E-Paper
Advertisement

Waiting for LIC profits : ఎల్ఐసీ లాభాల కోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి? అసలు ప్రాఫిట్స్ ఇస్తుందా ఈ షేర్

Waiting for LIC profits : ఎల్ఐసీ లాభాల కోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి? అసలు ప్రాఫిట్స్ ఇస్తుందా ఈ షేర్
Advertisement
LIC waiting for profits

Waiting for LIC profits : వచ్చే మే 17కి ఎల్ఐసీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఏడాది అవుతుంది. ఇప్పటి వరకు ఆహా అనిపించిన రోజు ఒక్కటి కూడా లేదు. స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ షేర్లు మెరుపులు మెరిపించన రోజు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఎల్ఐసీ ఐపీవోలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకు ఇప్పటి వరకు 40 శాతం నష్టాలు ఇచ్చిందే తప్ప లాభాలు ఇవ్వలేదు. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 40 శాతం కంటే ఎక్కువ నష్టాలనే ఇచ్చింది ఈ షేర్. ఈ షేర్ వరస చూసి ఇంకెప్పుడు లాభాలు ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు రిటైల్ ఇన్వెస్టర్లు. ఎక్స్‌పర్ట్స్ అంచనా ప్రకారం ఎల్ఐసీ షేర్లు లిస్టింగ్ ప్రైస్‌కి రావడం ఇప్పట్లో జరగదని తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా అదానీ షేర్లలో పెట్టుబడులు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు బాగా పోటీ ఇస్తుండడంతో.. ఎల్ఐసీకి నెగటివ్ అవుతోందని చెబుతున్నారు.

ఎల్ఐసీ ఇక లాభాలు ఇవ్వదు అని ఫిక్స్ అయిన వాళ్లు షేర్లను తెగ అమ్మేస్తున్నారు. సుమారు 6.87 లక్షల మంది చిన్న ఇన్వెస్టర్లు ఎల్ఐసీ షేర్లను నష్టాలకే అమ్ముకుని బయటపడ్డారు. మొన్న జనవరి-మార్చి క్వార్టర్లో అయితే 62,668 మంది స్మాల్ ఇన్వెస్టర్లు ఎల్‌ఐసీ షేర్లను విక్రయించారు. అయితే, ఈ షేర్‌లో మ్యాజిక్ ఏంటంటే.. ఇదే చిన్న ఇన్వెస్టర్లలో కొందరు ధర తగ్గినప్పుడల్లా కొంటున్నారు. ఏమో.. ఎప్పుడైనా రాకెట్లా దూసుకుపోవచ్చనేది వీరి నమ్మకం. అందుకే, చిన్న రిటైలర్లు అమ్ముతుంటే.. అదే చిన్న రిటైల్ ఇన్వెస్టర్లు కొంటున్నారు.

Advertisement

ఎల్ఐసీ షేర్లు పడిపోతుండడంతో ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు కూడా అమ్మేసుకుంటున్నారు. ఈ షేర్లు లిస్ట్ అయినప్పటి నుంచి 54.43 లక్షల షేర్లు విక్రయించారు. దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా ఈ షేర్లలో పెట్టుబడులను తగ్గించుకున్నాయి.

అయితే, ఎల్ఐసీ షేర్లు బౌన్స్‌బ్యాక్‌ అవుతాయనే అంచనాలున్నాయి. ఎల్‌ఐసీ షేర్ పుంజుకుంటుందని రెలిగేర్‌ బ్రోకింగ్‌ అంచనా వేస్తోంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ కూడా ఎల్‌ఐసీ షేర్‌కు బై రేటింగ్‌ ఇచ్చింది. ఏమో.. అదృష్టం బాగుండి ప్రాఫిట్స్ ఇస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×