BigTV English
Advertisement

Tirumala Temple Secrets: తిరుమల శ్రీవారి గర్భాలయంలో రహస్యాలు

Tirumala Temple Secrets: తిరుమల శ్రీవారి గర్భాలయంలో రహస్యాలు

Tirumala Temple Secrets: ఒకప్పుడు తిరుమల శ్రీవారిని చాలా దగ్గరగా దర్శించుకునే వారు. కులశేఖరుడి పడి దగ్గర ఉన్న గుమ్మం వరకు భక్తుల్ని అనుమతించే వారు. తర్వాత కాలంలో దర్శన విధానంలో మార్పులు చేసి కుదించారు. ఇప్పుడు మహా లఘు దర్శనాల వల్ల చాలా చూడలేకపోతున్నాం. శ్రీవారి మూల్ విరాట్ దగ్గర నాలుగు విగ్రహాలు కనిపిస్తాయి. వాటిలో కొన్నింటిని మాత్రం ఉత్సవాల సమయంలో బయటకి తెస్తుంటారు. చూడటానికి అవన్నీ ఒకే విగ్రహం అనుకునేలా కనిపిస్తాయి. కానీ అవన్నీ వేరు వేరుగా ఉంటాయి.


వెంకటేశ్వరుడి మూల్ విరాట్ దగ్గర ఉండి ఐదు విగ్రహాల్లో ఒకటి భోగ శ్రీనివాస మూర్తి. ఈ విగ్రహం శ్రీవారి పాదాల దగ్గర ఉంటుంది. కొన్ని వందల ఏళ్ల క్రితం శ్రీవారి ఆలయాన్ని పునర్మించినప్పుడు మూల్ విరాట్ కు బదులు వెండి తయారు చేయించిన 2 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించారు. కొంతకాలం భక్తుల ఈ స్వామినే దర్శించుకునేవారు. అందుకే ఆ విగ్రహాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మూల్ విరాట్ కు ఈ విగ్రహానికి మధ్యతాడుతో కట్టిన బంధం ఒకటి ఉంటుంది. బుధవారం చేసే సహస్రకలశాభిషేకం కూడా ఈవిగ్రహానికి నిర్వహిస్తారు. మూల్ విరాట్ కి ఎడమ వైపు కొలువు శ్రీనివాస మూర్తి విగ్రహం ఉంటుంది. సుప్రభాత సేవ, అలంకరణ తర్వాత ఈ విగ్రహాన్ని స్వప్నమండపంలో బంగారం సింహాసంలో పెట్టి మైసూరు మహారాజు ఇచ్చిన చత్రాన్ని ఉంచుతారు. స్వామి వారి ఆలయానికి వచ్చిన ఆదాయ , ఖర్చుల వివరాలు తిథుల నక్షత్రాల గురించి స్వామికి చెబుతారు.
మహారాజ పోషకుల పేర్లను స్వామి ముందు చదువుతారట.

మూలవిరాట్ కి కుడివైపు ఉండే విగ్రహం ఉగ్ర శ్రీనివాసమూర్తిది. భూదేవి, శ్రీదేవితో కలిపిన స్వామి వారు ఈ విగ్రహంలో కనిపిస్తారు. 1330 ఏడీ కాలంలో జరిగిన ఉత్సవ సేవలన్నీ ఈవిగ్రహానికే నిర్వహించేవారట. ఈ విగ్రహానికి సూర్యకిరణాలు తాకకూడదని స్వామివారు చెప్పారట. అందుకే ఈ విగ్రహాన్ని తెల్లవారజామును రెండు , మూడు గంటల సమయంలో మాత్రమే బయటకి తెచ్చి మాఢవీధుల్లో ఊరేగించి తిరిగి ఆలయంలోకి తీసుకెళ్లిపోతారు. ఈ విగ్రహాం గురించి వెంకటాచలపతి వైభవంలో ఉంది.


1330 ఏడీ కాలంలో బ్రహ్మోత్సవాలు ఆగిపోయినప్పుడు వెంకటేశ్వరస్వామి సూచనలతో కొండపై తవ్వి తీసుకొచ్చిన మలయప్ప విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఆ విగ్రహం మూల్ విరాట్ దగ్గరే ఉంచారు. మలయప్ప కోనలో దొరికిన ఈవిగ్రహానికి మలయప్పస్వామి అని పేరుతో పిలుస్తారు. సహస్రదీపాలంకరణ సేవలో వినియోగించేది ఈ విగ్రహాన్నే. ఇక ఆఖరిది మూలమూర్తి. తోమాలసేవ, అర్చన ఇలాంటి సేవలు ఈ మూలమూర్తికే నిర్వహిస్తారు.

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×