Gomti Chakra: గోమతి చక్రం శ్రీకృష్ణుడి చేతిలోని సుదర్శన చక్రాన్ని తలపించేలా ఉంటుంది.
గోమతి చక్రాల సముద్రాల నుంచి ఉత్పత్తి అవుతాయి. అందులోనే కేవలం గుజరాత్ లోని ద్వారకా దగ్గరున్న గోమతి దగ్గరే దొరుకుతాయి. గోమతి చక్రాల్లో ఆరు, 9 సంఖ్యలు అంతర్లీనంగా కనిపిస్తాయి. ఆరు శుక్ర గ్రహానికి, 9 కుజ గ్రహానికి చెందుతాయి.
గోమతీ చక్రం అన్నది ప్రకృతి మానవునికి ఇచ్చిన శ్రేష్ఠ వర దానం. ఇది స్వయంగా లక్ష్మీ దేవికి పర్యాయ స్థానం. దీనిపై ఎన్నో తాంత్రిక-మాంత్రిక ప్రయోగాలున్నాయి. ఈ గోమతీ చక్రాలు పూజ సామాగ్రి అమ్మే దుకాణాలలో లభిస్తుంది. గోమతి చక్రాల్ని పూజిస్తే ధన ప్రాప్తి కలుగుతుంది. శుభ తిథి ఉన్న సోమవారం నాడు తెల్లవారజామునే గోమతీ చక్రాన్ని ముందు పాలతో, తరువాత నీటితో అభిషేకం చేసి పళ్ళెంలో కిలో బియ్యం ఉంచి అందులో స్థాపించాలి. నువ్వుల నూనె తో కాని, నెయ్యితో కాని మట్టి దీపాన్ని వెలిగించి పసుపు, కుంకుమ, పుష్పాలు, దీప ధూప నైవేద్యాలతో పూజ చేసి, తరువాత క్రింది మంత్రాన్ని 5 మాలలు అంటే 540 సార్లు జపించాలి. ఇలా 14 రోజుల పాటు ప్రతి రొజూ చేయాలి.
ఇలా 14 రోజుల సాధన పూర్తి కాగానే గోమతీ చక్రాన్ని పూజా స్థానంలో లేదా వ్యాపార స్థానంలో స్థాపించాలి. ఆ తరువాత ప్రతి రోజు మంత్ర జపాన్ని 21 సార్లు కాని 108 సార్లు కాని చేస్తూ, కొన్ని బెల్లం ముక్కలను నివేదనగా సమర్పిస్తూ 108 సార్లు మంత్ర జపం చేయాలి. దీని వల్ల మీ జీవితంలో మంచి ధన ప్రాప్తి, అన్ని రకాలుగా పరిపూర్ణ సాఫల్యం తప్పక లభిస్తుంది.