E-Paper
Advertisement

Mohammed Malik: హైదరాబాద్ నుంచి టీమిండియాకు మరో యువ క్రికెటర్..

Mohammed Malik: హైదరాబాద్ నుంచి టీమిండియాకు మరో యువ క్రికెటర్..
Advertisement

Mohammed Malik: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నుంచి మరో యువ క్రికెటర్ భారత క్రికెట్లోకి అడుగుపెట్టాడు. నాంపల్లి మల్లెపల్లికి చెందిన మహమ్మద్ మాలిక్ ను బీసీసీఐ అండర్ 19 ఏ టీమ్ లో అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా అతని తండ్రి మహ్మద్ అబ్దుల్ సుబాన్ ఆధ్వర్యంలో లక్డికపుల్ లో మ్యాగ్నెట్ ఇన్ఫ్రా సంస్థ కార్యాలయంలో సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి , టపాసులు పేల్చి సంబరాలు చేశారు. ఈ నెల 17న బెంగళూరు వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరగనున్న సిరీస్ లో పాల్గొననున్నట్లు మాలిక్ అన్నారు.

భవిష్యత్తులో ఇండియన్ టీమ్ (Team India) కు ప్రాతినిధ్యం వహించడం తన డ్రీమ్ అని, ఆ దిశగా తాను మెరుగైన ప్రదర్శన ఇస్తానని మాలిక్ స్పష్టం చేశారు. మలిక్ తండ్రి మహమ్మద్ అబ్దుల్ సుబాన్ మాట్లాడుతూ, “నాకు కూడా క్రికెట్‌పై చిన్నప్పటి నుంచే ప్రేమ ఉంది. నా కుమారుడు నేను సాధించలేనిదాన్ని సాధిస్తున్నాడు. అతనిపై నాకు ఎంతో గర్వంగా ఉంది.” అని తెలిపారు. కోచ్ అద్నాన్ బాఫ్ కఠినమైన శిక్షణ, మార్గదర్శకతతో మలిక్‌ను తీర్చిదిద్దారని ఆయన అన్నారు.

Advertisement

Read Also: Abhishek Sharma Tattoo: అభిషేక్‌ శర్మ కొత్త టాటూ.. 10 గంటల్లోనే దాదాపు లక్ష లైక్‌లు

హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రేరణతో కృషి చేసి, అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అబ్దుల్ మలిక్ తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 2024 బీసీసీఐ (BCCI) టోర్నమెంట్‌లో దేశంలోనే అత్యధిక వికెట్లు తీశాడు. ఈ ఏడాది హైదరాబాద్ బీనుమంకట్ టోర్నమెంట్‌లో జట్టు తొలిసారిగా విజయం సాధించగా, దానికి ప్రధాన కారణంగా మలిక్ స్ట్రైక్ బౌలింగ్ నిలిచింది. వచ్చే వారం నుంచి బెంగళూరులో జరిగే మ్యాచ్‌లలో ఆడనున్నాడు మాలిక్.

Related News

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

Big Stories

Advertisement
×