E-Paper
Advertisement

వైఫై రూటర్ మీద యాంటెనాలు దేనికోసమో తెలుసా? ఇప్పటివరకు మీకు ఎవ్వరూ చెప్పని షాకింగ్ ఫ్యాక్ట్స్!

వైఫై రూటర్ మీద యాంటెనాలు దేనికోసమో తెలుసా? ఇప్పటివరకు మీకు ఎవ్వరూ చెప్పని షాకింగ్ ఫ్యాక్ట్స్!
Advertisement

Wifi antennas myth: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రతి ఇంట్లోనూ వై-ఫై రూటర్లు దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే..మార్కెట్లోకి కొత్త రౌటర్లు కొనడానికి వెళ్లినప్పుడు,రెండు,నాలుగు లేదా అంతకంటే ఎక్కువ యాంటెనాలు ఉన్న రౌటర్లను మనం చూస్తుంటాం. రూటర్‌పై ఎక్కువ యాంటెనాలు కనిపిస్తే చాలు.. అది చాలా ఫాస్ట్ గా ఇంటర్నెట్‌ను ఇస్తుందని చాలా మంది గుడ్డిగా నమ్ముతుంటారు. అయితే నెట్‌వర్కింగ్ నిపుణుల ప్రకారం.. ఈ నమ్మకంలో చాలా వరకు అబద్ధమే ఉంది. యాంటెనాల సంఖ్య ఎక్కువ ఉన్నంత మాత్రాన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చే స్పీడ్ మ్యాజిక్‌లా పెరిగిపోదు.

యాంటెనాలు ఇంటర్నెట్ వేగాన్ని పెంచుతాయా?

నిజానికి..వై-ఫై రూటర్‌లోని యాంటెనాలు ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్ వేగాన్ని నేరుగా పెంచలేవు. మీ ఇంటర్నెట్ ప్లాన్ 50 Mbps అనుకోండి, మీ రూటర్‌పై పది యాంటెనాలు ఉన్నప్పటికీ.. ఆ స్పీడ్ 100 Mbps అయిపోదు.ఇంటర్నెట్ వేగం అనేది పూర్తిగా మీరు తీసుకున్న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ , మీ ఇంటర్నెట్ కేబుల్ లేదా ఫైబర్ కనెక్షన్ పైనే ఆధారపడి ఉంటుంది. మరి అలాంటప్పుడు రూటర్లపై ఎందుకు అంతకంటే ఎక్కువ యాంటెనాలు ఇస్తున్నారు అనే ప్రశ్న రావడం సహజం. దాని రహస్యం వేరే ఉంది.

ఎక్కువ యాంటెనాలు ఎందుకు ఇస్తారు?

Advertisement

రూటర్‌పై యాంటెనాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ‘కవరేజ్’, ‘సిగ్నల్ స్టెబిలిటీ’. లేటెస్ట్ రూటర్లలో ‘MIMO’అనే టెక్నాలజీని వాడుతున్నారు. దీని అర్థం ఏంటంటే.. రౌటర్ ఒకే సమయంలో ఇంట్లోని రకరకాల డివైజెస్‌తో (మొబైల్స్, లాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు) వేర్వేరు సిగ్నల్స్ ద్వారా కమ్యూనికేట్ చేయగలదు. మీ ఇంట్లో గోడలు ఎక్కువగా ఉండి, వై-ఫై సిగ్నల్ సరిగ్గా అందకపోతే.. ఎక్కువ యాంటెనాలు ఉన్న రూటర్ ఆ సిగ్నల్స్‌ను ఇంటి మూలమూలకు చేరవేయడంలో సహాయపడుతుంది. అంటే ఇది వేగాన్ని పెంచదు కానీ, సిగ్నల్ డ్రాప్ కాకుండా చూస్తుంది.

సింగిల్ బ్యాండ్ vs డ్యూయల్ బ్యాండ్ యాంటెనాలు:

కొన్ని రూటర్లపై ఉండే యాంటెనాలు 2.4GHz ,5GHz బ్యాండ్‌లను హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడతాయి. 2.4GHz బ్యాండ్ ఎక్కువ దూరం సిగ్నల్ ఇస్తుంది కానీ వేగం తక్కువగా ఉంటుంది. అదే 5GHz బ్యాండ్ తక్కువ దూరం వెళ్తుంది కానీ ఇంటర్నెట్ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. రూటర్లపై ఉండే యాంటెనాలలో కొన్ని ఈ రెండు ఫ్రీక్వెన్సీలను వేరు వేరుగా విభజించడానికి తోడ్పడతాయి.కాబట్టి, యాంటెనాల సంఖ్య కంటే ఆ రౌటర్ లోపల ఉన్న ప్రాసెసర్, రామ్ ,టెక్నాలజీ ఎంత కొత్తవి అనేదే ముఖ్యం.

Advertisement

Also Read: సగం ధరకే ఏసర్ 14th Gen ల్యాప్‌టాప్..అస్సలు మిస్సవ్వొద్దు!

మంచి వై-ఫై సిగ్నల్ కోసం ఏం చేయాలి?

మీ ఇంట్లో ఇంటర్నెట్ వేగం పెరగాలన్నా, సిగ్నల్ సరిగ్గా రావాలన్నా కేవలం రూటర్ యాంటెనాలను లెక్కపెట్టడం సరిపోదు. రూటర్‌ను ఎల్లప్పుడూ ఇంటికి మధ్య భాగంలో, ఎత్తులో ఉంచాలి. అంతే కాకుండా రూటర్ చుట్టూ ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా మందపాటి గోడలు లేకుండా చూస్తే సిగ్నల్స్ అద్భుతంగా వస్తాయి. అలాగే మీ అవసరానికి తగిన హై-స్పీడ్ ఇంటర్నెట్ ప్లాన్‌ను ఎంచుకోవడం బెస్ట్.

మొత్తంగా చెప్పాలంటే.. వై-ఫై రూటర్‌పై ఎక్కువ యాంటెనాలు ఉన్నంత మాత్రాన ఇంటర్నెట్ వేగం అద్భుతంగా పెరిగిపోతుందనడంలో ఎలాంటి నిజం లేదు. యాంటెనాలు కేవలం వై-ఫై సిగ్నల్ పరిధిని పెంచడానికి ,కనెక్షన్‌ను స్థిరంగా ఉంచడానికి మాత్రమే సహాయపడతాయి. కాబట్టి మరో సారి రూటర్ కొనేటప్పుడు యాంటెనాల సంఖ్య కంటే దాని టెక్నాలజీ, ఫీచర్లపై దృష్టి పెట్టడం మంచిది!

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×