E-Paper
Advertisement

Tirupati Balaji: తిరుమల శ్రీవారి ఆలయం స్వర్ణమయం ఆలస్యం అందుకే

Tirupati Balaji: తిరుమల శ్రీవారి ఆలయం స్వర్ణమయం ఆలస్యం అందుకే
Advertisement
Tirupati Balaji

తిరుమల శ్రీవారి ఆలయ బంగారు స్వర్ణయమం కావడం మరికొంత ఆలస్యం కానుంది. బంగారు తాపడం పనులు మరికొంత కాలం ఆలస్యం కానున్నాయి. ఈ పనులు ఐదు నుంచి ఆరు నెలల పాటు వాయిదా పడ్డాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతోందని టీటీడీ చైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు.తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనందనిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్లకు వెళుతున్నామని అన్నారు. ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో తాపడం పనులను వాయిదా వేశారు. .

శ్రీవారి ఆలయం బంగారు తాపడం నిర్మాణానికి భక్తులు ఇచ్చే బంగారాన్ని వాడాలని గతంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. 1957-58 సంవత్సరాల్లో ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు జరిగాయి. ఆగమ శాస్త్రం అనుసారం అప్పట్లో పనులు ఎలా నిర్వహించారో అదే విధంగా ఈసారి కూడా పనులు చేపట్టాలని టీటీడీ భావిస్తోంది. బంగారం తాపడం పనులు చేసే ముందు బాలాలయం ఏర్పాటు చేయనుంది. వాస్తవానికి ఈపాటికే పనులు ప్రారంభం కావాల్సి ఉంది. పనులు వాయిదా వేయడం వల్ల బంగార తిరుపతి వెంకటేశ్వరునికి బంగారు కళ రావడానికి మరికొంత సమయం పట్టనుంది.

Advertisement

టీటీడీ వెబ్ సైట్ మాదరిగానే మొబైల్ యాప్ ను భక్తులకు చేరువ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం మొబైల్ యాప్ గురించి ఎక్కువ మందికి భక్తులందరికీ తెలిసేలా సమాచార కేంద్రాలు, అనుబంధ ఆలయాల్లో ప్రదర్శించాలని జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఇటీవల ప్రారంభించిన మొబైల్ యాప్ ను ఒక్క రోజులోనే 10 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మొబైల్‌ యాప్‌ గురించి మరింత మంది భక్తులకు తెలియజేసి టీటీడీ సమాచారం, సేవలు, దర్శన టికెట్లు, గదుల బుకింగ్ ను అందుబాటులో ఉంచనుంది.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×