E-Paper
Advertisement

ఫోన్ బ్యాటరీని సైలెంట్‌గా ఖాళీ చేస్తున్న 5G.. ఈ ఒక్క సెట్టింగ్ మారిస్తే.. మైండ్ బ్లోయింగ్ రిజల్ట్!

ఫోన్ బ్యాటరీని సైలెంట్‌గా ఖాళీ చేస్తున్న 5G.. ఈ ఒక్క సెట్టింగ్ మారిస్తే.. మైండ్ బ్లోయింగ్ రిజల్ట్!
Advertisement

5G network: ఈ రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌లో 5G ఇంటర్నెట్ వాడుతుంటే  స్పీడే  మామూలుగా ఉండదు! పెద్ద పెద్ద ఫైళ్లు సెకన్లలో డౌన్‌లోడ్ అయిపోతాయి, వీడియోలు అసలు బఫరింగ్ లేకుండా ప్లే అవుతాయి. అయితే.. ఈ సూపర్ ఫాస్ట్ స్పీడ్ వెనక ఒక పెద్ద సమస్య దాగి ఉంది. చాలా మంది యూజర్లు కంఫ్లైంట్ చేసే ప్రధాన అంశం.. “బ్యాటరీ త్వరగా అయిపోతోంది!” అని. మరి నిజంగానే.. 5G ఆన్ చేయడం వల్ల బ్యాటరీ ఎక్కువగా ఖర్చవుతుందా? దీని వెనకున్న సైన్స్ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం!

మీ ఫోన్‌లో 5G ఆన్ చేసి ఉంచడం వల్ల 4G తో పోలిస్తే బ్యాటరీ వేగంగా డ్రెయిన్ అవుతుందనేది పచ్చి నిజం. చాలా మంది ఇది ఫోన్ సమస్య అనుకుంటారు. కానీ అసలు కారణం నెట్‌వర్క్ సాంకేతికత, మీ పరిసరాల్లో ఉండే సిగ్నల్ స్ట్రెంగ్త్.

1. NSA నెట్‌వర్క్ టెక్నాలజీ:

Advertisement

ప్రస్తుతం చాలా టెలికాం కంపెనీలు ‘Non-Standalone (NSA)’ 5G నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్నాయి. అంటే.. 5G డేటా స్పీడ్ కోసం 5G బ్యాండ్‌ను వాడుతూనే, కాల్స్ , సిగ్నల్ కనెక్టివిటీ కోసం బ్యాక్‌గ్రౌండ్‌లో 4G నెట్‌వర్క్‌ను కూడా ఆన్‌లో ఉంచుతాయి. ఒకేసారి ఫోన్ మోడెమ్ రెండు నెట్‌వర్క్‌లతో కనెక్ట్ అయి ఉండటం వల్ల ప్రాసెసర్‌పై భారం పడి బ్యాటరీ విపరీతంగా ఖర్చవుతుంది.

2. సిగ్నల్ వెతుకులాట :

మన దేశంలో 5G టవర్ల కవరేజ్ ఇంకా అన్ని ప్రాంతాల్లో సమానంగా లేదు. మీరు ప్రయాణిస్తున్నప్పుడు లేదా ఇండోర్‌లో ఉన్నప్పుడు 5G సిగ్నల్ బలహీనపడగానే.. ఫోన్ పదే పదే 5G నుంచి 4G కి, మళ్లీ 4G నుంచి 5G కి మారుతూ ఉంటుంది. ఇలా తరచూ జరిగే ‘సిగ్నల్ సెర్చింగ్’ వల్ల ప్రాసెసర్ ఎక్కువ శక్తిని వినియోగించుకుంటుంది. దీని వల్ల ఫోన్ వేడెక్కడమే కాకుండా బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది.

Advertisement

3. మల్టీ-యాంటెన్నా :

5G స్పీడ్ సాధించడానికి ఫోన్‌లోని ‘MIMO’అడ్వాన్స్‌డ్ యాంటెన్నాలు పని చేస్తాయి. ఇవి ఒకేసారి ఎక్కువ డేటాను ప్రాసెస్ చేయడానికి కరెంట్ ఎక్కువగా గ్రహిస్తాయి. ఫలితంగా ఛార్జింగ్ త్వరగా దిగిపోతుంది.

Also Read: రూ.615 ధరకే..పోర్టబుల్ టీవీ సౌండ్‌బార్! ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే

బ్యాటరీ డ్రెయిన్ తగ్గించుకోవడానికి సింపుల్ ట్రిక్స్:

1.ఆటో/స్మార్ట్ 5G ఆన్ చేయండి: మీ ఫోన్ సెట్టింగ్స్‌లో ‘Auto 5G’ లేదా ‘Smart 5G’ ఆప్షన్ ఉంటే దాన్ని ఎనేబుల్ చేయండి. ఇది మీరు ఫోన్ వాడుతున్నప్పుడు మాత్రమే 5G ని, మిగతా సమయంలో ఆటోమేటిక్‌గా 4G ని ఎంచుకుని బ్యాటరీని సేవ్ చేస్తుంది.

2. 4G కి మారండి: మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా సిగ్నల్ సరిగ్గా లేని ప్రదేశాల్లో ఉన్నప్పుడు Network Settings లో ‘Preferred Network Type’ ను 4G/LTE కి మార్చడం మంచిది.

3. వైఫై వాడండి: ఇంటి వద్ద లేదా ఆఫీసులో ఉన్నప్పుడు మొబైల్ డేటాని ఆపివేసి వైఫై వాడటం వల్ల బ్యాటరీ చాలా సేపు వస్తుంది.

4.5G అందించే స్పీడ్ ఎంత బాగుందో, అది వాడే బ్యాటరీ పవర్ కూడా అంతే ఎక్కువ. కాబట్టి అవసరాన్ని బట్టి 5G సెట్టింగ్స్ మార్చుకుంటూ.. ఫోన్ వాడితే బ్యాటరీ లైఫ్‌ను ఈజీగా కాపాడుకోవచ్చు!

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×