E-Paper
Advertisement

Top 20 News Today: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ముగిసిన కస్టడీ, దుర్గమ్మ ఆలయంలో చోరీ

Top 20 News Today: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ముగిసిన కస్టడీ, దుర్గమ్మ ఆలయంలో చోరీ

1. హీటెక్కిన ఏపీ పాలిటిక్స్

స్కామ్‌లతో హీటెక్కిన ఏపీ పాలిటిక్స్ సడెన్‌గా రైతుల సమస్యలపై మళ్లాయి. ఏపీలో అన్నదాతల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉందన్నారు జగన్. అన్నదాతలకు నష్టం జరుగుతోందంటే డ్రామాలు, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు అలవాటేనని ఫైర్ అయ్యారు. అటు జగన్‌కు.. అదే స్పీడప్‌లో కూటమి కౌంటర్ ఇచ్చింది. అసలు జగన్‌కు వ్యవసాయమే తెలియదన్నారు బుద్దా వెంకన్న.

2. దారుణం.. నాలుగేళ్ల బాలుడు దారుణహత్య

సత్యసాయి జిల్లా గరికపల్లెలో దారుణం జరిగింది. నాలుగేళ్ల బాలుడు హర్షవర్ధన్‌ను దారుణంగా చంపేశారు. రెండ్రోజుల క్రితం కనిపించకుండా పోయిన హర్షవర్ధన్.. చివరికి జౌకల గ్రామ సమీపంలో శవమై కనిపించాడు. దర్యాప్తులో బాలుడి మేనమామ ప్రసాదే చంపినట్లు పోలీసులు చెప్పారు.

3. ప్రకాశం జిల్లాలో లెక్చరర్‌కు దేహశుద్ధి

ప్రకాశం జిల్లా నిడమానూరు జూనియర్ ఇంటర్ కాలేజీలో బక్కమంతుల వినయ్ అనే లెక్చరర్ స్టూడెంట్స్‌తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. విషయం తెలిసిన గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు.. ఆ అధ్యాపకుడికి దేహశుద్ధి చేశారు. ఈ విషయంపై డిప్యూటీ డీఈవోకు ఫిర్యాదు చేశారు.

4. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్రిక్తత

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దండుమల్కాపురం, తూప్రాన్‌పేటలో అర్థరాత్రి కాంగ్రెస్ జెండా దిమ్మెలు కూల్చివేశారు దుండగులు. దిమ్మెల కూల్చివేతకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కాంగ్రెస్ జెండా దిమ్మెలు కూల్చివేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

5. విశాఖలో కార్మికుల ధర్నా

విశాఖలో స్టీల్‌ప్లాంట్ కార్మికులు పోరుబాట పట్టారు. యాజమాన్యం తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. జీతాల చెల్లింపులను ఉత్పత్తితో ముడిపెడుతూ.. జారీ చేసిన సర్క్యులర్ రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సొంత గనులు కేటాయించాలని అడ్మిన్ బిల్డింగ్ ఎదుట ధర్నా నిర్వ హించారు.

6. మాదాపూర్‌లో డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో SOT పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. అయ్యప్ప సొసైటీలో MDMA తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 13 గ్రాముల MDMA, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

7. దుర్గమ్మ ఆలయంలో చోరీ

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల దుర్గమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో 50 తులాల వెండి, ఆరు గ్రాముల బంగారం, హుండీలోని నగదు అపహరించారు. సీసీ కెమెరాల వైర్లు కత్తిరించి దొంగతనం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

8. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ముగిసిన కస్టడీ

అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే కేసులో ఆరుగురు నిందితుల కస్టడీ ముగిసింది. విచారణలో జనార్ధనరావు నిధులు సమకూర్చాడని కట్టా రాజు తెలిపినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో జానార్ధనరావును కోర్టులో హాజరుపర్చేందుకు పిటీ వారెంట్ తీసుకున్నారు పోలీసులు.

9. వికారాబాద్ జిల్లా అనుమానాస్పద మృతి

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చేనుగోములు గ్రామ సమీపంలో సత్తయ్య అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

10. గ్రామాలలో స్థానిక సంస్థల నామినేషన్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం, తూప్రాన్ పేట గ్రామాలలో స్థానిక సంస్థల నామినేషన్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి సమయంలో రెండు గ్రామాలలో ఒకేసారి కాంగ్రెస్ జెండా దిమ్మెలను కొందరు వ్యక్తులు కూల్చివేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి.

