E-Paper
Advertisement

Top 20 News Today: ప్రయాణికుడిని కొట్టిన రైల్వే అధికారి.. కారు ఢీకొని బైకర్ దుర్మరణం

Top 20 News Today: ప్రయాణికుడిని కొట్టిన రైల్వే అధికారి.. కారు ఢీకొని బైకర్ దుర్మరణం

1. అగ్ని ప్రమాదం ఆ కారు వల్ల కాదు

హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండ క్లాక్ టవర్ దగ్గర గోమతి ఎలక్ట్రానిక్స్‌ ప్రమాదంపై జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ క్లారిటీ ఇచ్చారు. మొదట కారులో ప్రమాదమని అనుకున్నామని.. కానీ గోమతి ఎలక్ట్రానిక్స్‌లోనే పేలుడు జరిగినట్టు నిర్ధారణ అయిందన్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు జాయింట్ సీపీ.

2. ఇందిరా గాంధీ జయంతికి చీరాల పంపిణి

ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 18 ఏళ్లు నిండిన మహిళలకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టర్ వెంకటేష్ దోత్రే పర్యవేక్షణలో 35,758 ఏకరూప చీరల పంపిణీ ప్రారంభమైంది. మొదటి విడత గ్రామీణ ప్రాంతాల్లో, రెండో విడత మున్సిపాలిటీల్లో కార్యక్రామాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే స్వయం సహాయక సంఘాలకు 2.70 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులనూ పంపిణీ చేశారు.

3. సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంను తనిఖీ చేసిన ఈవో కె. దామోదర్ రావు

భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం శేష వస్త్రాల విక్రయశాల కౌంటర్‌లో ఈవో కె. దామోదర్ రావు తనిఖీలు చేశారు. బయటి వస్త్రాలను గుర్తించి, 15 శాల్తీల చీరలు, పంచలు, కండువాలను స్వాధీనం చేసుకున్నారు. స్వామివారికి అలంకరించిన వస్త్రాలనే విక్రయించాలని, పూర్తి విచారణ అనంతరం గుత్తేదారుపై చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.

4. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని వారు తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్లు కట్టించడంలో విఫలమైందని విమర్శిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. తాము ఇస్తున్న చీరలకు మహిళల నుంచి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ..

5. గోమాతను కాపాడిన హిందూ సంఘాలు

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో.. గో అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఆవులను తరలిస్తున్న కంటైనర్‌ను హిందూ సంఘాలు అడ్డగించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి.. కంటైనర్‌ను గోశాలకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

6. వైసీపీకి స్రవంతి రాజీనామా చేశారు: కాకాణి

స్రవంతి వైసీపీకి రాజీనామా చేశారని… ఆమె పార్టీలో లేదన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి. జగన్‌ ఆశీస్సులతో స్రవంతి మేయర్‌గా ఎన్నికయ్యారని తెలిపారు. గిరిజన మహిళగా ఉన్న మేయర్ స్రవంతిని..గతంలో మోసం చేసి వైసీపీకి రాజీనామా చేయించారని అన్నారు. ఆమెపై అవినీతి ఆరోపణలు చేసి అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారని అన్నారు కాకాణి.

7. తెలంగాణ ప్రజలకు మోసం చేయడం తెలీదు

తెలంగాణ ప్రాంత ప్రజలకు మోసం చేయడం తెలియదన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. ఐబొమ్మ ద్వారా పైరసీ చేసింది విశాఖపట్నంకు చెందిన రవి అని గుర్తు చేశారు. అటు సినిమా ఇండస్త్రీలో ఎక్కువ మంది ఏపీకి చెందిన వారే ఉన్నారన్నారు. వేలకోట్లు పెట్టి సినిమాలు తీస్తే లాభపడేది కొందరు మాత్రమే అని చెప్పారు. ఐబొమ్మను ప్రజలు రాబిన్‌హుడ్‌లా చూస్తున్నారని, రవి చేసింది తప్పే అయినా..ప్రజలు అతనికి బ్రహ్మరథం పడుతున్నారంటున్నారు అనిరుధ్ రెడ్డి.

8. అగ్ని ప్రమాదంలో గోమతి ఎలక్ట్రానిక్స్‌ షాపు ఓనర్‌‌కు తీవ్ర గాయాలు

హైదరాబాద్ పాతబస్తీలోని గోమతి ఎలక్ట్రానిక్స్‌ షాపు ఓనర్‌ పరిస్థితి విషమంగా ఉంది. యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం DRDO హాస్పిట్‌లో చికిత్స కొనసాగుతోంది. ఈఘటనలో ముగ్గురు సిబ్బందికి గాయాలు కావడంతో చికిత్స కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.

