BigTV English
Advertisement

Today Astrology : నేటి రాశిఫలాలు.. వీరు ఏ పనులు చేయకండి..!

Today Astrology : నేటి రాశిఫలాలు.. వీరు ఏ పనులు చేయకండి..!

Today Astrology : రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. అటువంటి వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.


శ్రీ శుభకృత్ నామ సంవత్సరం పుష్య మాసం. వారపు రోజు గురువారం . తిథి : పౌర్ణమి రా .11.23వరకు. నక్షత్రం : పునర్వసు ఉ .8.16వరకు . కరణం : విష్టి ఉ. 10:04 వరకు. యోగం : వషకుంభ ఉ. 8:07 వరకు తదుపరి ప్రీతి. సూర్య సమయం : సూర్యోదయము – ఉ. 6:38, సూర్యాస్తమానము – సా. 5:48. అననుకూలమైన సమయం : రాహు – మ. 12:28 – 1:53. యమగండం – 6:00AM-7:30AM. దుర్ముహూర్తం – ఉ.10.26-11.12,మ . 2.58 – 3.44. వర్జ్యం – సా . 5.00 – 6.45 . శుభ సమయం : అభిజిత్ ముహుర్తాలు – 12:06 – 12:50

మేష రాశి : ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. పనిని ఆనందిస్తారు. కొన్ని కారణాల వల్ల మీరు ప్రేమ జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది.


వృషభ రాశి : ఈ రాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. మీ ప్రేమ జీవితంలో ఆశ్చర్యకరమైన ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులకు మీ నిర్ణయాల వల్ల లాభాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈరోజు పని విషయంలో ప్రశంసలను పొందుతారు.

మిధున రాశి : ఈ రాశి వారు గ్రహాల కదలిక వల్ల సానుకూల ఫలితాలొస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులైతే చేసే పనిలో కొన్ని ఇబ్బందులు రావొచ్చు. వ్యాపారులకు ఈరోజు ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

కర్కాటక రాశి : ఈ రాశి వారికి సంతోషకరంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో మంచి సమయాన్ని గడపగలుగుతారు. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. వివాహితులకు ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లలకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

సింహ రాశి : ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. తొందరపాటులో ఏ పని చేయకండి. వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి : ఈ రాశి వారు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. బ్యాంకు, ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. తోబుట్టువులతో మతపరమైన ప్రయాణానికి సిద్ధపడతారు. వైవాహిక జీవితం గురించి కొత్త అనుభూతిని పొందుతారు. వ్యాపారులు ఈరోజు కొంత ఉపశమనం పొందుతారు.

తులా రాశి : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనవసరమైన విషయాల వల్ల మీకు సమస్యలొస్తాయి. అయితే మీ కుటుంబ వాతావరణం బాగానే ఉంటుంది. ఈరోజు మీ పనులను వేగంగా చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీకు భాగస్వామి మద్దతు లభిస్తుంది. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు

వృశ్చిక రాశి : ఈ రాశి వారు ఆనందంగా గడుపుతారు. రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఇంట్లో వ్యక్తుల మానసిక పరిస్థితి బాగుంటుంది. దీని వల్ల మీ మనసుకు ఆనందం కలుగుతుంది. మీ వైవాహిక జీవితంలో రొమాంటిక్ గా గడుపుతారు. ప్రేమ జీవితంలో ఉండేవారు సంతోషంగా ఉంటారు.

ధనుస్సు రాశి : ఈ రాశి వారికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారొచ్చు. ఇంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ విషయంలో కొన్ని సమస్యలను అనుభవించొచ్చు.

మకర రాశి : ఈ రాశి వారు ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరంగా మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి.ముఖ్యమైన సమస్యలపై భాగస్వామితో సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఉంది. మీ ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు పొందుతారు. పనిలో కూడా మంచి విజయాలు సాధించే అవకాశాలున్నాయి.

కుంభ రాశి : ఈ రాశి వారు పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారుల సహకారంతో పనులన్నీ పూర్తి చేస్తారు. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందొచ్చు. కుటుంబ సభ్యులపై ప్రేమ పెరుగుతుంది. ప్రేమ జీవితంలో ఉండేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి : ఈ రాశి వారు పాత స్నేహితులని కలుసుకుంటారు. బంధువులతో మాట్లాడే సమయం లభిస్తుంది. జీవితంలో కొత్తదనం కనిపిస్తుంది. మీ ఖర్చులు కూడా పెరగొచ్చు. ఉద్యోగులకు బాస్ నుంచి ప్రశంసలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ గౌరవం పెరుగుతుంది. ప్రేమ జీవితంలో ఉండేవారు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Related News

Vastu Tips: ఉదయం లేవగానే.. ఈ వస్తువులు చూస్తే సమస్యలు కోరి కోని తెచ్చుకున్నట్లే ?

Vastu Tips: ఇంట్లో పొరపాటున కూడా.. ఈ దిశలో మొక్కలు పెట్టకూడదు !

Nandi in Shiva temple: శివాలయాల్లో నంది చెవిలోనే మన కోరికలు ఎందుకు చెప్పాలి?

Incense Sticks: పూజ చేసేటప్పుడు.. ఎన్ని అగరబత్తులు వెలిగించాలో తెలుసా ?

Vishnu Katha: మీ ఇంట్లోనే మహావిష్ణువు లక్ష్మీదేవితో కొలువుండాలంటే ఈ కథ చదవండి

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Big Stories

×