నంద్యాల జిల్లా చాగలమర్రిలోని మద్దూరు మెట్ట హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. మంచు, డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్‌టేక్ ప్రయత్నమే ప్రమాదానికి కారణం. వేగంగా వెళ్తున్న బస్సు, ముందున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో డ్రైవర్ ప్రకాష్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. 45 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో పోలీస్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం చేయడంతో సింగిడి బేబి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కత్తిరి విజయ సహా ముగ్గురు వ్యక్తులు 10 లక్షలు మోసం చేశారని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో మద్యం మత్తులో ఉన్న దామరాకుల రాజకుమార్ ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. ఇది గమనించిన స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి, అతన్ని సురక్షితంగా కిందకు దించారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బీసీ రిజర్వేషన్లు, సర్పంచ్ ఎన్నికల భవిష్యత్తు కార్యాచరణపై కాచిగూడలో జరిగిన బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ ఏకగ్రీవంగా ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తుందని ఆయన ఆరోపించారు.
ప్రేమికుడు మోసం చేయడంతో బిడ్డను పోషించడం భారంగా భావించిన ఒక మహిళ.. తన శిశువును 6 లక్షలకు విక్రయించింది. ఈ అక్రమ విక్రయం గురించి బాలల పరిరక్షణ కమిటీకి సమాచారం అందడంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ శిశువు విక్రయానికి సహకరించిన తల్లి, కొనుగోలుదారులు, మధ్యవర్తులు సహా మొత్తం 15 మందిని కరీంనగర్ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
దుబాయ్ మోసం.. 12 లక్షల కాజేత కేసులో నిందితుడు రమేష్‌ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన భీమవరం పోలీసులపై రమేష్ కుటుంబ సభ్యులు దాడికి యత్నించారు. రామారెడ్డి పీఎస్‌కు తరలించగా, మద్యం మత్తులో ఉన్న రమేష్, బంధువులు పోలీసు విధులకు ఆటంకం కలిగించారు. దీంతో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలో ఉదయం ఏడు గంటల సమయంలో వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో రైతులు తమ వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్‌డీఎంఏ సూచించింది. వర్షాలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నకిలీ ఫైనాన్స్ సీజర్ల ఆగడాలు పెరిగాయి. ఈఎంఐ కట్టిన వాహనాన్ని కూడా సీజ్ చేస్తామని బెదిరించిన నలుగురు నకిలీ సీజర్లను ఒక వాహన యజమాని పట్టుకుని కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు. ఫైనాన్స్‌తో ఎలాంటి సంబంధం లేకుండా బెదిరిస్తున్న ఈ నకిలీ సీజర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
నాగర్ కర్నూల్ జిల్లా ఖానాపూర్ గ్రామంలో నాటు వైద్యం తయారీ వికటించి ఒకే కుటుంబానికి చెందిన చాన్బి మృతి చెందారు. నిరంజన్, కూతురు షమీనా తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3 బైకులు, 2 కార్లు, 11 సెల్ ఫోన్లు, రూ.17,800 నగదు స్వాధీనం చేసుకున్నారు.
పెద్దపల్లి జిల్లా గుంపుల మానేరు వాగుపై రూ. 31 కోట్లతో నిర్మించిన చెక్ డ్యామ్ రాత్రికి రాత్రి కూలిపోయింది. ఇసుక తవ్వకాల కోసమే గుర్తుతెలియని వ్యక్తులు దీనిని కూల్చివేశారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలనిడిమాండ్ చేస్తున్నారు.
జైలు పరిచయాలతో టీమ్‌గా ఏర్పడి పలు రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ‘తార్ టీం’ను నల్లజర్ల పోలీసులు వలవేసి పట్టుకున్నారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసిన కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 3 లక్షల నగదు, 26 గ్రాముల బంగారం, కారు, బైకులను స్వాధీనం చేసుకున్నట్లు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు.
ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కుల్సుంపుర రౌడీషీటర్ టిప్పు షేర్ తన గ్యాంగ్‌తో కలిసి మురాద్‌నగర్‌లో ఇద్దరు సోదరులు, వారి తండ్రి, అంకుల్‌పై దాడి చేశాడు. ఇంటి వద్ద రెండు కార్ల అద్దాలను పగలగొట్టి, గేటు ధ్వంసం చేసి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మాజీ సర్పంచ్ చిన్న భీమ రాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అది కుట్రపూరిత హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీకృత కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. మహిళల కోసం బస్సు సౌకర్యాలపై 8 వేల కోట్లు, సన్నబియ్యంపై 12 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఆయన తెలిపారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ సమస్యపై ఆయన సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పైరసీని అరికట్టాలంటే కేవలం దాన్ని అందించేవారినే కాకుండా, చూసే ప్రేక్షకులను కూడా శిక్షించాలని సంచలన సూచన చేశారు ఆర్జీవీ.
దేశంలోకి అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న భారీ స్మగ్లింగ్ రాకెట్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. పాక్ నుంచి డ్రోన్‌ల సాయంతో వీటిని దేశంలోకి తీసుకొస్తున్న ముఠాను పట్టుకున్నారు. పాక్ ఐఎస్‌ఐతో ప్రత్యక్ష సంబంధాలున్న వీరి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
మహిళలంతా ఏకమైతే ఆ శక్తిని ఎవరూ ఆపలేరని కథానాయిక రష్మిక అన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉండే రష్మిక తరచూ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పోస్ట్‌లు పెడుతుంటారు. తాజాగా ఆమె స్త్రీశక్తి గురించి ఆసక్తికర పోస్ట్ పంచుకున్నారు.
రాజధాని అమరావతి రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారాయణ అన్నారు. భూములు త్యాగం చేసిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామన్నారు. రాబోయే 6 నెలల్లో అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని.. పాలసీ ప్రకారమే చర్యలు చేపడతామన్నారు. డిసెంబర్ నాటికి గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు డీపీఆర్‌లు సిద్ధం చేసి.. ఆమోదం తర్వాత జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ వివరించారు. ప్రతీ 15 రోజులకు ఓసారి కమిటీ సమావేశం అయి రైతుల సమస్యలపై చర్చిస్తామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి మణికుమార్ ఫేస్ టూ ఫేస్.
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో అప్పుల బాధతో… భార్యభర్తలు మల్లేశ్, సంతోషి సూసైడ్ చేసుకోవడం… కరెక్ట్ కాదంటున్నారు ఇంటి యజమాని శివలింగం. మల్లేశ్ తమ ఇంట్లోకి రెంట్‌కు వచ్చి రెండున్నర ఏళ్లూ అవుతుందన్నారు. సొంత ఊర్లో అప్పులు అయ్యి ఇక్కడికి వచ్చారన్నారు. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూరగాయలు అమ్మేవారని చెబుతున్నారు. మల్లేశ్ వాకింగ్‌కు వెళ్లి ఎంతకి రాకపోతే పిల్లలు మెసేజ్ చేశారన్నారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేసి అన్నారంలో ఉన్నట్లు గుర్తించారన్నారు. అప్పుల వల్ల చనిపోవడంతో.. ముగ్గురు పిల్లలు అనాథలయ్యారని చెబుతున్నారు ఇంటి ఓనర్. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు.