BigTV English
Advertisement

Whatsapp: ఒకేసారి 4 డివైస్‌ల్లో వాట్సాప్…

Whatsapp: ఒకేసారి 4 డివైస్‌ల్లో వాట్సాప్…

యూజర్లను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తున్న వాట్సప్… ఇప్పుడు కంపానియన్ మోడ్ అనే అద్భుత ఫీచర్‌ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ సూపర్ ఫీచర్ సిద్ధమైతే… ఒకే నంబర్‌తో ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్లతో పాటు, మరో రెండు డివైస్‌లలో వాట్సప్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ని ప్రస్తుతం పరీక్షిస్తోంది… వాట్సప్.


వాట్సాప్ కొత్త ఫీచర్లను ట్రాక్ చేసే వాబేటా సమాచారం ప్రకారం… కంపానియన్ మోడ్‌ ఫీచర్‌ను కొంతమంది బీటా టెస్టర్‌లకు వాట్సప్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్ష దశలో ఉంది. ఇది అందుబాటులోకి వస్తే… మొబైల్, డెస్క్‌టాప్‌లో ఒకేసారి వాట్సప్‌ను ఉపయోగించవచ్చు. ‘లింక్ డివైస్’ ఆప్షన్ ద్వారా రెండో స్మార్ట్‌ఫోన్‌ను కూడా లింక్ చేసుకునేలా కంపానియన్ మోడ్ ఉండబోతోంది. ఇంకో స్మార్ట్‌ఫోన్‌ను లింక్ చేశాక… మెసేజేస్‌ చూడటం, రిప్లై ఇవ్వడంతో పాటు… చాట్ హిస్టరీ చూడటం, కాల్స్‌ చేసుకోవడం వంటి పనులు అందులోనూ వీలవుతాయి. ఒక యూజర్ గరిష్టంగా 4 డివైస్‌లకు… అంటే రెండు స్మార్ట్‌ఫోన్‌లు, ఒక టాబ్లెట్, ఒక డెస్క్‌టాప్‌కి వాట్సప్ లింక్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం క్యూఆర్‌ కోడ్ స్కానింగ్ ద్వారా డెస్క్‌టాప్‌లో వాట్సప్‌ వాడుతున్నట్లే… మరో స్మార్ట్‌ఫోన్‌, టాబ్లెట్లోనూ వాట్సప్ వాడొచ్చు.

ఇకపై వాట్సప్ లోనూ క్రెడిట్ స్కోరు ఉచితంగా తెలుసుకోవచ్చు. ప్రముఖ క్రెడిట్‌ బ్యూరో సంస్థ ఎక్స్‌పీరియన్‌ ఈ సదుపాయాన్ని ప్రారంభించింది. దేశంలో ఈ సేవల్ని ప్రారంభించిన తొలి సంస్థ తమదేనని ఎక్స్‌పీరియన్‌ పేర్కొంది. త్వరగా, భద్రంగా, ఈజీగా క్రెడిట్‌ స్కోర్‌ను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ఈ సేవల్ని అందుబాటులోకి తెచ్చామని ఎక్స్‌పీరియన్‌ తెలిపింది. వాట్సప్‌ ద్వారా క్రెడిట్ స్కోరు తెలుసుకోవాలంటే… 9920035444 నెంబరుకు ‘Hey’ అని వాట్సాప్‌ చేయాలి. ఆ తర్వాత పేరు, మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నంబర్ వివరాలు ఇచ్చి… ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలి. ఆ వెంటనే క్రెడిట్‌ స్కోర్‌ మెస్సేజ్ వస్తుంది. పూర్తి క్రెడిట్ రిపోర్ట్ మెయిల్‌కు వచ్చేస్తుంది. పాస్‌వర్డ్‌తో ఆ ఫైల్ ఓపెన్ చూసి… హిస్టరీ మొత్తం చూసుకోవచ్చు.


Tags

Related News

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

Plane Crash: రన్ వే నుంచి నేరుగా సముద్రంలోకి.. ఘోర విమాన ప్రమాదం, స్పాట్ లోనే..

Big Stories

×