E-Paper
Advertisement

Top 20 News Today: పేలిన పెయింట్ డబ్బాలు.. ఆలయంలో చోరి.. తెలుగు యువతి హత్య

Top 20 News Today: పేలిన పెయింట్ డబ్బాలు.. ఆలయంలో చోరి.. తెలుగు యువతి హత్య

1. పెనుప్రమాదం నుంచి బయటపడ్డ విప్ ఆది శ్రీనివాస్

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పరిశీలిస్తుండగా.. బేస్‌మెంట్‌ కుంగింది. ఒక్కసారిగా ఎక్కువమంది చేరడంతో.. అది కూలిపోయింది. వెంటనే నేతలు, అధికారులు అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నారు.
తప్పిన ప్రమాదం

2. బెంగళూరులో తెలుగు యువతి దారుణ హత్య

చిత్తూరు జిల్లా బిక్కంవారిపల్లి గ్రామానికి చెందిన యువతి దేవిశ్రీ బెంగళూరులో దారుణ హత్యకు గురైంది. దేవిశ్రీ స్నేహితురాలు మానస నమ్మించి ఆమెను బెంగళూరుకి తీసుకెళ్లగా.. పెద్దకొండమర్రి గ్రామానికి చెందిన ప్రేమ్‌ వర్ధన్‌.. దేవిశ్రీని హత్య చేసినట్టు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులు దేవిశ్రీ మృతదేహాన్ని గ్రామానికి తెప్పించి అంత్యక్రియలు నిర్వహించారు.

3. కృష్ణ జిల్లాలో ఉమ్మడి నియోజకవర్గాలు మాకు వద్దు

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నియోజకవర్గాల విలీనంపై ఎమ్మెల్యేలు, మంత్రి మధ్య కొత్త వివాదం రాజుకుంది. గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ఎమ్మెల్యే యార్లగడ్డ డిమాండ్ చేస్తుండగా, స్థానిక ప్రజలు పెనమలూరును కూడా కలపాలని కోరుతున్నారు. రెండు నియోజకవర్గాలు పోతే మచిలీపట్నం చిన్నది అవుతుందని మంత్రి కొల్లు అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రజా ప్రతినిధుల తీరుతో అధికారులు, సీఎం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

4. రహదారి అంటే ఇలానేనా ఉండేది

భద్రాది కొత్తగూడెం జిల్లా మణుగూరులో రహదారి పరిస్థితిపై ఆందోళనకు దిగింది బీఆర్ఎస్ పార్టీ. మాజీ మంత్రి రేగా కాంతారావు పిలుపుతో నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. రహదారుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా… అధికారుల స్పందన లేకపోవడంపై నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎస్ఆర్, డీఎంఎఫ్టీ నిధులు విడుదల చేసి వెంటనే మరమ్మత్తు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

5. బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ నికత్ జరీన్ ను కలిసిన క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి

క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కలిశారు బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ నికత్ జరీన్. ఈ సందర్భంగా నికత్ జరీన్‌ను మంత్రి అభినందించి, శాలువాతో సన్మానించారు. ఇటివల గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ క్రీడాకారిణి నికత్ జరీన్.. భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ సాధించి దేశ, రాష్ట్ర ప్రతిష్టతను మరింత పెంచాలని ఆకాంక్షించారు మంత్రి వాకిటి.

6. అనంతపురంలో ముగిసిన పదవుల పంపకం

అనంతపురం జిల్లా శింగనమల టీడీపీ మండల అధ్యక్షుల పదవుల పంపకం ఎట్టకేలకు పూర్తయింది. గత కొన్ని రోజులుగా పదవుల పంపకం ప్రహసనంగా మారడంతో.. ఎమ్మెల్యే వర్గం వర్సెస్ టూ మెన్ కమిటీగా రగడ కొనసాగింది. చివరికి ఆరు మండలాలకు అధ్యక్షులను టీడీపీ జోనల్ ఇన్‌ఛార్జ్ కోవెలమూడి నాని ప్రకటించడంతో.. విభేదాలకు చెక్ పడినట్లే అని తెలుగు తమ్ముళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

7. ఆకాశాన్ని తాకుతున్న కూరగాయ ధరలు

సామాన్యుడి ఇంట్లో కూరగాయల బదులు పప్పు దినుసులనే వాడాల్సిన పరిస్థితి వచ్చింది. మొంథా తుఫాన్ ప్రభావంతో కూరగాయల దిగుబడులు గణనీయంగా తగ్గాయని, అందుకే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వ్యాపారస్తులు అంటున్నారు. దీంతో మార్కెట్‌లో కూరగాయాల ధరలు చుక్కల్ని చూపిస్తున్నాయి.

8. 93.08 లక్షల అభివృద్ధి కి శ్రీకారం చుట్టిన ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడలో 93.08 లక్షల రూపాయాలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎంపీ కేశినేని చిన్ని. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అమరావతితో పాటు విజయవాడ వేగంగా అభివృద్ధి చెందుతుందని, విజయవాడ అభివృద్ధికి త్వరలో డీపీఆర్ సిద్ధం అవుతోందన్నారు ఎంపీ కేశినేని చిన్ని.

9. ప్రేమ వ్యవహారంలో యువకుడు ఆనంద్ మృతి?

