా..? లేదా..? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కోహ్లీ చివరిసారిగా 2010లో ఢిల్లీ తరఫున ఈ టోర్నీలో పాల్గొన్నాడు. క్రీడావర్గాల సమాచారం ప్రకారం బీసీసీఐ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పై కఠినమైన విధానాన్ని అవలంబిస్తోంది. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు దేశవాలి క్రికెట్ లో పాల్గొనకపోతే రాబోయే 2027 ప్రపంచ కప్ జట్టులో వీరిని ఎంపిక చేయమని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ వార్త క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

Also Read: Arshdeep Singh: రూ.4 కోట్ల కారు కొన్న అర్ష్‌దీప్ సింగ్..మైలేజ్‌, ఫీచ‌ర్స్ తెలిస్తే దిమ్మ‌తిరిగిపోవాల్సిందే

కొన్ని సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తరచుగా విశ్రాంతి పేరుతో కొన్ని అంతర్జాతీయ సిరీస్ లకు దూరంగా ఉండేవారు. ఈ సమయంలో వారు దేశవాళీ టోర్నమెంట్లకు కూడా దూరంగా ఉండేవారు. కానీ యువ ఆటగాళ్లు తమ స్థానాల కోసం దేశవాళీ టోర్నీలో కష్టపడేవారు. అయితే ఇప్పుడు బీసీసీఐ ఈ విధానానికి చెక్ పెట్టింది. ఎంత పెద్ద పేరున్న ఆటగాడైనా సరే.. దేశవాళి క్రికెట్ కి దూరంగా ఉండకూడదని బోర్డు స్పష్టం చేసింది. ఈ కఠిన వైఖరి భారత జట్టులో క్రమశిక్షణను పెంచడానికి, పోటీ వాతావరణాన్ని సృష్టించడానికి ఉద్దేశించబడింది. 2027 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఆడాలంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పుడు తమ ఆటతో తమను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

Tags

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×