MCD Election : ఢిల్లీ మున్సిపల్స్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సీఎం కేజ్రీవాల్ అడుగులు వేస్తున్నారు. డిసెంబర్ 4న ఎన్నికలు జరగనున్నారు. ఢిల్లీలో మొత్తం 250 వార్డులు ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకొనేందుకు బీజేపీ, ఆప్, కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం చేశాయి. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక హామీలు ఇచ్చారు.
ఆప్ ఏం చెబుతుందో.. అదే అమలు చేస్తుందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతిని అంతం చేస్తామని స్పష్టం చేశారు. స్వచ్ఛ ఢిల్లీగా మారుస్తామని వాగ్దానం చేశారు. బీజేపీపై విమర్శలు గుప్పించారు. కాషాయ నేతలు ఇచ్చిన హామీలను ఎన్నికల తర్వాత మర్చిపోతారని ఆరోపించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు నిధులు మంజూరు చేయడంలేదని తనను నిందిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని కేంద్రం ఆరోపణలు చేయడం చరిత్రలో ఇదే తొలిసారన్నారు. ఢిల్లీని చెత్త రహిత నగరం మార్చేందుకు కేంద్రం నిధులు తెస్తామని గతంలో హామీ ఇచ్చిన హామీ సంగతేంటని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 20కి మించి సీట్లు రావని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు.
ఢిల్లీలో 250 వార్డులకు డిసెంబర్ 4న ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 7న ఫలితాలు వెల్లడవుతాయి. 2007 నుంచి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీనే విజయం సాధిస్తూ వస్తోంది. 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 181 సీట్లు కైవసం చేసుకుంది. అప్పుడు ఆప్ 49 స్థానాలు, కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకున్నాయి. అప్పుడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 272 వార్డులు ఉండేవి. అయితే ఈ ఏడాది వార్డుల సంఖ్యను 250కి తగ్గించారు.
కేజ్రీవాల్ ఇచ్చిన హామీలివే