E-Paper
Advertisement

Top 20 News Today: వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు, బీఆర్ఎస్ నేతలపై సీతక్క ఫైర్

Top 20 News Today: వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు, బీఆర్ఎస్ నేతలపై సీతక్క ఫైర్

1. తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి.. నేటి నుంచి నామినేషన్లు

తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడత ఎన్నికలకు ఇవాల్టి నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి ఆటంకాలు కలుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా రు.

2. బీఆర్ఎస్ నేతలపై సీతక్క ఫైర్

ఇందిరమ్మ చీరలపై తెలంగాణ మహిళలు సంబరపడుతుంటే.. బీఆర్ఎస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిగట్టుకుని ఇందిరమ్మ చీరలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌ గతంలో బతుకమ్మ చీరల పేరుమీద నాసిరకం బట్టలు పంపిణీ చేసిందని గుర్తు చేశారు.

3. యాంకర్ శివజ్యోతికి షాకిచ్చిన టీటీడీ

యాంకర్ శివజ్యోతిపై టీటీడీ పాల‌క మండ‌లి కీల‌క నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌లో ఇంకెప్పుడూ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలు లేకుండా యాంకర్ శివ జ్యోతి ఆధార్ కార్డును టీటీడీ అధికారులు బ్లాక్ చేశారు. శివజ్యోతి క్షమాపణలు చెప్పినా టీటీడీ అధికారులు మాత్రం అంత ఈజీగా తీసుకోలేదు.

4. లోకల్ ఫైట్‌పై అన్ని పార్టీలు ఫోకస్

లోకల్ ఫైట్‌పై అన్ని పార్టీలు ఫోకస్ చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీలో పాగా వేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఇవాల్టి నుంచి తొలివిడత నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో గ్రామాల వారీగా ఆశావహుల పేర్లను, ఏకగ్రీవానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు.

5. మరో అల్పపీడనం.. భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడటంతో మరో తుఫాను ముంచుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈనెల 28 నుంచి 29 తేదీల మధ్య తుఫాను తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని.. ఈ కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రాలోని దక్షిణ తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అతి వర్షాలు, అతి చలి, అతి వేడి పరిస్థితులు ఉంటాయని అధికారులు తెలిపారు.

6. ఐ-బొమ్మ రవిని మరోసారి విచారించేందుకు కోర్టు అనుమతి

ఐ-బొమ్మ రవిని మరోసారి విచారించేందుకు 3 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. ఇవాల్టి నుంచి మూడ్రోజుల పాటు రవిని విచారించనున్నారు సైబర్ క్రైం పోలీసులు. అంతకముందు రవి అరెస్ట్ తర్వాత కోర్టు అనుమతితో ఐదురోజుల పాటు విచారించారు. అయితే రావాల్సిన సమాచారం రాబట్టకపోవడంతో మరోసారి విచారించాలంటూ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఒకే చెప్పింది.

7. వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. ఆఫ్‌లైన్ టికెట్ ద్వారా తిరుపతిలో ఇచ్చే విధానానికి ఈ 10 రోజులు పూర్తిగా స్వస్తి చెప్పింది.

8. మల్లన్నసాగర్ జలాశయంలో నిర్మాణ లోపాలు

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్లన్నసాగర్ జలాశయంలో నిర్మాణ లోపాలు వెలుగు చూస్తున్నాయి. ప్రాజెక్టు అడుగు భాగంలో పలుచోట్ల నీరు లీకవుతుండటం, అలాగే మట్టి కట్టలు కొట్టుకుపోయి గుంతలు పడటంతో డ్యామ్ సేఫ్టీపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ లీకేజీలపై ఇప్పటికే ఈఎన్‌సీ అంజద్ హుస్సేన్ నేతృత్వంలోని బృందం పర్యటించి లోపాలను పరిశీలించింది.

9. రెండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో సంచలన తీర్పు

హైదరాబాద్‌ కాచిగూడలో రెండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన నిందితుడు సర్దార్ త్రీలోక్ సింగ్‌‌కి పోక్సో యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద 25 ఏళ్ల జైలు శిక్ష, 10వేల రూపాయల జరిమానా విధించింది. 2024 జూన్‌లో నమోదైన కేసులో నేడు కోర్టు తీర్పు వెలువడింది.

10. అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్యాయత్నం

అప్పుల బాధతో ఓ యువకుడు జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి ఆలయం సమీపంలోని కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. కర్నూలుకు చెందిన సూర్య.. అప్పుల ఒత్తిడి తట్టుకోలేక అయ్యప్ప మాల ధరించి నదిలోకి దూకేశాడు. యువకుడు దూకడం గమనించిన మత్స్యకారులు చాకచక్యంగా అతడిని రక్షించారు.

