E-Paper
Advertisement

Allu Arjun:- సమ్మర్‌లో ఇదే నిజమైన దసరా.. నానిపై బన్నీ ప్రశంసలు

Allu Arjun:- సమ్మర్‌లో ఇదే నిజమైన దసరా.. నానిపై బన్నీ ప్రశంసలు
Advertisement

Allu Arjun:- నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. గోదావరి ఖని సమీపంలోని తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లోని కల్పిత గ్రామాన్ని క్రియేట్ చేసి సినిమాను నిర్మించారు. ఇందులో నాని రా అండ్ రస్టిక్ పాత్రలో నటించాడు. ఆయన కెరీర్‌లోనే దసరా చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటేసిందీ చిత్రం. ఈ సినిమాను ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు, విమర్శకులు అభినందించారు. ఇక సెలబ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. చిరంజీవి సహా చాలా మంది దసరా సినిమా సూపర్బ్ అన్నారు. తాజాగా ఈ లిస్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేరారు.

సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ స్పందిస్తూ..‘‘దసరా చిత్ర బృందం మొత్తానికి నా అభినందనలు. సినిమాను అద్భుతంగా తీశారు. నా బ్రదర్ నాని పెర్ఫామెన్స్ ఇరగదీశాడు. కీర్తి సురేష్‌తో పాటు ఇతర నటీనటులందరూ నటించారు. సంతోష్ నారాయణన్ గారి సంగీతం అందించిన అద్భుతమైన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సత్యన్ గారి కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. సినిమా మొత్తానికి కెప్టెన్ అయిన శ్రీకాంత్ ఓదెల తొలి సినిమాతోనే మంచి డైరెక్టర్ అని నిరూపించుకున్నాడు. సినిమా మొత్తం ఆయన వర్క్ బ్రిలియంట్‌గా కనబడింది. నిర్మాతలు సహా సినిమాలోని ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. వేసవిలో ఇదే నిజమైన దసరా’’ అన్నారు.

Advertisement

దసరా సినిమా తర్వాత నాని తన 30వ సినిమా చేస్తున్నాడు. శౌర్య అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నేచురల్ స్టార్ ఓ పాపకు తండ్రిగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న రిలీజ్ చేస్తున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×