OTT Movie : అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో యాక్షన్ సీన్స్ తో ఔరా అనిపించాడు సన్నీ డియోల్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘జాట్’ మూవీతో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు ఈ బాలీవుడ్ హీరో. ఈ సినిమాతో దర్శకుడిగా, బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుకున్నాడు గోపీచంద్. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో విడుదలై బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ స్టోరీ ఆంధ్రప్రదేశ్‌లోని మోటుపల్లి అనే గ్రామంలో జరుగుతుంది. ఒక మాఫియాని ఎదుర్కునే పాత్రలో సన్నీ యాక్షన్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. యాక్షన్ అభిమానులకు ఈ సినిమా బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘జాట్’ (Jaat) గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన హిందీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఇందులో సన్నీ డియోల్,రాణాదేవ్ హూడా, వీనెత్ కుమార్ సింగ్, రెజీనా కాసాండ్రా, సైయామి ఖేర్, రమ్యా కృష్ణ, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ అయింది. జూన్ 5 నుంచి Netflix లో స్ట్రీమింగ్ అవుతోంది. ఐయండిబి లో దీనికి 6.0/10 రేటింగ్ పొందింది.
ఆంధ్రప్రదేశ్‌లోని మోటుపల్లి గ్రామంలో రణతుంగ అనే శ్రీలంక రబ్బరు గ్యాంగ్ స్టర్ రూల్ చేస్తుంటాడు. రణతుంగ 15 సంవత్సరాలుగా గ్రామస్తులను భయపెట్టి, డబ్బు, భూములను లాక్కుని దౌర్జన్యం చేస్తుంటాడు. అతని భార్య భారతి, సోదరుడు సోములు కూడా అతని గ్యాంగ్‌లో కీలకంగా ఉంటారు. వీళ్ళ వల్ల గ్రామస్తులు భయంతో వణికి పోతుంటారు. పోలీసులు కూడా అతన్ని టచ్ చేయలేక పోతుంటారు. ఒక రోజు ఒక రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ కి, ఒక వ్యక్తి (సన్నీ డియోల్) వస్తాడు. అతను వెళ్లాల్సిన ట్రైన్ ఒక చిన్న లోపంతో అక్కడ ఆగిపోతుంది. దీంతో అతను ఆ గ్రామంలో ఇడ్లీ తిన్తుండగా, రణతుంగ గ్యాంగ్ లో ఒకడు అతన్ని డిస్టర్బ్ చేస్తాడు. జాట్ సారీ చెప్పమని అడుగుతాడు. వాళ్లు చెప్పకపోగా అతన్ని బెదిరిస్తారు.
Read Also : అర్దరాత్రి అమ్మాయిల్ని చంపే సైకో… ఒంటరి ఆడపిల్లలే టార్గెట్… మెంటల్ మాస్ ట్విస్టులు