11. ఐపీఎస్‌‌కు నోటీసులు

ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌కు నోటీసులిచ్చింది సిట్. రఘురామకృష్ణరాజుపై థర్డ్‌ డిగ్రీ కేసులో.. నోటీసులు పంపింది గుంటూరు CCS సిట్‌. డిసెంబర్‌ 4న గుంటూరు సిట్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

12. ఘోర రోడ్డు ప్రమాదం..

మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇథనాల్ ట్యాంకర్, లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు. హన్వాడ మండలం పిల్లిగుండు NH-167పై ఈ ఘటన చోటు చేసుకుంది.

13. పంచాయతీ ఎన్నికలకు ఏకగ్రీవ ఎన్నిక

గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మరుసటి రోజు నుంచే.. గ్రామాల్లో ఏకగ్రీవాలు మొదలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం రుప్లా తండాలో స్థానికులు తమ సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించారు. జవహార్‌ లాల్ నాయక్ అనే వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించారు.

14. తొలి T20 ప్రపంచ కప్ విజేతలను కలిసిన రాహుల్ గాంధీ

తొలి T20 ప్రపంచ కప్ విజేతలైన భారత అంధుల మహిళా క్రికెట్ జట్టును కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ న్యూఢిల్లీలోని 10 జనపథ్‌లో కలిశారు. ప్రపంచ కప్ గెలిచినందుకు జట్టు సభ్యులను ఆయన అభినందించి, వారి అనుభవాలపై ముచ్చటించారు.

15. ఢిల్లీ పేలుడు ఘటనలో మరొకరు అరెస్ట్

ఢిల్లీ పేలుడు ఘటనలో మరొకరిని అరెస్ట్ చేశారు ఎన్‌ఐఏ అధికారులు. టెర్రరిస్టు ఉమర్ నబీకి హరియాణాలోని ధౌజ్ గ్రామంలో ఆశ్రయం ఇచ్చిన ఫరీదాబాద్ వాసి షోయబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎర్రకోట దగ్గర జరిగిన కారు బాంబు దాడికి ముందు టెర్రరిస్టు ఉమర్‌కు.. లాజిస్టికల్ సపోర్టు కూడా అందించినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ అయ్యారు.

16. భారీ అగ్ని ప్రమాదం.. 44 మంది మృతి

హాంకాంగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉత్తర తాయ్ పో జిల్లాలోని అపార్ట్‌మెంట్స్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒక ఫైర్ ఫైటర్ సహా 44 మంది సజీవ దహనం అయ్యారు. మరో 45 మందికి తీవ్ర గాయాలు కాగా…మరో 279 మంది మిస్సింగ్ అని అధికారులు తెలిపారు.

17. వైట్ హౌస్‌లో మరోసారి కాల్పులు

యూఎస్‌లో మరోసారి కాల్పుల కలకలం రేపింది. యూఎస్ ప్రెసిడెంట్ భవనం వైట్ హౌస్ సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ దుండుగుడు కాల్పుల్లో ఇద్దరు నేషనల్‌ గార్డులకు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు.. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నాయి. దుండగుడికి సైతం బుల్లెట్‌ గాయాలు అయినట్లు సమాచారం

18. జిన్‌పింగ్‌ ఆహ్వానాన్ని అంగీకరించిన ట్రంప్..

వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తమ దేశంలో పర్యటించాలంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పంపిన ఆహ్వానాన్ని అంగీకరించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. బదులుగా ఆ తర్వాత అమెరికాలో పర్యటించాలని జిన్‌పింగ్‌ను కోరినట్లు తన సామాజిక మాధ్యమం ట్రూత్‌లో తెలిపారు. గతనెలలో దక్షిణ కొరియాలో జరిగిన భేటీ తర్వాత తొలిసారిగా ట్రంప్, జిన్‌పింగ్‌ ఫోనులో మాట్లాడుకున్నారు.

19. ఓటీటీలోకి మరో కొత్త సినిమా..

హాలీవుడ్‌లో సూప‌ర్ హిట్ అందుకున్న డీసీ స్టూడియోస్ సూపర్ మ్యాన్ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా డిసెంబ‌ర్ 11 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మూవీయూనిట్ ఎక్స్ వేదిక‌గా ప్రక‌టించింది. జేమ్స్ గన్ ఈ సినిమాకు ద‌ర్శక‌త్వం వ‌హించ‌గా.. డేవిడ్ కోరెన్స్‌వెట్ సూపర్ మ్యాన్ పాత్రలో నటిచాడు.

20. బాలకృష్ణ 111వ సినిమా

అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మరోసారి చారిత్రక నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. ఆయన 111వ సినిమా అది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. విజయవంతమైన ‘వీరసింహారెడ్డి’ తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న చిత్రమిది. నయనతార కథానాయిక. ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×