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రేమ వ్యవహారం కారణంగా యువకుడు ఆనంద్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ప్రియురాలి కుటుంబ సభ్యులే అతనికి గడ్డి మందు తాగించి హత్య చేశారని ఆనంద్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆనంద్ మృతిపై మళ్లీ పోస్టుమార్టం చేయాలని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

10. పరారీలో ముడి సరుకుల మాఫియా

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం కస్తూర్బా పాఠశాల నుంచి ముడి సరుకుల అక్రమ తరలింపుపై గ్రామస్తుల ఫిర్యాదుతో విచారణ జరిగింది. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 15 బస్తాల బియ్యం పట్టుబడింది. ఈ సమయంలో హాస్టల్ నిర్వాహకురాలు, ప్రధానోపాధ్యాయురాలు పరారయ్యారు.

11. పేలిన పెయింటింగ్ డబ్బాలు

అనంతపురం జిల్లా ధర్మవరం సాయిబాబా ఆలయం సమీపంలో బొమ్మలు తయారీ చేస్తుండగా పెయింటింగ్ డబ్బాలు పేలాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి, ఒకరి కాలి వేళ్లు తెగిపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ధర్మవరం ఆస్పత్రికి తరలించారు.

12. క్షుద్రపూజల కలకలం

బాపట్ల జిల్లా ఇంకొల్లులో క్షుద్రపూజల కలకలం రేపాయి. పావులూరు రోడ్డులోని రావిచెట్టు డొంక మలుపు సమీపంలో క్షద్రపూజల ఆనవాళ్లు కనిపించాయి. నిమ్మకాయలు, పసుపు, కుంకుమ బొమ్మలు ప్రత్యక్షమవడంతో భయబ్రాంతులకు గురయ్యారు పొలానికి వెళ్లిన రైతులు. క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.

13. బిజినెస్ ఎక్స్‌పో ప్రారంభం

విజయవాడలో ఏపీ చాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పోను ప్రారంభించారు మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్రలు. రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానం అత్యంత సులభమని, దేశవిదేశాల పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. రాయలసీమను పారిశ్రామిక హబ్‌గా తయారు చేస్తున్నారని చెప్పారు.

14. ఆలయంలో చోరీ

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని జంగల్ హనుమాన్ సాయిబాబా, పెద్దమ్మ తల్లి ఆలయం, సత్తెనపల్లి గ్రామంలోని జగదాంబ ఆలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు సీసీ కెమెరాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఆలయాల్లోని సీసీటీవీలు పగలగొట్టి.. డివిఆర్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు ఖానాపూర్ సీఐ అజయ్. ఈ మేరకు ఆయా ఆలయాల కమిటీలు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నామన్నారు సీఐ.

15. చెన్నై-హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైల్

చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును తిరుపతి మీదుగా నడిపేందుకు దక్షిణ మధ్య రైల్యే ప్రణాళికలు ఖరారు చేసింది. తిరుపతి మీదుగా మార్గాన్ని మార్చాలన్న తమిళనాడు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సవరించిన నివేదికను సమర్పించారు. నివేదికకు ఆమోదం లభిస్తే త్వరలోనే భూసేకరణ ప్రారంభం కానుంది.

16. ఎన్నికల కమిషనర్‌కు లేఖరాసిన మమతా బెనర్జీ

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ఎన్నికల పనితీరులో తక్షణం జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. పోల్ డేటా ఎంట్రీ కోసం కాంట్రాక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, బంగ్లా సహాయత కేంద్ర సిబ్బందిని నియమించవద్దంటూ ఈసీ అధికారి ఇటీవల జారీ చేసిన ఆదేశాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

17. వాయిదా పడ్డా ఇజ్రాయెల్ ప్రధాని పర్యటన

ఢిల్లీలో ఇటీవల జరిగిన పేలుడు, భద్రతా కారణాల దృష్ట్యా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటన మరోసారి వాయిదా పడింది. సెప్టెంబర్ 9న జరగాల్సిన పర్యటన రద్దు కావడం ఇది మూడోసారి. ప్రధాని మోదీ, నెతన్యాహుల మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో వచ్చే ఏడాది కొత్త తేదీని ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

18. టీ 20 ప్రపంచ కప్ షెడ్యూల్ వస్తుంది

భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే టీ20 వరల్డ్‌కప్ టోర్నమెంట్ షెడ్యూల్ ఇవాళ విడుదల కానుంది. ఈ ప్రపంచకప్‌ టోర్నీలో 20 జట్లు పాల్గొనున్నాయి. భారత్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్, శ్రీలంక, యూఏఈ, ఒమన్, వెస్టిండీస్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్తాన్, ఆస్ట్రేలీయా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లాండ్, కెనడా, యూఎస్‌ఏ జట్లు తలపడనున్నాయి.

19. కాబోయే భార్యకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన కాబోయే భార్య హరిణ్యా రెడ్డికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. రాహుల్- హరిణ్యా సంగీత్ వేడుకకు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను ఆహ్వానించి, ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా చాహల్‌తో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ… ఈ గిఫ్ట్ జీవితంలో మర్చిపోలేను.. థ్యాంక్స్ రాహుల్ అని పోస్ట్ చేసింది హరిణ్యా.

20. ఆస్కార్ బరిలో ‘మహావతార్ నరసింహ’

ఆస్కార్ అవార్డ్ అనేది ప్రతి ఇండస్ట్రీ కల. వందల కోట్లు సాధించిన ‘మహావతార్ నరసింహ’ చిత్రం 2026 ఆస్కార్ పోటీలో నిలిచింది. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో పోటీ పడుతున్న 35 సినిమాల్లో ఇది ఒకటి. మన దేశం నుంచి ఆస్కార్ బరిలో నిలిచిన తొలి యానిమేటెడ్ చిత్రం ఇదే. ఒక వేళ ఆస్కార్ గెలుచుకుంటే మాత్రం అది మరొక అద్భుతం అవుతుందడంలో ఎలాంటి సందేహంలేదు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×