తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి.. రేపు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది.
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల PPP విధానానికి వ్యతిరేకంగా వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
ఎంప్లాయిమెంట్ కల్పించే స్థాయిలో మన కాలేజీల్లో ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నామన్నారు మంత్రి నారా లోకేశ్. గుంటూరు జిల్లా ఐనవోలులో CII-SR హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు. ఇండియాలో కేవలం 51 శాతం మంది పట్టభద్రులకు మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయని ఆరోపించారు.
పార్వతీపురం మన్యం జిల్లా దళాయివలస గ్రామంలోని ఆడపరాయి వాటర్ ఫాల్స్‌ను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ ప్రాంతం.. ప్రకృతి అందాలతో నిండిన అపూర్వ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందగలదన్నారు. ఆర్థికాభివృద్ధిలో దళాయివలస వాటర్ ఫాల్స్ కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.
ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడానికి కళాశాలలను చంద్రబాబు ప్రైవేట్‌పరం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు.
తిరుపతి జిల్లా మదనపల్లెలో కిడ్నీ రాకెట్ వ్యవహారం మలుపు తిరిగింది. నిన్నటి వరకు మృతురాలు యమున భర్తగా చెప్పుకుంటున్న సూరిబాబు.. అసలు భర్తే కాదని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. అరకు పిక్నిక్‌కు అని చెప్పి సూరిబాబు మదనపల్లెకి తీసుకెళ్లాడని.. టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు యమున పేరెంట్స్.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో రౌడీ షీటర్ బన్నీ హల్‌చల్ చేశాడు. పాత కక్షల నేపథ్యంలో ప్రకాష్ అనే యువకుడిపై తన అనుచరుడు సాయితో కలిసి బీర్ బాటిల్‌తో దాడికి పాల్పడ్డాడు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు దాడిని అడ్డుకుని.. తాడేపల్లి పోలీసులకు అప్పగించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కలెక్టర్ జితేష్ పాటిల్ పర్యటించి సీతారామ ఆలయాన్ని పరిశీలించారు. సీతారామ చంద్రస్వామి పేరుతో ఉన్న అచ్చుతో మట్టి ఇటుకలు తయారు చేయించేలా ప్రోత్సాహం అందించాలని రామాలయ సిబ్బందికి సూచించారు. రామభక్తులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.
చిత్తూరు జిల్లా ముసలిమడుగు పర్యటనలో గాయపడిన హేమలతకు… గిఫ్ట్ పంపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతరం ఆమెకు వితంతు పెన్షన్ కల్పిస్తామంటూ భరోసా కల్పించారు. పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హేమలతను పరామర్శించారు జనసేన జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్. పవన్ తరపున గిఫ్ట్ అందిచారు.
భీమవరంలో తల్లిని, తమ్ముడిని హత్య కేసులో హంతకుడు శ్రీనివాస్‌కు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దాంతో పోలీసులు అతన్ని భీమవరం సబ్‌జైలుకు తరలించారు. తల్లి మహాలక్ష్మి, సోదరుడు రవితేజకు..బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.
మస్కట్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నానని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన జుబేదా అనే మహిళ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తనను రక్షించాలని మంత్రి లోకేశ్‌ను అభ్యర్థించారు. ఆమెకు మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నట్లు.. తనకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ట్వీట్ చేశారు.
సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి సంచారపురి కాలనీలో సయ్యద్ జునైద్ అనే వ్యక్తిపై బంధువులు హత్యాయత్నం చేశారు. కుటుంబ కలహాలతో సొంత బావపై అతని బామ్మర్ది సోహైల్, అతిహ్, రఫీక్ ఖాద్రిలు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కత్తులతో దాడికి పాల్పడడంతో సయ్యద్ జునైద్ మెడపై తీవ్ర గాయాలయ్యాయి.
