Big Stories

Bats : గబ్బిలాలు ఇంటికి వస్తే ఏంచేయాలి

Bats : ఇవాళ్టి రోజుల్లో దోమలు కూడా రాకుండా ఇళ్లకు దోమతెరలు లాంటివి పెట్టుకుంటున్నారు.బయట పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. కానీ గబ్బిలాలు లాంటివి ఇంటికి వస్తే అది చెడుకు సంకేతమా.. లేదా మంచిదా.. తెలుసుకుందాం. గబ్బిలం అలా వచ్చి వెళ్లిపోతే దోషం ఉన్నట్టే. లక్ష్మీ నివాస స్థానమైన మన ఇంటికి గబ్బిలం అతిథిలాగా వచ్చి వెళ్లడం దరిద్ర హేతువుగా భావించాలి. ఈ విషయాన్ని కొంతమంది హేతువాదులు ఈవిషయాన్ని మరోలా చెబుతుంటారు. గబ్బిలం మాత్రం జీవి కాదా అని తేలిగ్గా తీసిపారేస్తుంటారు.సీతాకోక చిలుకలతో పోల్చి పట్టించుకోవద్దంటారు.

- Advertisement -

సంస్కృత సంప్రదాయాలను నమ్మేవారు మాత్రం అలా అనుకోరు. గబ్బిలం దురదృష్టానికి , అలక్ష్మికి , మృత్యువుకి సంకేతం.. ఏడాదికో ఎప్పుడో ఓసారి అలా వచ్చి వెళ్లిపోతే తేలిగ్గా తీసుకోవచ్చు. చుట్టు పక్కల ఉండే వాతావరణ పరిస్థితులు బట్టి కూడా అలా జరగచ్చు. కొన్ని కరెంటు తీగలకు కూడా వేలాడుతుంటాయి.అలా ఇంట్లోకి కూడా రావచ్చు. కానీ నెలలో నాలుగైదు సార్లు ఇంట్లోకి అలా వస్తూ ఉంటే మాత్రం ఆలోచించాల్సిందే. ఆ ఇంట్లో త్వరలో అశుభం జరగబోతోందని సూచన.

- Advertisement -

అశుభం జరుగుబోతుందని అనడానికి రాకూడని సూచనల్లో అది ఒకటి. ఇల్లు కట్టి 15 ఏళ్లు అవుతున్నా జరగని విషయం అప్పుడు జరుగుతుంటే మాత్రం సంకేతమదే. ఎక్కువగా రాత్రి పూట వచ్చి ఇంట్లో తిరుగుతుంటాయి. వాటిని తరిమేద్దామని చూసినా కష్టమవుతుంది. గబ్బిలం రావడం వల్ల ధనరూపంలో కానీ సంబంధాల రూపంలో కానీ వ్యాపారం రూపంలోనైనా నష్టం జరగొచ్చు .

పౌర్ణమి, అమావాస్య రాత్రుళ్లు, శనివారం, ఆదివారం ఇలా ఏ రోజైనా సరే …చిన్నదో పెద్దదో గబ్బిలం అంటూ వస్తే అది మృత్యువుకి సంకేతమే. గబ్బిలాలు లాంటివి వచ్చినప్పుడు ముందు మన ఇంట్లో పేషెంట్లు ఎవరైనా ఉన్నారేమో చూసుకోవాలి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారుంటే మనం జాగ్రత్తపడాలి. జరగబోయేది మనం ఆపలేం. కానీ ప్రాణనష్టం , ధన నష్టం ఇన్నింటిని ఒకేసారి ఎదుర్కొనే పరిస్థితి రాకుండా.. ఏదైనా జరిగి మనం తప్పించుకోవచ్చు. ఒకవేళ వ్యాపారం చేస్తుంటే ఎవరినైనా నమ్మి గుడ్డిగా వెళ్లిపోతున్నామో చెక్ చేసుకుంటే మంచిది.నష్టం ప్రాణరూపంలోనే కాదు ఇలా ధనరూపంలో కూడా జరగొచ్చు.

భారీ మొత్తంలో నగదు కానీ, నగలు కానీ ఇంటికి తెచ్చినప్పుడు దొంగతనం జరిగితే నష్టపోతారన్న సంకేతాలు కూడా గబ్బిలాలు ఇస్తుంటాయి. మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు కానీ మన సెంటిమెంట్ వస్తువులు కానీ పోతే ఆ బాధ మాములుగా ఉండదు. గబ్బిలం రాక మాత్రం మనల్ని ఏదో రూపంలో బాధ పెట్టకుండా వెళ్లదు.
కాబట్టి వీలైనంత వరకు గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. చీకటిగా ఉండే ప్రదేశాల్లోకి మాత్రమే అవి ప్రవేశిస్తాయన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. గబ్బిలాలు ఉన్న చోట ఒకరకమైన వాసన కూడా వస్తుంది. అలాంటి వాసన ఉన్న చోట మన ఇల్లే అయితే అవి ఆకర్షితం కూడా అవుతాయి. కాబట్టిని ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ గాలి వెలుతురు ప్రసరించేలా చూసుకోవాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News