Big Stories

Ksheerabdhi Dwadashi Puja : క్షీరాబ్ధి ద్వాదశి పూజ ఎందుకు చేయాలంటే!

Ksheerabdhi Dwadashi Puja : క్షీరాబ్ది ద్వాదశి కార్తీకమాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినం. కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటాం. నవంబర్ 5, 2022న ఈ తిథి రానుంది. ఈనెల దేవదానవులు క్షీరసాగరాన్ని మదించిన రోజు కాబట్టి… ఈ రోజుని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు.

- Advertisement -

శుక్షపక్ష ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి. అమృత‌ం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించిన రోజు. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుక ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి. పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అనీ, యోగులు, తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగానూ ప్రాచుర్యం పొందింది.

- Advertisement -

క్షీరాబ్ది ద్వాదశి మహత్మ్యాన్ని భాగవతంలోని అంబరీషుని కథ చెబుతుంది. శక్తి సామర్ధ్యాలతో పాలిస్తూ సిరిసంపదలకు ఏమాత్రం పొంగిపోక కేవలం విష్ణు పాదచరణమే శాశ్వతమని భావించే అంబరీష చక్రవర్తి… ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమ నిష్ఠలతో ఆచరించాడు.

ద్వాదశి రోజంటే శ్రీమహావిష్ణువుకి మహా ప్రీతి. అందుకే.. లక్ష్మీ సమేతంగా ఆయన ఈ రోజున బృందావనంలోకి అడుగుపెడతాడు. బృందావనం అంటే తులసి. తులసి అంటే.. లక్ష్మి అని కూడా అంటారు. కాబట్టి ఆ రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టులో విష్ణు స్వరూమైన ఉసిరి మొక్కని ఉంచి పూజించాలి. తులసి కోటకు చేరువలో శ్రీ మహావిష్ణువు ప్రతిమను కానీ..ఉంచి పూజిస్తే.. మంచి ఫలితం లభిస్తుంది.

ఉసిరి కొమ్మను తులసికోటలో నాటి, రెండింటికీ కల్యాణం చేస్తారు.
ఈ ద్వాదశి ఎంతో పవిత్రమైంది. తులసికోట ముందు దీపం వెలిగించాలి. ఉసిరి కొమ్మను నారాయణుడిగా, తులసిని లక్ష్మీదేవిగా భావించి కల్యాణం నిర్వహిస్తారు. తర్వాత క్షీరాబి ద్వాదశి కథ పఠిస్తారు. క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం ఆచరించిన వారికి మోక్షం సంప్రాప్తిస్తుందని శాస్త్రం చెబుతున్నది. వేయి యజ్ఞయాగాదులను చేసిన ఫలితం దక్కుతుంది. ఈరోజు 365 వత్తిలను తులసి కోట వద్ద వెలిగిస్తే.. ఏడాది పాపాలు పోతాయని నమ్ముతారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News