Tilak Verma : ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ చేసింది. పాకిస్తాన్ జట్టు తొలి 10 ఓవర్లలో 90 కి పైగా పరుగులు చేసింది. దీంతో కచ్చితంగా 200కి పైగా స్కోర్ చేస్తుందని.. టీమిండియా ఓడిపోతుందని కొంత మంది అభిమానులు సైతం పేర్కొన్నారు. కానీ 14వ ఓవర్ నుంచి కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి వంటి బౌలర్లు వాళ్లకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా టప్పా టప్పా వికెట్లను పడగొట్టారు. దీంతో 19.1 ఓవర్ లోనే 146 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
Also Read : Saeed Ajmal Cheque : పాక్ PM ఇచ్చిన చెక్కులు బౌన్స్..ఆ ప్లేయర్ సంచలనం
ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. త్వర త్వరగా వికెట్లను కోల్పోయింది. అభిషేక్ శర్మ 5, సూర్యకుమార్ 1, శుబ్ మన్ గిల్ 12 వెంట వెంటనే ఔట్ కావడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక అప్పుడే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు. 53 బంతుల్లో 69 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తిలక్ వర్మ మ్యాచ్ ఆడుతుంటే ఓ అభిమాని.. తిలక్ తమ్ముడు ఆంధ్రా వాడి దెబ్బ.. అవతలోడి అబ్బా.. జై జగన్ జై జగన్ అంటూ స్టేడియంలో నినాదాలు చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఫర్హాన్ 57, ఫకర్ జమాన్ 46 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడారు.
టీమిండియా విషయానికి వస్తే.. ఓపెనర్ అభిషేక్ శర్మ 5, శుబ్ మన్ గిల్ 12, సూర్యుకుమార్ యాదవ్ 1, తిలక్ వర్మ 69, సంజూ శాంసన్ 24, శివమ్ దూబే 33, రింకూ సింగ్ 4 పరుగులు చేశారు. ముఖ్యంగా అందరికంటే అదృష్టం అంటే రింకూసింగ్ దే అని చెప్పవచ్చు. అనుకోకుండా ఫైనల్ మ్యాచ్ జట్టులోకి వచ్చి విన్నింగ్ షాట్ కొట్టే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్ లో అతను కొట్టిన ఫోర్ మ్యాచ్ విజయానికి కీలకంగా మారింది. విన్నింగ్ షాట్ ఆడే అదృష్టం కూడా అందరికీ దక్కదు. కానీ టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో రింకూ సింగ్ కి దక్కింది. ఇక తిలక్ వర్మ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిశారు తిలక్ వర్మ. సీఎంకి ప్రత్యేకంగా బ్యాట్ ని గిప్ట్ ఇచ్చారు. మరోవైపు తన గురువు సలాం సార్ ని కలిశారు. ఆసియా కప్ ఫైనల్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ రాత్రికి రాత్రే పాపులర్ క్రికెటర్ గా మారాడు.
?igsh=MXAwdXJ1OG0yZzBoNA==