E-Paper
Advertisement

NagaShaurya : షూటింగ్‌లో స్పృహ త‌ప్పి ప‌డిపోయిన నాగశౌర్య‌

NagaShaurya : షూటింగ్‌లో స్పృహ త‌ప్పి ప‌డిపోయిన నాగశౌర్య‌

NagaShaurya : యంగ్ హీరో నాగ‌శౌర్య షూటింగ్‌లో క‌ళ్లు తిరిగి ప‌డిపోయారు. హెల్దీగా క‌నిపించే హీరో ఉన్న‌ట్లుండి అలా సొమ్మ‌సిల్లి ప‌డిపోవ‌టానికి ఏంటా కార‌ణ‌మ‌ని యూనిట్ స‌భ్యులు ముందు కంగారు క‌ప‌డిపోయారు. వెంట‌నే ద‌గ్గ‌ర‌లోని ఏఐజీ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ట్రీట్‌మెంట్ చేసిన వైద్యులు అస‌లు విష‌యం చెప్పారు. కొన్ని గంట‌లుగా నాగ‌శౌర్య తిండి, నీరు తీసుకోక‌పోవ‌టంతోనే నాగ‌శౌర్య క‌ళ్లు తిరిగిప‌డిపోయార‌ని చెప్పారు. స్పెష‌ల్ డైట్‌లో ఉన్న‌ప్పుడే ఫిజిక్ ప‌రంగా స్పెష‌ల్ లుక్‌లో క‌న‌ప‌డ‌తారు. అందు కోసం కొన్ని గంట‌ల పాటు తిండి, నీరు తీసుకోకూడ‌దు. అలా చేయ‌టం వ‌ల్ల‌నే నీర‌సంతో నాగ‌శౌర్య క‌ళ్లు తిరిగి ప‌డిపోయార‌ని వైద్యులు చెప్పారు.

అరుణాచ‌లం ద‌ర్శ‌క‌త్వంలో రీసెంట్‌గానే ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. శ్రీనివాస‌రావు చింత‌ల‌పూడి, డా.అశోక్ కుమార్ చింత‌ల‌పూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బేబీ అద్వైత‌, భ‌విష్య సినిమాకు స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తోన్న 24వ చిత్ర‌మిది. ఈ నెల 20వ తేదీనే బెంగుళూరులో అనూష శెట్టిని శౌర్య వివాహం చేసుకోబోతున్న సంగ‌తి కూడా తెలిసిందే. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా వెలువడింది. పెళ్లి దగ్గర పడుతున్న సందర్భంలో శౌర్యకు ఇలా జరగటం అందరినీ కాస్త కంగారు పెట్టిందనటంలో సందేహం లేదు.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×