E-Paper
Advertisement

ఇండిపెండెన్స్ డే ధమాకా సేల్స్..ఐఫోన్లు,వన్‌ప్లస్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు!

ఇండిపెండెన్స్ డే ధమాకా సేల్స్..ఐఫోన్లు,వన్‌ప్లస్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు!
Advertisement

Best Independence Day smartphone deals: స్మార్ట్‌ఫోన్ లేదా కొత్త గ్యాడ్జెట్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే.. మీ కోసం అసలైన పండగ ఆఫర్లు వచ్చేశాయి! స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది టెక్ రంగంలో రెండు అతిపెద్ద సేల్స్ ఒకేసారి సందడి చేయబోతున్నాయి. వన్‌ప్లస్ ‘ఇండిపెండెన్స్ డే సేల్’ ఆగస్టు 7న ప్రారంభమవుతుండగా.. ఫ్లిప్‌కార్ట్ ‘ఫ్రీడమ్ సేల్’ ఆగస్టు 8న మొదలుకానుంది (ప్లస్ సభ్యులకు ఆగస్టు 7 నుంచే యాక్సెస్). ఫలితంగా ఐఫోన్లు, వన్‌ప్లస్ ప్లాగ్‌షిప్‌లతో పాటు బడ్జెట్ ఫోన్లు, బడ్స్, టాబ్లెట్లపై ఆఫర్ల వర్షం కురవనుంది. ఈ రెండింటిలో లభించే బెస్ట్ డీల్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం!

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ vs వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్:

ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ సేల్స్ కస్టమర్లకు భారీ ఊరటనివ్వనున్నాయి. ముఖ్యంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై ఊహించని రీతిలో ధరలు తగ్గాయి.

1. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్: ఐఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు:

Advertisement

యాపిల్ లవర్స్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో అదిరిపోయే.. ఆఫర్లను తీసుకొచ్చింది. ఐఫోన్ 17 సిరీస్ మోడల్స్‌పై రికార్డు స్థాయి తగ్గింపులు ఉన్నాయి.

iPhone 17 Pro: అసలు ధర రూ.1,34,900 కాగా, సేల్ ధర రూ.1,26,900గా ఉంది. SBI లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు కలిపి మొత్తం రూ.17,000 వరకు లాభం పొందవచ్చు. దీంతో దీని ఎఫెక్టివ్ ధర దాదాపు రూ.1,21,900 కి తగ్గుతుంది.

Advertisement

iPhone 17 Pro Max: లాంచ్ ధర రూ.1,49,900 ఉండగా, ఫ్లాట్ డిస్కౌంట్ రూ.8,000తో సేల్ ధర రూ.1,41,900కి చేరుతుంది. బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ కలిపితే ఎఫెక్టివ్ ప్రైస్ రూ.1,32,900కే లభిస్తుంది.

iPhone 15: అసలు ధర రూ.59,900 కాగా, ఆఫర్‌లో రూ.55,900 కే పొందవచ్చు.

iPhone 16 Plus: అసలు ధర రూ.79,900 కాగా, సేల్‌లో ఎఫెక్టివ్ ప్రైస్ రూ.75,900గా నిర్ణయించారు.

ఇవే కాకుండా iPhone 17 బేస్ వేరియంట్ రూ.80,000 కంటే తక్కువ ధరకు లభించే అవకాశం ఉందని ఫ్లిప్‌కార్ట్ టీజర్లు సూచిస్తున్నాయి.

2. వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్: ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్‌లపై బంపర్ ఆఫర్లు

వన్‌ప్లస్ తన అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఆగస్టు 7 నుంచి ఈ సేల్ ప్రారంభించనుంది. ఫోన్లతో పాటు టాబ్లెట్లు, ఆడియో ప్రొడక్టులపై కూడా భారీ డిస్కౌంట్లు ఇస్తోంది.

వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ డీల్స్:

OnePlus 13s: దీని ఒరిజినల్ ప్రైస్ రూ.54,999. ఇన్స్టెంట్ బ్యాంక్ ఆఫర్ రూ.2,000తో కలిపి మొత్తం రూ.5,000 వరకు బెనిఫిట్ పొందితే, దీని ఎఫెక్టివ్ ధర రూ.49,999 కి మారుతుంది.

OnePlus 15: ఒరిజినల్ ధర రూ.85,999 కాగా, బ్యాంక్ డిస్కౌంట్ రూ.4,000తో రూ.81,999 కే లభిస్తుంది.

OnePlus 15R: అసలు ధర రూ.59,999 ఉంటే, రూ.3,000 బ్యాంక్ తగ్గింపుతో రూ.56,999 కే దక్కించుకోవచ్చు.

OnePlus Nord 6: రూ. 44,999 అసలు ధర ఉన్న ఈ మోడల్ రూ.2,500 డిస్కౌంట్‌తో రూ.41,999 కే లభిస్తుంది.

OnePlus Nord CE6: ఇన్‌స్టెంట్ డిస్కౌంట్‌తో స్టార్టింగ్ ప్రైస్ రూ.31,999 గా ఉండనుంది.

వన్‌ప్లస్ టాబ్లెట్లు & ఇయర్‌బడ్స్ ఆఫర్లు:

OnePlus Buds Pro 3: ఒరిజినల్ ధర రూ.12,999 కాగా, సేల్ ధర రూ.9,999.

OnePlus Buds 4: అసలు ధర రూ.6,499 కాగా, ఆఫర్‌లో రూ.5,599 కే లభించనుంది.

OnePlus Pad 4: అసలు ధర రూ.59,999 కాగా, రూ.3,500 బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ.56,499 కే అందుబాటులోకి రానుంది.

వీటితో పాటు వన్‌ప్లస్ 6 నెలల వరకు నో-కాస్ట్ EMI, ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లపై 9 నెలల వరకు ఫైనాన్సింగ్ అవకాశాన్ని కూడా అందిస్తోంది.

 ఏ సేల్  బెస్ట్?

మీరు యాపిల్ ఈకోసిస్టమ్‌ను ఇష్టపడితే ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ మంచి ఛాయిస్. ఐఫోన్‌లపై వచ్చే క్యాష్‌బ్యాక్‌లు భారీగా డబ్బు ఆదా చేస్తాయి. ఒకవేళ.. ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్, టాబ్లెట్ లేదా బడ్స్ కొనాలనుకుంటే.. వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్ సరైన ఆప్షన్. ఆఫర్లు పరిమిత స్టాక్ వరకే ఉండే అవకాశం ఉంది కాబట్టి ముందే కార్ట్ సిద్ధం చేసుకోవడం మంచిది!

Related News

ఫోన్ బ్యాటరీని సైలెంట్‌గా ఖాళీ చేస్తున్న 5G.. ఈ ఒక్క సెట్టింగ్ మారిస్తే.. మైండ్ బ్లోయింగ్ రిజల్ట్!

ఇంతవరకు ఏ ఇయర్‌బడ్స్‌లోనూ లేని ఫీచర్లు..లుక్ చూస్తే మైండ్ బ్లాకే!

తడిసిన ఇయర్‌బడ్స్‌ను ఎలా కాపాడుకోవాలి? ఈ తప్పులు అస్సలు చేయకండి!

మీ స్మార్ట్‌ఫోన్ కొత్తదా లేక వాడిందా? ఈ చిన్న ట్రిక్స్‌తో..2 నిమిషాల్లో కనిపెట్టండి!

ఫిలిప్స్, షావోమీ, నోవా.. రూ. 1,500 లోపు ఏ ట్రిమ్మర్ కొంటే బెటర్?

వైఫై రూటర్ మీద యాంటెనాలు దేనికోసమో తెలుసా? ఇప్పటివరకు మీకు ఎవ్వరూ చెప్పని షాకింగ్ ఫ్యాక్ట్స్!

మార్కెట్లోకి All-in-One మిక్సీ.. 1 మిషన్, 10 రకాల పనులు.. హెవీ డ్యూటీకి కేరాఫ్!

Big Stories

Advertisement
×