రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో నిత్య కల్యాణం టికెట్ల కోసం భక్తులు అర్ధరాత్రి నుంచే చలిలో పడిగాపులు కాస్తున్నారు. గతంలో 150-200 టికెట్లు ఉండగా, ప్రస్తుత ఆలయ విస్తరణ కారణంగా పార్వతీపురం నిత్యాన్నదాన సత్రంలో స్థలం తక్కువగా ఉండటంతో 80 టికెట్లకు కుదించారు. రద్దీ పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని అధికారుల వైఫల్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నేడు టికెట్లు దక్కని కొందరు అధికారులతో వాగ్వివాదానికి దిగారు.
అనంతపురం జిల్లా గుంతకల్‌లో చిట్టీలు నడుపుతున్న దిల్షా బేగం లక్షల్లో డబ్బులు ఎగ్గొట్టి మోసం చేసిందన్నారు బాధితులు. చిట్టీ డబ్బులు అడిగితే ఆమె బెదిరింపులకు పాల్పడింది. దీంతో ఆగ్రహించిన బాధిత మహిళలు, హిజ్రాలు ఇంటి నుంచి బయటకు లాగి చితకబాదారు. అనంతరం ఆమెను జుట్టు పట్టుకొని లాక్కెళ్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు టైం నిర్ణయించారు. రేపు, ఎల్లుండి నలుగురు పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించారు. రేపు వివేకానంద Vs తెల్లం వెంకట్‌రావు, జగదీష్ రెడ్డి Vs సంజయ్ ఉంటుంది. 20వ తేదీన జగదీష్ రెడ్డి Vs పోచారం శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ Vs అరికెపూడి గాంధీని స్పీకర్ విచారిస్తారు.
కాకినాడ జిల్లా మామిడాడ గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ యువకుడిని ఆదిత్య యూనివర్సిటీకి చెందిన బస్సు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు స్పాట్‌లోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు, కుప్పం తదితర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ఓ మోస్తారు వర్షాలు ప్రారంభమయ్యాయి. వాతావరణ నిపుణులు ముందుగా హెచ్చరించిన దాని ప్రకారం వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటీషన్లపై సుప్రీం కోర్టు సీరియస్ కావడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. కోర్టు విధించిన గడువులోపు ఎందరిపై వేటు వేస్తారు? ఎందరికి క్లీన్ చిట్ ఇస్తారు?అనే దానిపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది.
టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ మృతి కేసులో దర్యాప్తు వేగవంతం అయ్యింది. సతీష్ కుమార్ ఎక్కిన ట్రైన్ A1, A2, A3 బోగీల ప్యాసింజర్ లిస్ట్ సేకరించారు పోలీసులు. ఆ ప్యాసింజర్స్‌లో ఎవరైనా నేర చరిత్ర కలిగి ఉన్నారా అనే దానిపై విచారణ చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా కొత్త దామ్రాజ్‌పల్లిలో దారుణం జరిగింది. భర్త భూమేష్‌ను భార్య విజయ, అత్త లక్ష్మి కలిసి హత్య చేశారు. డబ్బుల కోసం భూమేష్ తరచూ వేధించడంతో అత్తగారింటికి వచ్చినప్పుడు గొడవ జరిగిందని, దీంతో పథకం ప్రకారం అత్త, భార్య చున్నీతో మెడకు చుట్టి భూమేష్‌ను చంపినట్లు సీఐ అనిల్ కుమార్ తెలిపారు.