9. 800 గజాల అసైన్డ్ ల్యాండ్‌ను కాపాడిన హైడ్రా

మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో 800 గజాల అసైన్డ్ ల్యాండ్‌ను కాపాడింది హైడ్రా. చౌదరిగూడలోని అసైన్డ్ ల్యాండ్ సర్వే నెంబర్ 866, 867 లో పర్మిషన్ లేకుండా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తమకు సైట్ అమ్మారని బాధితులు మొరపెట్టుకున్నారు. అసైన్డ్ ల్యాండ్ కబ్జా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని.. కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు హైడ్రా అధికారులు.

10. ఏక్తా మార్చ్ ప్రారంభం

యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు, పాతపట్నంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు సర్దార్ పటేల్ ఏక్తా మార్చ్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు 50 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యేలు సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను కొనియాడారు.

11. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనకు అంతా సిద్ధం

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపటి పర్యటనకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. శివకోటి జాతీయ రహదారి 216 వద్ద సభాస్థలిని ముస్తాబు చేశారు. 10 వేల మంది అంచనాతో 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో ఆయన కొబ్బరి రైతులతో మాట్లాడి, 7 కోట్ల రూపాయలతో 117 గ్రామీణ రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

12. గిరిజనుల ఆందోళన

శ్రీకాకుళం థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ప్లాంట్ ప్రతిపాదనలు రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ గిరిజనులు సంప్రదాయ వస్త్రధారణలో, బాణాలతో ఆందోళన చేపట్టారు. 5 వేల ఎకరాలు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని కమిటీ ఫైర్ అయింది.

13. చేప పిల్లలను వదిలిన ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా నంది వాగు ప్రాజెక్ట్‌ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కూడా పాల్గొన్నారు. ఈ చేప పిల్లల విడుదలతో స్థానిక మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందని నాయకులు తెలిపారు.

14. వడ్డీ లేని రుణాలు వచ్చేసాయ్

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ హైమావతి స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. చేర్యాల, కొమురవెళ్లి, మద్దూర్, దూల్మిట్ట మండలాలకు చెందిన 1541 మంది మహిళా సంఘ సభ్యులకు 1.55 కోట్ల రూపాయల రుణాలను అందజేశారు.

15. కారు ఢీకొని బైకర్ దుర్మరణం

చిత్తూరు జిల్లా తవణంపల్లి మండల పరిధిలోని కాణిపాకం ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో పుత్తరమద్ది గ్రామానికి చెందిన రవి మృతి చెందారు. బైక్ పై వెళ్తున్న రవిని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందారు. ఈ ఘటనపై తవణంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

16. అయోధ్యలో మోడీ

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమెంది. శ్రీరాముడి ఆలయంలో వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో RSS ఛీప్ మహేష్ భాగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ పాల్గొన్నారు.

17. ఆర్మీ అధికారి తొలగింపున సమర్ధించిన కోర్టు

ఆర్మీ సెక్యులరిజంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆలయంలోకి ప్రవేశించేందుకు తిరస్కరించిన హిందూయేతర ఆర్మీ అధికారి తొలగింపును సమర్థించింది కోర్టు. ఒక వ్యవస్థగా ఆర్మీ లౌకికమైందని.. దాని కృమశిక్షణ విషయంలో రాజీ పడలేమని తేల్చి చేప్పింది సుప్రీంకోర్టు.

18. ప్రయాణికుడిని కొట్టిన రైల్వే అధికారి

రైలు టికెట్ లేదని ఓ వ్యక్తిపై రైల్వే అధికారి దాడి చేశాడు. దీనిపై NCMIndia కౌన్సిల్ ఫర్ మెన్ అఫైర్స్ స్పందించింది. రైలులో సరైన టికెట్ లేకుండా ప్రయాణించడం నేరమే.. దానికి జరిమానా విధించవచ్చు. టికెట్ చెల్లించనివారిపై అధికారులు దాడి చేయడం చట్టరీత్యా నేరం అవుతుంది అని పేర్కొంది.

19. ఈ నెల 27 నా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

హీరో రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా ఈనెల 27న రిలీజ్ అవుతుందని దర్శకుడు మహేశ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా డ్రైరెక్టర్.. ఈ మూవీకి సంబంధించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. నిజమైన ఉపేంద్రను ఈ సినిమాలో చూస్తారని, ఆడియన్స్‌కు ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుందన్నారు మహేష్ బాబు.

20. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సౌత్ ఆఫ్రికా

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో ఆధిక్యంలో ఉన్న సౌతాఫ్రికా 260/5 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 26/0తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన సఫారీల జట్టు.. లంచ్‌ బ్రేక్‌ అనంతరం డిక్లేర్‌ ప్రకటించింది. తొలి ఇన్నింగ్స్‌లో 289, సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 260 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా 548 రన్స్ ఆధిక్యంలో ఉంది. ఈ టెస్ట్‌లో భారత్ ముందు సఫారీ జట్టు 549 పరుగుల టార్గెట్‌‌ను నిర్దేశించింది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×