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేయడాన్ని ఖండించారు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ. అభివృద్ధికి బీజేపీ పార్టీ వ్యతిరేకం కాదని.. ఆలయం మూసివేస్తే అనేక కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ఆలయంలోని దర్గాను తొలగించిన తర్వాతే దేవతామూర్తుల విగ్రహాలను ముట్టుకోవాలన్నారు.
అన్నమయ్య జిల్లా రాజీవ్ కాలనీలో ఎన్టీఆర్ పక్కా గృహాలను ప్రారంభించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక్కడ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 3 లక్షల ఎన్టీఆర్ పక్కా గృహాలను సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులు హేమలత, ముంతాజ్ బేగం కుటుంబ సభ్యులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు.
ఢిల్లీ పేలుడు ఘటనపై స్పందించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. పేలుళ్లకు, బీజేపీకి సంబంధం ఉందంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓ వర్గానికి సంబంధించిన డాక్టర్లు కుట్ర పన్నితే.. వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు అలజడి సృష్టించాలని చేసిన కుట్రగా అభివర్ణించారు ఎంపీ.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో.. CID విచారణకు హాజరయ్యారు ప్రకాష్ రాజ్. ఆన్‌లైన్ బెట్టింగ్‌పై పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్‌లో నమోదైన FIRలు CIDకి బదిలీ చేశారు. బెట్టింగ్ యాప్ కేసులో.. జులై 30న ఈడీ విచారణకు హాజరయ్యారు ప్రకాష్ రాజ్. మరోసారి విచారణకు రావాలని నోటీసులు రావడంతో.. ఇవాళ వచ్చారు. జంగిల్ రమ్మీ యాప్‌ను ప్రమోట్ చేశారు ప్రకాష్‌రాజ్.
ఢిల్లీలో జరిగిన పేలుడులో గాయపడిన వారిని LNJP ఆసుపత్రికి వెళ్లి కలిశాను. అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. కుట్ర వెనుక ఉన్న వారిని న్యాయం ముందు నిలబెట్టాలి అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.
నిర్మల్ జిల్లా కేంద్రంలో పోలీసులు, లాయర్ల మధ్య వివాదం చోటుచేసుంది. సెప్టెంబర్ 30న నిర్మల్‌కు చెందిన దిగంబర్ కాంబ్లేపై హైదరాబాద్ చైతన్యపురిలో ఫోక్సో కేసు నమోదైంది. దిగంబర్ కాంబ్లేను న్యాయవాది నిర్మల్ కోర్టులో హాజరు పర్చేందుకు తీసుకొస్తుండగా.. పట్టుకున్నా పోలీసులు. తన కారుని ధ్వంసం చేసి బలవంతంగా నిందితున్ని పోలీసులు తీసుకెళ్లారని లాయర్ ఆరోపించారు. కోర్టు ఆవరణలో న్యాయవాదులు నిరసన తెలుపుతూ నేటి నుంచి సోమవారం వరకు విధులు బహిష్కరిస్తున్నట్టు తెలిపారు లాయర్లు.
ఇంద్రకీలాద్రిపై రాజకీయ ఆంక్షలు పెట్టింది పాలక మండలి. రాజకీయ నాయకులు దుర్గమ్మ చెంత.. పాలిటిక్స్ మాట్లాడకూడదంటూ పాలకమండలి తీర్మానించింది. నేటి నుంచే రాజకీయ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇటీవల జోగి రమేష్ కొండపైన అమ్మవారిని దర్శించుకొని.. హారతి వెలిగించి రాజకీయాలు మాట్లాడటంపై పాలకమండలి ఆగ్రహం వ్యక్తం చేసింది.
విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీ నుంచి బయటకు వస్తున్న విద్యార్థి బండి ప్రేమ్ కుమార్ పై నలుగురు యువకులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో బండి ప్రేమ్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన విద్యార్థిని కుటుంబ సభ్యులు రాజాం ప్రాంతీయ ఏరియా ఆసుపత్రికి తరలిం. దీంతో రాజాంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.