11. బాపట్ల జిల్లాలో తప్పిన ప్రమాదం

బాపట్ల జిల్లా కొప్పెరపాడు వద్ద జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న కొడవళ్లు తయారుచేసే దుకాణంలోకి దూసుకెళ్లింది. దుకాణంలోని వ్యక్తులు అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.

12. దారుణం.. విద్యార్థిపై టీచర్ దాడి

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో ఓ విద్యార్థిపై టీచర్ దాడి చేశారు. అయ్యప్ప మాలధారణలో ఉన్న విద్యార్థులపై టీచర్ రేణుక వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే విద్యార్థిపై రేణుక దాడి చేశారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

13. ఏలూరు జిల్లా స్థానికుల ఆందోళన

ఏలూరు జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద శివారు ప్రాంతంలో నివాసాల మధ్య చెత్త వేయ వద్దని స్థానికులు మున్సిపాలిటీ వాహనాలను అడ్డుకున్నారు. ఇక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే తమ ఆరోగ్యం, మంచినీరు కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

14. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో 41 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 12 మంది మహిళలు, 29 మంది పురుషులు ఉన్నారు. వీరిపై కోటి 19 లక్షల రివార్డు ప్రకటించినట్లు అధికారులు వెల్లడించారు.

15. దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు..

అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు, విదేశీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో.. దేశీయ స్టాక్‌ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. 14 నెలల్లో ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరింది నిఫ్టీ. ఉదయం మార్కెట్లు ప్రారంభం కాగానే.. సెన్సెక్స్ 309 పాయింట్లు, నిఫ్టీ 74 పాయింట్లు పెరిగింది.

16. ట్రంప్‌ ప్రతిపాదించిన 28 పాయింట్ల శాంతి ప్రణాళికపై వివాదం..

ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతిపాదించిన 28 పాయింట్ల శాంతి ప్రణాళికపై వివాదం రేగుతోంది. అది ట్రంప్‌ తయారుచేసింది కాదని… రష్యా రచించిన డాక్యుమెంట్ అని వివిధ వర్గాలను ఉటంకిస్తూ రైటర్స్‌ వెలువరించిన కథనం కలకలం రేపుతోంది.

17. గంభీర్‌కు వ్యతిరేకంగా నినాదాలు

దక్షిణాఫ్రికా చేతిలో రెండో టెస్టులో టీమ్ ఇండియా చిత్తయిన అనంతరం గువాహటి మైదానంలో కోచ్ గౌతమ్ గంభీర్‌కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. బహుమతి ప్రదానోత్సవం కోసం జట్టుతో కలిసి గంభీర్ మైదానానికి రాగా.. అతను రాజీనామా చేయాలంటూ స్టాండ్స్ నుంచి అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పేసర్ సిరాజ్‌తో పాటు సహాయ సిబ్బంది వారిస్తున్నా అభిమానులు శాంతించలేదు.

18. క్రీడాకారుల ప్రస్థానంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న జ్యోతి

భారత ఆర్చరీ క్రీడాకారుల ప్రస్థానంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ. 90కి పైగా మెడల్స్‌ను సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇంత దూరం వస్తానని తాను కూడా ఊహించలేదన్నారు. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో టీమ్, ఇండివిడ్యువల్ విభాగాల్లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించామని తెలిపారు.

19. రామాయణ సినిమా విజువల్ వండర్‌గా..

రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న సినిమా రామాయణ భారీ తారాగణంతో నిర్మిస్తున్న చిత్రం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. విజువల్ వండర్‌గా దీన్ని రూపొందించనున్నట్లు తెలిపారు.

20. రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఫ్రీగా చూసేయండి

ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చి ఆదరణను సొంతం చేసుకున్న ప్రేమకథ ‘రాజు వెడ్స్ రాంబాయి’ . ఇప్పుడీ సినిమాను ఉచితంగా చూసే అవకాశాన్ని చిత్రబృందం కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ఫేమస్ థియేటర్లలో ఈ చిత్రాన్ని ఉచితంగా చూడొచ్చని పేర్కొన్నారు. మహిళలకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. ఈరోజు వరకూ ఈ ఆఫర్ ఉంటుందన్నారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×