E-Paper
Advertisement

తడిసిన ఇయర్‌బడ్స్‌ను ఎలా కాపాడుకోవాలి? ఈ తప్పులు అస్సలు చేయకండి!

తడిసిన ఇయర్‌బడ్స్‌ను ఎలా కాపాడుకోవాలి? ఈ తప్పులు అస్సలు చేయకండి!
Advertisement

Wet earbuds repair tips: వర్షాకాలంలో పాటలు వింటూ ప్రయాణించడం అంటే.. ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి? కానీ అనుకోకుండా ఒక్క సారిగా భారీ వర్షం పడి మీ ఇష్టమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్ తడిసిపోతే? లేదా నీళ్ల గుంతలో పడిపోతే? వెంటనే గుండె ఆగినంత పనవుతుంది! అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. తడిసిన ఇయర్‌బడ్స్ విషయంలో.. మీరు వెంటనే తీసుకునే కొన్ని జాగ్రత్తలు వాటిని కాపాడగలవు. అదే సమయంలో మీరు చేసే చిన్న పొరపాటు వాటిని శాశ్వతంగా పాడు చేయవచ్చు. ఈ విషయంలో ఏది చేయాలో ? ఏది చేయకూడదో ఇప్పుడు చూద్దాం!

వర్షంలో ఇయర్‌బడ్స్ తడిస్తే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు?

ఈ రోజుల్లో చాలా ఇయ ర్‌బడ్స్ వాటర్-రెసిస్టెంట్ (IPX రేటింగ్) ఫీచర్‌తో వస్తున్నప్పటికీ, వర్షపు నీరు లోపలికి వెళ్తే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. నీటిలో తడిసిన వెంటనే ఈ కింది జాగ్రత్తలు పాటించాలి.

వెంటనే చేయాల్సిన పనులు:

Advertisement

వెంటనే స్విచ్ ఆఫ్ చేయండి: ఇయర్‌బడ్స్ తడవగానే ముందుగా బ్లూటూత్ డిస్‌కనెక్ట్ చేసి, వాటిని పవర్ ఆఫ్ చేయండి. ఆన్ చేసి ఉంచితే లోపల పవర్ ప్రసారమై మదర్‌బోర్డు కాలిపోయే అవకాశం ఉంది.

మృదువైన క్లాత్ తో తుడవండి: కాటన్ లేదా మైక్రోఫైబర్ క్లాత్ ఉపయోగించి ఇయర్‌బడ్స్ బయటి భాగంలో ఉన్న నీటి చుక్కలను సున్నితంగా తుడిచివేయండి.

Advertisement

సిలికాన్ టిప్స్ తొలగించండి: బడ్స్‌కు ఉండే రబ్బర్ లేదా సిలికాన్ ఇయర్ టిప్స్‌ను తీసేయండి. వాటి వెనక దాక్కున్న నీరు కూడా త్వరగా ఆరిపోతుంది.

గాలికి ఆరబెట్టండి: పొడిగా, నిలకడగా గాలి తగిలే ప్రదేశంలో (ఫ్యాన్ కింద)ఒక కాటన్ క్లాత్ లేదా టిష్యూ పేపర్‌పై బడ్స్‌ను బోర్లా పెట్టి కనీసం 24 నుంచి 48 గంటలు అలాగే ఉంచండి.

సిలికా జెల్ ప్యాకెట్లు ఉపయోగించండి: కొత్త వస్తువులు లేదా షూ బాక్సుల్లో వచ్చే సిలికా జెల్ ప్యాకెట్లు నీటిని వేగంగా పీల్చుకుంటాయి. ఒక చిన్న డబ్బాలో ఈ జెల్ ప్యాకెట్లు వేసి,అందులో బడ్స్ ఉంచి మూత పెడితే తేమ మొత్తం పోతుంది.

Also Read: ఇండిపెండెన్స్ డే ధమాకా సేల్స్..ఐఫోన్లు,వన్‌ప్లస్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు!

అస్సలు చేయకూడని పొరపాట్లు:

చార్జింగ్ కేస్‌లో పెట్టవద్దు: చాలా మంది చేసే పెద్ద తప్పు తడిసిన బడ్స్‌ను వెంటనే చార్జింగ్ కేస్‌లో పెట్టడం. దీని వల్ల ఇయర్‌బడ్స్‌తో పాటు కేస్ కూడా షార్ట్ సర్క్యూట్ అయి శాశ్వతంగా..పాడవుతుంది.

హెయిర్ డ్రైయర్ ఉపయోగించకూడదు: వేడి గాలి ఇచ్చే హెయిర్ డ్రైయర్లు వాడటం వల్ల లోపల ఉండే ప్లాస్టిక్ భాగాలు, చిన్న చిన్న సెన్సార్లు కరిగిపోతాయి.

బియ్యంలో పెట్టకండి: బియ్యంలో పెడితే తేమ పోతుందనేది పాత మాట. కానీ బియ్యంలోని చిన్న నూకలు, బియ్యపు పిండి ఇయర్‌బడ్స్ స్పీకర్ గ్రిల్స్ లోపలికి వెళ్లి సౌండ్ క్వాలిటీని పూర్తిగా పాడు చేస్తాయి.

గట్టిగా ఊపడం లేదా తుడవడం చేయొద్దు: నీళ్లు బయటకు వస్తాయని ఇయర్‌బడ్స్‌ను గట్టిగా ఊపితే.. బయట ఉన్న నీటి చుక్కలు మరింత లోపలికి వెళ్లే ప్రమాదం ఉంది.

నీటిలో తడిసిన ఇయర్‌బడ్స్ పూర్తిగా ఆరేవరకు ఓపిక పట్టడం చాలా ముఖ్యం. పూర్తి 24 గంటల తర్వాత మాత్రమే వాటిని ఆన్ చేసి లేదా ఛార్జింగ్‌కు పెట్టి చెక్ చేయండి!

Related News

ఫోన్ బ్యాటరీని సైలెంట్‌గా ఖాళీ చేస్తున్న 5G.. ఈ ఒక్క సెట్టింగ్ మారిస్తే.. మైండ్ బ్లోయింగ్ రిజల్ట్!

ఇంతవరకు ఏ ఇయర్‌బడ్స్‌లోనూ లేని ఫీచర్లు..లుక్ చూస్తే మైండ్ బ్లాకే!

మీ స్మార్ట్‌ఫోన్ కొత్తదా లేక వాడిందా? ఈ చిన్న ట్రిక్స్‌తో..2 నిమిషాల్లో కనిపెట్టండి!

ఫిలిప్స్, షావోమీ, నోవా.. రూ. 1,500 లోపు ఏ ట్రిమ్మర్ కొంటే బెటర్?

ఇండిపెండెన్స్ డే ధమాకా సేల్స్..ఐఫోన్లు,వన్‌ప్లస్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు!

వైఫై రూటర్ మీద యాంటెనాలు దేనికోసమో తెలుసా? ఇప్పటివరకు మీకు ఎవ్వరూ చెప్పని షాకింగ్ ఫ్యాక్ట్స్!

మార్కెట్లోకి All-in-One మిక్సీ.. 1 మిషన్, 10 రకాల పనులు.. హెవీ డ్యూటీకి కేరాఫ్!

Big Stories

Advertisement
×