E-Paper
Advertisement

బెడ్‌రూమ్‌లో కూర్చునే 200 కోట్ల చోరీ.. ఒక్క హ్యాక్‌తో ప్రాణాల మీదికి… హై-వోల్టేజ్ సైబర్ థ్రిల్లర్

బెడ్‌రూమ్‌లో కూర్చునే 200 కోట్ల చోరీ.. ఒక్క హ్యాక్‌తో ప్రాణాల మీదికి… హై-వోల్టేజ్ సైబర్ థ్రిల్లర్
Advertisement

Cyber Thriller: ఒక చిన్న సరదా ఎంత పెద్ద ప్రమాదంగా మారుతుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా ఆ సరదా కంప్యూటర్ హ్యాకింగ్‌కు సంబంధించినదైతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. సోషల్ మీడియా, క్రిప్టోకరెన్సీ, డార్క్ వెబ్‌లాంటి ఆధునిక అంశాలను కలిపి తెరకెక్కిన హాలీవుడ్ సైబర్ థ్రిల్లర్ ‘లైఫ్‌ హ్యాక్’ (Life Hack 2026) అలాంటి ఆసక్తికరమైన చిత్రమే. సాధారణ యాక్షన్ థ్రిల్లర్‌లా కాకుండా, మొత్తం కథ కంప్యూటర్ స్క్రీన్‌లు, వీడియో కాల్స్, చాట్ విండోలు, సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారానే ప్రేక్షకుడి ముందుకు రావడం ఈ సినిమాకు అతిపెద్ద ప్రత్యేకత. మరి ఇంతకీ ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కైల్, అలెక్స్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు కంప్యూటర్ హ్యాకింగ్‌లో మంచి నైపుణ్యం కలిగిన టీనేజర్లు. ఆన్‌లైన్‌లో అమాయక ప్రజలను మోసం చేసే చిన్న చిన్న స్కామర్లను హ్యాక్ చేస్తూ వారికి బుద్ధి చెప్పడం వీళ్లకు అలవాటుగా మారుతుంది. కానీ ఒక దశ తర్వాత చిన్న హ్యాకింగ్‌లతో సరిపెట్టుకోవడం వారికి బోర్ కొడుతుంది.

Advertisement

అప్పుడే ఒక భారీ ప్లాన్ సిద్ధమవుతుంది. వందల కోట్ల రూపాయల విలువైన క్రిప్టోకరెన్సీ కలిగి ఉన్న బిలియనీర్ డాన్ హెర్డ్‌ను టార్గెట్ చేయాలని నిర్ణయించుకుంటారు. అతని కూతురు సోషల్ మీడియాలో షేర్ చేసే వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించి ఆమె ద్వారా డాన్ హెర్డ్ డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించే మార్గాన్ని కనిపెడతారు.

పక్కా ప్రణాళికతో ముందుకెళ్లిన ఈ నలుగురు యువ హ్యాకర్లు చివరకు బిలియనీర్ క్రిప్టో వాలెట్‌లోకి చొరబడి దాదాపు 25 మిలియన్ డాలర్ల విలువైన బిట్‌కాయిన్‌ను దొంగిలించడంలో విజయం సాధిస్తారు. అంతా అనుకున్నట్టే జరిగిపోయిందని సంబరపడుతుండగానే కథ ఊహించని మలుపు తిరుగుతుంది.

Advertisement

అసలు ప్రమాదం అప్పుడే మొదలవుతుంది. డాన్ హెర్డ్ కూతురు లిండ్సే సాధారణ అమ్మాయి కాదని వారికి త్వరగానే అర్థమవుతుంది. ఆమె తన తెలివితో హ్యాకర్ల అసలు గుర్తింపును కనిపెట్టి నేరుగా వీడియో కాల్ చేస్తుంది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, తన తండ్రికి చెప్పకుండా ఉండాలంటే మరో ప్రమాదకరమైన పని చేయాలని వారిని బ్లాక్‌మెయిల్ చేస్తుంది.

అక్కడి నుంచి ఈ నలుగురు యువకుల జీవితం పూర్తిగా మారిపోతుంది. సరదాగా మొదలైన హ్యాకింగ్ ఇప్పుడు వారి ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. డార్క్ వెబ్, క్రిప్టో నేరాలు, మోసాల వలలో చిక్కుకున్న వారు చివరకు బయటపడగలిగారా ? లేక ఆ సైబర్ ప్రపంచమే వారిని మింగేసిందా ? అనే విషయాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

స్ట్రీమింగ్ ఎక్కడ ?

‘లైఫ్‌ హ్యాక్’ సాధారణ హ్యాకింగ్ సినిమా కాదు. ఇది పూర్తిగా స్క్రీన్‌లైఫ్ ఫార్మాట్‌లో రూపొందింది. అంటే మొత్తం సినిమా కంప్యూటర్ స్క్రీన్‌లు, మొబైల్ ఫోన్లు, వీడియో కాల్స్, సోషల్ మీడియా, మెసేజ్‌లు, సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారానే సాగుతుంది. ఈ కొత్త తరహా ప్రెజెంటేషన్ థ్రిల్లర్‌కు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది.

జార్జీ ఫార్మర్, యాస్మిన్ ఫిన్నీ, జెసికా రేనాల్డ్స్, చార్లీ క్రీడ్-మైల్స్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించగా, దర్శకుడు రోనన్ కారిగన్ ఆధునిక డిజిటల్ ప్రపంచంలో దాగి ఉన్న ప్రమాదాలను ఉత్కంఠభరితంగా చూపించే ప్రయత్నం చేశారు. సినిమా ఆగస్టు 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రానికి తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. కేవలం ఇంగ్లీష్ ఆడియోలో మాత్రమే వీక్షించవచ్చు. అవసరమైతే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో సినిమా చూడొచ్చు. సైబర్ క్రైమ్, హ్యాకింగ్, క్రిప్టోకరెన్సీ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ సినిమాలు నచ్చితే ‘లైఫ్‌హాక్’ తప్పకుండా చూడాల్సిన చిత్రమే. హాలీవుడ్ టెక్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికైతే ఇది వర్త్ వాచింగ్ మూవీ.

Read Also: కిడ్నాప్ వెనుక క్రిమినల్ నెట్‌వర్క్… కూతురి కోసం బ్లడీ బ్లడ్ బాత్

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×