సిద్దిపేట జిల్లా, ఆకునూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ గ్యాస్ లీకై ఒక్కసారిగా పేలడంతో ఇంట్లో ఉన్న భాస్కర్ కుటుంబంలోని ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ నగరంలో ఆదాయపన్ను శాఖ సోదాలు చేపట్టింది. ఏకకాలంలో 15 చోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రముఖ హోటళ్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు జరిపి పలు పత్రాలు పరిశీలిస్తున్నారు. పిస్తా హౌస్, షా గౌస్ హోటళ్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రికార్డుల్లో చూపిన ఆదాయానికి, నిజమైన ఆదాయానికి వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. హవాలా, నకిలీ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో, ట్యాక్స్ ఎగవేతపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో ప్రసాదం తయారీ విభాగంలో భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక నిర్ధారించింది. నువ్వులు, మినపప్పు సహా 14 రకాల సామాగ్రి తక్కువ పడ్డట్లు తేలింది. అవకతవకలకు కారణమైన సూపరింటెండెంట్ వెంకటప్రసాద్ రాజుపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు వెనకాడుతున్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌గూడ, ఎర్రబోడ ప్రాంతాల్లో దాదాపు 300 మంది పోలీసులతో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు, 14 లీటర్ల లిక్కర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ములుగు జిల్లా ఏజెన్సీ వాసులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. వెంకటాపురం మండలం, పామునూరు గుట్టపై ఉన్న గిరిజన గ్రామం నుంచి అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని సుమారు 20 కిలోమీటర్లు డోలీలోనే బొల్లారం వరకు మోసుకెళ్లారు. అక్కడి నుంచి ఆటోలో వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సమయాల్లోనూ మెరుగైన రవాణా సౌకర్యం లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామం సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎంపీ వేమిరెడ్డి దంపతులు, నిర్మాత నాగవంశీ, మంత్రి పొన్నం ప్రభాకర్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా …ఆలయ అధికారులు పట్టువస్త్రాలుతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఉగ్రవాది ఉమర్ చివరి వీడియో విడుదల అయింది. సూసైడ్ బాంబు మీద తన వాదనను వినిపించారు డాక్టర్ ఉమర్. ఆత్మాహుతి దాడిపై సమాజంలో.. పలు రకాల వాదనలు ఉన్నాయన్నారు. ఆత్మాహుతి దాడి చేసుకోవాలని చూసేవాడు.. చాలా భయంకరమైన మైండ్‌సెట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పారు. చావే ఫైనల్ అని నిర్ణయించుకోవాలన్నారు డాక్టర్ ఉమర్. నిజానికి అలాంటి ఆలోచనను ఈ సమాజం అంగీకరించదని.. ఆత్మహుతి దాడి ప్రజాస్వామ్యం కాదు అన్నారు డాక్టర్ ఉమర్.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఇవాళ జరగనున్న కీలక సమావేశంలో మంత్రి, స్పీకర్ పదవుల కేటాయింపుపై చర్చించనున్నారు. ముఖ్యంగా, బీజేపీ స్పీకర్ పదవి దక్కించుకోవాలని గట్టిగా పట్టుబడుతోంది. గతంలో తమ నేత నందకిశోర్ యాదవ్ స్పీకర్‌గా ఉన్నందున, మరోసారి ఈ పదవిని కోరుకుంటోంది. నేడు జరిగే ఉన్నతస్థాయి చర్చల్లో ఇరుపార్టీల నేతలు పాల్గొంటారు.
దివంగత కవి, రచయిత అందెశ్రీ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే అందెశ్రీ పేరిట స్మృతి వనం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అలాగే, ప్రతి టెక్స్ట్ బుక్ మొదటి పేజీలో అందెశ్రీ గేయం ఉంచేందుకు నిర్ణయం తీసుకుంది తెలగాణ కేబినెట్.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ICT మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ.. హసీనా మద్దతుదారులు బంగ్లాదేశ్‌లో ఆందోళనలు చేస్తున్నారు. దీంతో దేశంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఈ నిరసనల్లో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో యూనిస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో పోలీసులను మోహరించింది.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ చిత్ర సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం కేజీఎఫ్, సలార్‌ల కంటే భారీ స్థాయిలో ఉంటుందని, మ్యూజిక్ కూడా చాలా భిన్నంగా ఉంటుందని తెలిపారు. నీల్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఈ సినిమా కోసం కొత్త సంగీత పరికరాలు ఉపయోగిస్తున్నామని చెప్పారు.
తొలి టెస్ట్‌లో గాయపడిన శుభ్‌మన్ గిల్, రెండో టెస్ట్‌కు అందుబాటులో లేకపోతే అతని స్థానం కోసం సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్‌ల మధ్య పోటీ నెలకొంది. సుదర్శన్ ఇటీవల అంతగా ఆకట్టుకోలేకపోయినా, పడిక్కల్ ఆస్ట్రేలియా-ఎపై 150 పరుగులు చేశాడు. అయితే, గిల్ స్థానంలో సుదర్శన్‌నే తీసుకోవాలని మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. జట్టులో ఒకే మార్పు ఉండాలని సూచించాడు.