BigTV English

Virat Ramayan Mandir: బీహార్ లో అంగ్ కోర్ వాట్ ను మించిన ఆలయం

Virat Ramayan Mandir: బీహార్ లో అంగ్ కోర్ వాట్ ను మించిన ఆలయం

Virat Ramayan Mandir: ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం ఉన్న ప్రాంతంగా బీహార్ చరిత్రకెక్కబోతోంది . మ‌హావీర్ మందిర్ న్యాస్ స‌మితి చంపార‌ణ్ జిల్లా క‌ళ్యాణ్‌పూర్ బ్లాక్‌లోని కైథ‌వ‌లియాలో ఆల‌యాన్ని నిర్మిస్తోంది. దాదాపు 125 ఎకరాల సువిశాల‌మైన విస్తీర్ణంలో విరాట్ రామాయ‌ణం ఆల‌యాన్ని నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ రథోత్సవం నాడు ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఎలాంటి ఆటంకాలు లేకుండా వైభవంగా నిర్వహించారు. మ‌హావీర్ మందిర్ న్యాస్ స‌మితి అధ్య‌క్షుడు ఆచార్య కిషోర్ కృనాల్ చేతుల మీదుగా భూమి పూజ నిర్వ‌హించారు. వేలాదిమంది భ‌క్తుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.. భూమిపూజ జ‌రిగిన వెంట‌నే ఆల‌య నిర్మాణం పనులు మొదలయ్యాయి.


2025 నాటికి ఈ అతి పెద్ద విరాట్ రామాలయం అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనులు చేపట్టారు. ఈ ఆలయం పొడవు 1080 అడుగులు, వెడల్పు 540 అడుగులు ఉంటుంది సీతారామ సహిత రామాంజనేయుల విగ్రహాలను ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు. అంతేకాదు 22 ఉపాలయాలను ఆలయం ప్రాంగణంలో నిర్మించనున్నారు.ఇన్‌ఫ్రా స‌న్‌టెక్ సంస్థ ఈ ఆల‌య నిర్మాణాన్ని చేపట్టింది. అంగ్‌కోర్ వాట్ అయోధ్య ఆల‌యాల మేళ‌వింపుగా రామాలయ నిర్మాణం ఉండేలా ప్లాన్ చేసింది. ఆల‌యం ఎదురుగా 33 అడుగుల ఎత్తైన శివ‌లింగాన్ని నిర్మించాలని మ‌హావీర్ మందిర్‌న్యాస్ స‌మితి భావిస్తోంది. మ‌హాబ‌లిపురంలో ఆ శివ‌లింగాన్ని త‌యారు చేయిస్తున్నారు.

ప్రస్తుతం వరల్డ్ లోనే అతిపెద్ద దేవాల‌యం కంబోడియాలోనే ఉంది. క్రీస్తు శకం 12వ శతాబ్దంలోనే అంగ్‌కోర్ వాట్ దేవాల‌యాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే
అతిపెద్ద ఆల‌యంగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించింది. రెండు వందల పదహారు అడుగుల ఎత్తులో నిర్మించారు. రామ‌య‌ణ ఇతిహాసం ఆధారంగా ఆల‌యం రూపుదిద్దుకుంది. అంగ్ కోర్ వాట్ ఆలయం తమిళనాడులో రామేశ్వరం, మధురై ఆలయాలను పోలి ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఆలయాన్నే భారత్ లోను నిర్మిస్తున్నారు.


Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×