BigTV English

Danger Toilet Paper : టాయిలెట్ పేపర్‌తో కొత్త ప్రమాదం..

Danger Toilet Paper : టాయిలెట్ పేపర్‌తో కొత్త ప్రమాదం..

నీరు కలుషితం అయ్యిందో లేదో తెలుసుకోవడం సులభమే.. కానీ దానికి కారణం ఏంటో ప్రత్యేకంగా తెలుసుకోవడం కష్టమైన విషయమే. అంతే కాకుండా అలాంటి వేస్ట్ వాటర్‌లో ఎలాంటి చెత్త కలిసిందో తెలుసుకోవడం కూడా కష్టమే. ముందుగా వేస్ట్ వాటర్‌లో ఏం కలిసిందో తెలిస్తేనే.. దాని వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్యలకు చికిత్సను అందించవచ్చు. తాజాగా ఈ వేస్ట్ వాటర్‌లో ఎక్కువగా కలిసే పదార్థం ఏంటో తెలుసుకొని పరిశోధకులు షాక్ అయ్యారు.


నీటిలో ఉండే హానికరమైన పదార్థాలను పాలిఫ్లూరోఆలికిల్ (పీఎఫ్ఏస్) పదార్థాలు అంటారు. ఇవి నీటి నుండి గాలిలోకి చేరి గాలిని కూడా కలుషితం చేస్తాయి. తాజాగా శాస్త్రవేత్తలు ఈ పీఎఫ్ఏస్‌పై పరిశోధనలు చేశారు. ఇందులో టాయిలెట్ పేపర్ శాతం ఎక్కువగా ఉందని వారు గమనించారు. పీఎఫ్ఏస్ అనేవి బ్యూటీ ప్రొడక్ట్స్‌ ద్వారా కూడా ఏర్పడతాయి. మామూలుగా బ్యూటీ ప్రొడక్ట్స్‌ను తరచుగా ఉపయోగించి ఆ తర్వాత నీటితో కడిగేస్తారు కాబట్టి వేస్ట్ వాటర్‌లోని పీఎఫ్ఏస్ ఇవి కూడా ముఖ్య భాగమవుతాయి.

కేవలం బ్యూటీ ప్రొడక్ట్సే ఎక్కువగా పీఎఫ్ఏస్ పదార్థాలకు కారణం అనుకున్న శాస్త్రవేత్తలు.. టాయిలెట్ పేపర్ గురించి తెలుసుకొని షాక్ అయ్యారు. వేస్ట్ వాటర్‌లో ఏర్పడుతున్న ఎన్నో కెమికల్స్‌కు ఈ టాయిలెట్ పేపరే కారణమని వారు కనుగొన్నారు. టాయిలెట్ పేపర్‌ను తయారు చేసే సమయంలోనే పీఎఫ్ఏస్‌ను వారు యాడ్ చేస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. రీసైకిల్ చేసిన టాయిలెట్ పేపర్‌లో కూడా పీఎఫ్ఏస్ ఉంటాయని వారు గుర్తించారు. అందుకే వేస్ట్ వాటర్ గురించి పరిశోధనలు చేయడానికి టాయిలెట్ పేపర్‌నే ముఖ్య వస్తువుగా తీసుకున్నారు.


నార్త్, సౌత్, సెంట్రల్ అమెరికా, వెస్టర్న్ యూరోప్ నుండి టాయిలెట్ పేపర్ శాంపిల్స్‌తో పాటు వేస్ట్ వాటర్‌లో పెరుగుతున్న మొక్కలను కూడా శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం సేకరించారు. వేస్ట్ వాటర్ వల్ల కూడా మొక్కలు బాగానే పెరిగినా.. వాటి నుండి మిథేన్ ఎక్కువగా రిలీజ్ అవుతుందని వారు గుర్తించారు. మిథేన్ శాతం గాలిలో ఎక్కువగా కలవడం మానవాళికి ప్రమాదకరమని వారు తెలిపారు. అంతే కాకుండా ఈ కోణంలో మరిన్ని పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×