BigTV English

Flu: కరోనాకు, H3N2 వైరస్‌కు మధ్య పోలికలు, తేడాలు ఇవే.. తెలుసుకొని తీరాల్సిందే..

Flu: కరోనాకు, H3N2 వైరస్‌కు మధ్య పోలికలు, తేడాలు ఇవే.. తెలుసుకొని తీరాల్సిందే..

Flu: జలుబు, దగ్గు, జ్వరం. అవునండీ అవును. ఇప్పుడన్నీ ఇవే కేసులు. మన చుట్టూ ఉండేవారిలో.. ఎవరో ఒకరికి ఈ సింప్టమ్స్ ఉంటున్నాయి. దగ్గు వస్తే మరీ టార్చర్. ఏకంగా వారాల తరబడి దగ్గుతూనే ఉంటున్నారు. ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా.. దగ్గు వదలడం లేదని అంటున్నారు. కొందరికి ఒళ్లునొప్పులు, తలనొప్పి, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలు.. ఇలా అనేక లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కొవిడ్ సింప్టమ్స్ కదా? అంటే కరోనా లక్షణాలే కానీ కరోనా కాదంటున్నారు వైద్యులు. ఇదంతా ‘ఫ్లూ’ అంటున్నారు. దేశంలో H3N2 ఇన్‌ఫ్లూయెంజాలో ఒక వైరస్ ఉపరకం విజృభిస్తోందని చెబుతున్నారు. గడిచిన కొన్ని వారాలుగా దేశంలో చాలామంది ‘ఫ్లూ’ తో బాధపడుతున్నారు.


దాదాపు అన్నీ కొవిడ్ లక్షణాలే కావడంతో జనాలు బెదిరిపోతున్నారు. తమకు సోకింది మామూలు ‘ఫ్లూ’ వైరసా.. లేదంటే కరోనానా? అనే టెన్షన్‌తో హడలిపోతున్నారు. లక్షణాలు ఒకేలా ఉన్న.. ప్రమాద తీవ్రతలో చాలా తేడా ఉంది. కొవిడ్ సోకితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం పెరుగుతుంది. ఆక్సిజన్ పెట్టాల్సి రావొచ్చు. ‘ఫ్లూ’ మరీ ప్రాణాంతకం కాదు కానీ.. తీవ్రంగా బాధిస్తుంది. హాస్పిటల్‌లో చేరడం, ఆక్సిజన్ అవసరం అంతగా ఉండకపోవచ్చు. దగ్గు వస్తే మాత్రం అంత ఈజీగా మాత్రం వదలదు.

అయితే, మనకు సోకింది కరోనానా? ఫ్లూ నా? అని తెలుసుకోవాలంటే కొవిడ్ టెస్ట్ చేయించుకోవడం ఒక్కటే మార్గం. అందులో పాజిటివ్ వస్తే కరోనాగా భావించి దానికి సంబంధించిన మందులు వాడాల్సి ఉంది. ఒకవేళ నెగటివ్ వస్తే.. ఫ్లూ కు చికిత్స చేయించుకోవాలి. హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా ట్రీట్‌మెంట్‌కు యాంటీబయాటిక్స్‌ వాడొద్దని ఐసీఎంఆర్ సూచించింది. కరోనా, ఫ్లూ చికిత్సకు ఉపయోగించే మందులు పూర్తిగా వేరని స్పష్టం చేసింది.


ఫ్లూ లక్షణాలు కనిపించగానే భయపడకుండా.. కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్. తరుచూ చేతులు కడుక్కోవడం.. ఇతరుల వస్తువులు వాడక పోవడం.. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవడం.. ముఖానికి మాస్క్ ధరించడం.. ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవడం.. ముక్కు, నోరులో చేతులు పెట్టుకోకుండా ఉండటం.. ఇలాంటి చిన్నిచిన్న జాగ్రత్తలతో ఫ్లూ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×