అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో సుమారు నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల పూర్తి వివరాలు, వారిలో కీలక కేంద్ర దళ నాయకులు ఎవరైనా ఉన్నారా అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి, వారితో కలిసి అల్పాహారం చేశారు. సమస్యలు ఉంటే 9490551117కు ఫిర్యాదు చేయాలని కోరారు.
తిరుమల రెండవ ఘాట్ రోడ్డులోని హరిణి ప్రాంతంలో బైక్‌పై ప్రయాణిస్తున్న లోకేష్‌కు రాయి తగిలి ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలైన లోకేష్‌ను మొదట అశ్విని ఆసుపత్రికి, ఆపై తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. లోకేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌లోని మీటా మైండ్ అకాడమీ ఇంటర్ కళాశాలలో సీనియర్లు, ఫస్టియర్ విద్యార్థుల మధ్య ర్యాగింగ్ విషయంలో ఘర్షణ, దాడులు జరిగాయి. ఈ దాడిలో స్థానిక గ్యాంగ్ జోక్యం చేసుకున్నట్లు సమాచారం. సీసీటీవీల్లో ఘర్షణ రికార్డ్ అయింది. వార్డెన్‌పై సిగరెట్ల సరఫరా ఆరోపణలు కూడా ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది. గాండ్ల సంజీవ్‌కుమార్ తన బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో వెళ్లారు. తిరిగి వచ్చి ఇంటిని చూడగానే తాళం పగలగొట్టి ఉండడంతో చోరీ జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలోని 4 తులాల బంగారం, 13 తులాల వెండి, రూ.2 లక్షల నగదు చోరి జరిగినట్లు బాధితుడు వాపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
తిరుమల అన్నమయ్య భవనంలో నేడు బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత అనుభవాలను పరిగణించి 10 రోజుల పాటు దర్శన టికెట్లు, టోకెన్ల జారీ, భక్తుల ఏర్పాట్లుపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
నెల్లూరు జిల్లాలో చలి తీవ్రతతో పాటు వేకువజాము నుంచి కురుస్తున్న చిరుజల్లులకు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నైరుతి బంగాళాఖాతం అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు మరో రెండు రోజులపాటు ఉంటాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. దీంతో ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.
హైదరాబాద్‌లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రముఖ హోటళ్ల ఛైర్మన్‌లు, డైరెక్టర్‌ల ఇళ్లల్లో రైడ్స్ చేస్తున్నారు అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తులు, లెక్కల్లో చూపని.. లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. 12 మంది అధికారులతో అత్తాపూర్ మోహిఫిల్ రెస్టారెంట్ మెహె ఫీల్ ఓనర్స్, అకౌంటెంట్స్, పార్టనర్స్ ఇళ్లలో సోదాలు కొనసాగిస్తున్నారు.
వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అరెస్టుని ఖండించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వెంకటరెడ్డిపై కక్షపూరితంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. అరెస్టుకు కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దా అని నిలదీశారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారు పెద్ద శేష వాహనంపై ఊరేగారు. పరమపదనాథుడు అలంకరణలో, సుగంధ పుష్పాలు, బంగారు ఆభరణాలతో శోభాయమానంగా ఉన్న అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకొని, కర్పూర హారతులు సమర్పించారు.
భీమవరంలో భారీ డిజిటల్ మోసం చేశారు కేటుగాళ్లు. రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంవిజిఈ శర్మకు.. సిమ్ కార్డు వచ్చిందని కాల్ చేశారు. తాము CBI అధికారులంటూ.. శర్మకు ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించారు. దాంతో భయపడిపోయిన శర్మ ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు చెప్పారు. దీంతో సైబర్ కేటుగాళ్లు.. 78 లక్షల 60 వేలు కాజేశారు. శర్మ వెంటనే క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రియల్ ఎస్టేట్ పడిపోవడంతో మార్కెట్ ధర దక్కక, కామారెడ్డి జిల్లా బస్వన్నపల్లికి చెందిన యువ రైతు గడ్డం రాజు తన రెండు ఎకరాల 10 గుంటల భూమిని అమ్మేందుకు వినూత్నంగా ఆలోచించాడు. తాను అనుకున్న ధర 30 లక్షలు పొందేందుకు, 10,000 చొప్పున 500 లక్కీ డ్రా టికెట్లను విక్రయించాలని నిర్ణయించాడు. వచ్చే సంక్రాంతిలోగా డ్రా ప్రక్రియను ముగిస్తానని తెలిపాడు రాజు.
మంత్రి పొంగులేటి కీలక నిర్ణయాలను ప్రకటించారు. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కోర్టు తీర్పులు కొలిక్కి వచ్చిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కేబినెట్ తదుపరి నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
YCP అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. హైదరాబాద్ ఇంట్లో అరెస్టు చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారంటూ ట్వీట్ చేసింది వైసీపీ. అరెస్టు సమయంలో కుటుంబ సభ్యులను భయ భ్రాంతులకు గురిచేసి.. ఫోన్లు లాక్కున్నారంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారంటున్నారు వెంకటరెడ్డి సతీమణి.
పిఠాపురం మూలపేటలో విద్యార్థులు ఆర్టీసీ బస్సు ముందు ఆందోళన చేశారు. ‘ఫ్రీ బస్సు’ పథకంతో బస్సులు రద్దీగా ఉండటం వలన కాలేజీలకు సమయానికి చేరుకోలేకపోతున్నామని SFI అధ్యక్షుడు సిద్దు తెలిపారు. ప్రమాదాలు జరిగితే కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
ఢిల్లీలో పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 4 కోర్టులు, రెండు CRPF స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు వెళ్లాయి. సాకేత్, రోహిణి, ద్వారక, పాటియాలా కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. లాయర్లు.. కోర్టులను ఖాళీ చేసి వెళ్లిపోయారు
రష్యాతో వ్యాపార, వాణిజ్యాలు చేస్తున్న అన్ని దేశాలపై అతి తీవ్ర ఆంక్షలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరించారు. రష్యా నుంచి ముడి చమురును కొనే, దాన్ని మళ్లీ విక్రయించే దేశాలపై 500 శాతం దాకా సుంకాలను విధిస్తామని వెల్లడించారు. ఈ మేరకు కఠిన ప్రతిపాదనలతో కూడిన ఓ బిల్లును అధికార రిపబ్లికన్ పార్టీ అమెరికా సెనేట్‌లో ప్రవేశపెట్టిందని తెలిపారు. ఆ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోద ముద్ర లభిస్తే తాను స్వాగతిస్తానని ట్రంప్ చెప్పారు.
బాలకృష్ణ – నయనతార ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’ చిత్రాలతో అలరించిన ఈ ఇద్దరూ మరోసారి కలిసి నటిస్తున్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. నయనతారకు బర్త్‌డే విషెస్ చెబుతూ.. మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. వృద్ధి సినిమాస్ పతాకంపై సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై.. రాష్ట్రీయ వానరసేన పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారణాసి చిత్రం కార్యక్రమంలో హనుమంతుడిపై.. రాజమౌళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. ఆ కామెంట్లు హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని, రాజమౌళిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కోల్‌కత్తా టెస్టులో భారత్ ఓటమిపై సునీల్ గావస్కర్ స్పందించారు. భారత బ్యాటర్లు టెంబా బవుమా టెక్నిక్, అంకితభావం చూసి నేర్చుకోవాలన్నారు. అలాగే, ఐపీఎల్‌లోలాగే క్యురేటర్లు స్వతంత్రంగా పని చేయాలని, పిచ్ తయారీలో భారత శిబిరం జోక్యం చేసుకోవడం సరికాదని విమర్శించారు.