E-Paper
Advertisement

ఇంతవరకు ఏ ఇయర్‌బడ్స్‌లోనూ లేని ఫీచర్లు..లుక్ చూస్తే మైండ్ బ్లాకే!

ఇంతవరకు ఏ ఇయర్‌బడ్స్‌లోనూ లేని ఫీచర్లు..లుక్ చూస్తే మైండ్ బ్లాకే!
Advertisement

CMF Clip Pro open ear earbuds: ఆడియో మార్కెట్‌లో నథింగ్ సబ్‌బ్రాండ్ CMF  సరి కొత్త ప్రయోగాలతో ట్రెండ్ సెట్ చేస్తోంది. అయితే తాజాగా ఆ సంస్థ నుంచి ‘CMF Clip Pro’ పేరుతో ఓపెన్-ఇయర్ ఇయర్‌ బడ్స్ మార్కెట్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాయి.  సరి కొత్త క్లిప్-ఆన్ డిజైన్, కస్టమైజ్డ్ ఆడియో సెట్టింగ్స్, బెస్ట్ ఆడియో క్వాలిటీ కోసం LDAC సపోర్ట్‌తో ఇవి రూపొందాయి. ఏకంగా 32.5 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందించే ఈ బడ్స్ ధర, ఫీచర్లు , టాప్ స్పెసిఫికేషన్స్ వివరాలను ఇప్పుడు చూద్దాం.

CMF Clip Pro ఇయర్‌బడ్స్ ఫీచర్లు :

ఈ రోజుల్లో రెగ్యులర్ ఇన్-ఇయర్ బడ్స్ కంటే చెవికి హాయిగా ఉండే ‘ఓపెన్-ఇయర్’ డిజైన్ బడ్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. చెవి లోపలికి పెట్టాల్సిన అవసరం లేకుండా.. చెవి పైన క్లిప్‌లా తగిలించుకునేలా వీటిని డిజైన్ చేశారు.

యూనిక్ క్లిప్-ఆన్ డిజైన్ & కంఫర్ట్:

Advertisement

వీటి స్పెషల్ అట్రాక్షన్ వాటి ఫ్యాషనబుల్ డిజైన్. ఇవి చెవికి రింగ్ లాగా తొడుక్కోవడానికి వీలుగా ఫ్లెక్సిబుల్ క్లిప్‌తో వస్తాయి. వర్కవుట్స్ చేసేటప్పుడు.. రన్నింగ్ లేదా సైక్లింగ్ చేసేటప్పుడు చెవి నుంచి ఊడిపోవు. అంతే కాకుండా చెవి రంధ్రాలను పూర్తిగా మూసివేయవు కాబట్టి.. ఆఫీసుల్లో పని చేసేటప్పుడు లేదా రోడ్డుపై వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల శబ్దాలు కూడా స్పష్టంగా వినిపిస్తాయి.

ఆడియో క్వాలిటీ సపోర్ట్:

సాధారణంగా ఓపెన్-ఇయర్ బడ్స్‌లో బేస్ కాస్త తక్కువగా ఉంటుంది. కానీ CMF ఇందులో కస్టమ్ డ్రైవర్లను ఉపయోగించింది.

Advertisement

కోడెక్ సపోర్ట్: బ్లూటూత్ ద్వారా అత్యధిక క్వాలిటీ ఉన్న హై-రెజల్యూషన్ ఆడియోను ఎంజాయ్ చేయడానికి ఇందులో LDAC సపోర్ట్ అందించారు.

కస్టమ్ EQ: నథింగ్ ఎక్స్ యాప్ ద్వారా మీ ఇష్టానికి తగ్గట్టు ఆడియో ఈక్వలైజర్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు.

డ్యూయల్ మైక్ క్లియర్ కాల్స్: ప్రతీ ఇయర్‌బడ్‌లోనూ రెండు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్లు ఉంటాయి. ఇవి కాల్స్ మాట్లాడేటప్పుడు గాలి సౌండ్ తగ్గించి మీ వాయిస్‌ను క్లియర్‌గా అందిస్తాయి.

32.5 గంటల బ్యాటరీ లైఫ్ & ఫాస్ట్ ఛార్జింగ్:

మ్యూజిక్ లవర్స్ ఎక్కువగా కోరుకునేది మంచి బ్యాటరీ బ్యాకప్. ఈ మోడల్ ఆ విషయంలో ఏమాత్రం నిరాశపరచదు.

ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఇది ఏకంగా 32.5 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్‌ను ఇస్తుంది. అంతే కాకుండా కవలం ఒక్క సారి ఛార్జ్ చేస్తే 6 నుంచి 7 గంటల పాటు పనిచేస్తాయి. ఇదిలా ఉంటే.. టైప్-సి పోర్ట్ ద్వారా కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే దాదాపు 3 గంటల ప్లేబ్యాక్ టైమ్ లభిస్తుంది.

Also Read: రూ.615 ధరకే..పోర్టబుల్ టీవీ సౌండ్‌బార్! ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే

ఇతర ప్రత్యేకతలు:

డ్యూయల్ డివైస్ కనెక్షన్: ఒకేసారి ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయ్యే ‘మల్టీపాయింట్ కనెక్షన్’సపోర్ట్ ఉంది.

IPX4 వాటర్ రెసిస్టెన్స్: చెమట, చిన్నపాటి నీటి తుంపరల నుంచి పాడవకుండా వాటర్ రెసిస్టెన్సి ఇచ్చారు.

టచ్ కంట్రోల్స్: పాటలు మార్చడానికి, కాల్స్ లిఫ్ట్ చేయడానికి అడ్వాన్స్‌డ్ టచ్ సెన్సార్లు ఉన్నాయి.

ధర:

బడ్జెట్ ధరలోనే ప్రీమియం డిజైన్, LDAC సపోర్ట్‌ను CMF అందిస్తోంది. స్టైలిష్ లుక్, రోజంతా చెవికి నెప్పి లేని కంఫర్ట్, మైండ్ బ్లోయింగ్ బ్యాటరీ లైఫ్ కావాలో.. వారికి ఈ మోడల్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు!

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×