Inalsa Triton 900 Mixer Grinder: ప్రముఖ గృహోపకరణాల సంస్థ ‘ఇనాల్సా’ (Inalsa) తన కొత్త రకం మిక్సర్ గ్రైండర్ ‘ట్రిటన్ 900’ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్కువ క్వాంటిటీ వంటకాల తయారీకి సైతం ఉపయోగపడేలా దీనిని రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. 900 వాట్ల సామర్థ్యం గల కాపర్ మోటార్, వినూత్న ఫుడ్ ప్రాసెసర్ అటాచ్‌మెంట్‌లతో వస్తున్న ఈ మిక్సీ మోటారుపై ఏకంగా 7 సంవత్సరాల వారంటీని ఇస్తుండటం విశేషం. మిక్సీల విభాగంలో ఇంతటి సుదీర్ఘ వారంటీ ఇవ్వడం ఇదే తొలిసారి అని కంపెనీ వెల్లడించింది.
‘ఇనాల్సా ట్రిటన్ 900’ అసలు ధర రూ.14,999 కాగా.. ప్రస్తుతం ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.8,495 ప్రత్యేక ధరకు వినియోగదారులకు అందిస్తున్నారు. మోటారుపై 7 ఏళ్ల వారంటీతో పాటు.. మొత్తం ప్రొడక్ట్‌పై 2 సంవత్సరాల వారంటీని కంపెనీ అందిస్తోంది. దేశంలోని అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్లతో పాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో దీనిని కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ రాయితీ ధర పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుందని.. కాబట్టి ధర మారిపోయేలోపు కొనుగోలు చేయాలని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఈ లేటెస్ట్ మిక్సీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 100% రాగి వైండింగ్ (Copper Winding) ఉపయోగించారు. అలాగే కాపర్-సింటర్డ్ బుష్‌లతో కూడిన బలమైన 900 వాట్ల మోటార్‌ను అమర్చారు. ఇది నిరంతరాయంగా 45 నిమిషాల పాటు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. మసాలాలు రుబ్బడం, ఇడ్లీ పిండి సిద్ధం చేయడం, నానబెట్టిన బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేయడం వంటి పనులను ఇది సులువుగా పూర్తి చేస్తుందని తెలిపింది. విభిన్న రకాల గ్రైండింగ్ అవసరాల కోసం ఇందులో 3-స్పీడ్ కంట్రోల్ డయల్ ను అందించారు.
ఈ ప్రొడక్ట్‌తో పాటు మూడు స్టెయిన్‌లెస్ స్టీల్ జార్లను కంపెనీ అందిస్తోంది. ఇందులో 1.6 లీటర్ల లిక్విడైజింగ్ జార్, 1.2 లీటర్ల మల్టీ-పర్పస్ జార్, 0.5 లీటర్ల చట్నీ జార్ ఉన్నాయి. ఇవన్నీ దృఢమైన పాలీకార్బోనేట్ డోమ్ కవర్లు, లాకింగ్ సిస్టమ్‌తో వస్తాయి. వీటితో పాటు 1.5 లీటర్ల సామర్థ్యం గల ఫుడ్ ప్రాసెసర్ ను సైతం మిక్సీకి అందిస్తున్నారు. దీనిని ఉపయోగించి చపాతి పిండి కలపడం, కూరగాయలు కట్ చేయడం, స్లైసింగ్, జ్యూస్ చేయడం వంటి విభిన్న పనులను క్షణాల్లో చేయవచ్చు.
Also Read: మెున్న శ్రీరెడ్డి, నిన్న పోసాని, నేడు బోరుగడ్డ.. అయ్యో అయ్యో అయ్యయ్యో?
మిక్సీతో పాటు ట్విన్ చాపింగ్ బ్లేడ్, ఆటా నీడర్, విస్కింగ్ డిస్క్, సిట్రస్ జ్యూసర్ ను కంపెనీ అందిస్తోంది. అలాగే ఫ్రెంచ్ ఫ్రై కటింగ్ కోసం నాలుగు రకాల స్టెయిన్‌లెస్ స్టీల్ డిస్క్ బ్లేడ్‌లను ఆఫర్ చేస్తోంది. ఇక మిక్సీ లుక్ విషయానికి వస్తే.. క్రోమ్-ఫినిష్ యాక్సెంట్స్, ఎల్ఈడీ పవర్ ఇండికేటర్లతో ఆకర్షణీయమైన ఏబీఎస్ (ABS) బాడీని దీనికి అందించారు. ఐఎస్‌ఐ (ISI) సర్టిఫికేషన్ కూడా ఉండటంతో వినియోగానికి ఎంతో సురక్షితమైనదని సంస్థ పేర్కొంది.
Also Read: Airtel మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. రూ.489 కే 77 రోజుల వ్యాలిడిటీ.. నాన్ స్టాప్ కాల్స్, డేటా!