Rowdy Sheeter: పాత బస్తీలోని ఐఎస్ సదన్ పోలీస్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ కత్తితో హల్ చల్ చేశాడు. ఇతనుపై హత్య, హత్యాయత్నం, బంగారం చోరీ, చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. గంజాయి పుచ్చుకున్న నజీర్ కత్తితో హల్ చల్ చేశాడు. కనపడ్డ వారిపై కత్తితో దాడికి యత్నించాడు. పలు వాహనాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. పోలీసులు రావడంతో నసీర్ అక్కడి నుండి పారిపోయాడు.
పాతబస్తీలో రౌడీషీటర్ నసీర్ హల్‌చల్
రౌడీషీటర్ నసీర్ గంజాయి మత్తులో కత్తి పట్టుకుని వీధుల్లో తిరుగుతూ.. భయానక వాతావరణాన్ని సృష్టించాడు. ఎదురుపడిన వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించడమే కాకుండా, రోడ్డు పక్కన నిలిపిన వాహనాలను ధ్వంసం చేశాడు.
గంజాయి మత్తులో హల్‌చల్
గంజాయి పుచ్చుకున్న నసీర్ నియంత్రణ కోల్పోయి.. కనబడిన వారిని బెదిరించి కొందరిపై కత్తితో దాడికి కూడా యత్నించాడు. ఇది చూసిన ప్రజలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.
వాహనాల ధ్వంసం
నసీర్ రోడ్డుపై కనిపించిన బైక్‌లు, ఆటోలు, కార్లపై కత్తితో దాడి చేశాడు. ఈ దృశ్యం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
నసీర్ పై అనేక కేసులు
అతనిపై హత్య, హత్యాయత్నం, బంగారం చోరీ, చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎన్నిసార్లు కేసులు నమోదైనా అతడు తన పాత పద్ధతులను మార్చుకోలేదు.
పోలీసులు చేరుకునేలోపే పరారీ
సమాచారం అందుకున్న ఐఎస్ సదన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే నసీర్ అక్కడి నుండి తప్పించుకున్నాడు
భయాందోళనలో ప్రజలు
ఈ ఘటనతో నెహ్రూనగర్, పాతబస్తీ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Also Read: తమిళనాడులో దారుణం.. ఏపీ యువతిపై పోలీసుల అత్యాచారం
పోలీసుల చర్యలు
పోలీసులు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. నసీర్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడిపై ఉన్న పాత కేసులు, తాజాగా జరిగిన ఘటనను కలిపి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.