BigTV English

Makara Jyothi: గిరిజనులే జ్యోతిని వెలిగిస్తారా..!

Makara Jyothi: గిరిజనులే జ్యోతిని వెలిగిస్తారా..!

Makara Jyothi: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం హిందువులు ఏర్పరచుకున్న రాశులలో మకరరాశి ఒకటి. మకరజ్యోతి అంటే మకరరాశి వెలుగు. అయ్యప్ప మకరజ్యోతిగా మారి ప్రతి సంవత్సరం 14 జనవరి నాడు భక్తులకు ఒక నక్షత్రంగా కనిపించి దీవిస్తాడని స్థలపురాణం ఉంది. ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తర దిశగా ఆరు నెలలపాటు ప్రయాణిస్తాడనీ, మకర సంక్రాంతి రోజు ప్రారంభమైన ప్రయాణం కర్కసంక్రాంతి రోజున ముగుస్తుందనీ చెపుతారు.


కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష ను 21 రోజులు, 41 రోజులు దీక్ష చేసి శబరిమలకు అయ్యప్ప స్వామి భక్తులు భారీ ఎత్తున ప్రతిరోజు తరలి వెళ్తారు.. శబరిమల అంటే మొదటిగా గుర్తొచ్చేది మకరజ్యోతి.. మకర సంక్రాంతి రోజున మకర జ్యోతిని చూసి లక్షల మంది పరవశులవుతారు. నిష్టతో అయ్యప్ప దీక్ష చేసి మకర జ్యోతిని దర్శించడానికి ఎంతో దూరం నుంచి వెళ్తు ఉంటారు. మకర జ్యోతిని అయ్యప్ప స్వరూపమని భక్తుల గట్టి నమ్మకం.

సంక్రాంతి పండుగ రోజున అయ్యప్ప దర్శనం చేసుకుని ఆయప్ప దీక్ష నుండి విముక్తులవుతారు. ఇలా ప్రతి ఏటా భక్తులు నమ్మకంతో వస్తుంటారు. మకర సంక్రాంతి రోజున శబరిమల కొండలపై మకర జ్యోతి వెలుగుతుందని.. దీనికి చాలా ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. కానీ ఈ జ్యోతిలో ఎటువంటి నిజం లేదని కొంతమంది వాదిస్తుంటారు. సంక్రాంతి రోజున శబరిమల కొండల్లో మకర జ్యోతిని దర్శించడం వల్ల పుణ్యం లభిస్తుందని ప్రజలందరి విశ్వాసం. అందుకే ఎంత కష్టమైనా మకర సంక్రాంతి రోజున శబరిగిరీశుసుని సన్నిధిలో ఉండాలని ప్రతీ అయ్యప్ప భక్తుడు కోరుకుంటూ ఉంటారు


ఈ ఆచారం ఎంతో కాలంగా వస్తోంది. పూర్వం శబరిమల కొండలలో నివసిస్తున్న గిరిజనులను కాపాడటానికి అయ్యప్ప మహిషాన్ని చంపి కొండలపై ఒక పెద్ద జ్యోతిని వెలిగించాడని పురాణాలు చెబుతున్నాయి. రాత్రిపూట వెలిగించి ఈ జ్యోతిని చూసిన తర్వాత పందాల వంశస్థులు అయ్యప్ప స్వామికి బంగారు ఆభరణాలు సమర్పించడానికి వస్తారు.శబరిమల కొండలలో నివసించే గిరిజనులు మకర సంక్రాంతి రోజున పెద్ద జ్యోతి వెలిగించి పండగ జరుపుకుంటారు. ఈ జ్యోతి వెలిగిన తర్వాత వంశస్థులు అయ్యప్ప స్వామికి ఆభరణాలు సమర్పిస్తారు. దీన్నే అయ్యప్ప స్వామి జ్యోతిగా, మకర జ్యోతిగా పిలుస్తూ ఉంటారు.దీని వల్ల అప్పటినుంచి ఇప్పటివరకు జ్యోతి దర్శనం క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంది.. ఈ దర్శనం చేసుకుంటే సకల బాధలు తొలగిపోతాయని నమ్మకం.

పన్నెండో శతాబ్దంలో పండలం రాజవంశీకుడు, యువరాజు మణికందన్ శబరిమలలో తపసు చేశాడనీ, ఆయన అయ్యప్ప అవతారమనీ కొంతమంది భక్తులు భావిస్తారు. పండలం రాజవంశీకుల కాలం 1821 నాటికే ఈ గుడి అతి పురాతనమైందని చెపుతారు. ఇపుడున్న అయ్యప్ప విగ్రహం 1910లో ప్రతిష్టించారు.

Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×