BigTV English

Vemulawada Temple: వేములవాడ ధర్మగుండం తెరుచుకుంది

Vemulawada Temple: వేములవాడ ధర్మగుండం తెరుచుకుంది

Vemulawada Temple: మూడు సంవత్సరాలుగా మూసి ఉన్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ధర్మగుండం తెరుచుకుంది.


ఆలయ వేదమంత్రోత్సవాల మధ్య , పుణ్యవచనం తో ధర్మగుండం కు పూజలు చేసి ప్రారంభించారు. భక్తులకు కొనేరులో పుణ్యస్నానాలకు మోక్షం కలగనుంది. కొవిడ్ కారణంగా ధర్మగుండాన్ని మూసేశారు. మళ్లీ ఇప్పుడు తెరవడంతో భక్తులు వేములవాడకి క్యూ కడుతున్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈపుణ్య క్షేత్రం భక్తజనంతో ఎపుడు కిటకిటలాడుతూ ఉంటుంది . దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన వేములవాడలో రాజరాజేశ్వరస్వామి ఎంతో మహిమగల దేవుడని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో శివుడు పార్వతీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై లింగరూపంలో వెలిశాడు.

భాస్కర, హరిహర క్షేత్రంగా పిలువబడుతున్న ఆ ఆలయం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కాలనులో దొరికిన శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడని పురాణగాథ ఉంది. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం చెబుతోంది.


భక్తులు మొదట ధర్మగుండం లో స్నానం ఆచరించి కోడెలను కట్టి తమ తమ కోరికలు చెప్పుకొని ఒకరోజు రాత్రి నిద్ర చేస్తే వారి కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాడ నమ్మకం. రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి తనకు వచ్చిన కుష్టు వ్యాధి నివారణ కోసం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరకు వేముల వాడ ప్రాంతాన్ని చేరుకున్నాడు. దక్షిణామూర్తి ప్రాంతంలో ఒక మహా బోధి వృక్షం ఉండేది. దాని పక్కనే ఉన్న కోనేరులో దిగగానే ఒక్కసారిగా తన శరీరాన్ని ఏదో బలమైన శక్తి కోనేరు అడుగునకు లాగినట్లు అనిపించింది. అంతే చక్రవర్తి కోనేరు అడుగు బాగం నుండి కొంత సమయంలో సంపూర్ణ ఆరోగ్యంతో తన వ్యాధి నయమై బయటకి వచ్చాడు..

కోటి అడుగు భాగమున అష్టదిక్కల కాలబైరవ జ్వలముకి బహుముకి …దేవతలు కొలువుతీరి ఉన్నారు అందుకే ఈ కోనేటికి కలియుగాంతం వరకు దాని మహిమ అలానే ఉంటుందని చెప్పాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇక్కడి గుండంలో ఇప్పటికీ నీరు పూర్తిగా తొలగిస్తే మనకు ఆ కోనేరు అడుగు భాగంలో ఆ విగ్రహాలు కనిపిస్తాయి.

Related News

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Big Stories

×