BigTV English

IPL : ఇషాన్ , సూర్య విధ్వంసం.. పంజాబ్ పై ముంబై గెలుపు..

IPL : ఇషాన్ , సూర్య విధ్వంసం.. పంజాబ్ పై ముంబై గెలుపు..

IPL : 215 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు సునాయాసంగా చేధించింది. పంజాబ్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 214 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లివింగ్ స్టోన్ (82 నాటౌట్), జితేష్ శర్మ (49 నాటౌట్) చెలరేగడంతో కింగ్స్ జట్టు స్కోర్ 200 దాటింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (30), మధ్యూ షార్ట్ (27) పర్వాలేదనిపించే స్కోర్ చేశారు. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా 2 వికెట్లు, అర్షద్ ఖాన్ ఒక వికెట్ తీశారు. జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్ల వేసి 56 పరుగులు సమర్పించుకున్నాడు.


భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు రిషి ధావన్ వేసిన తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్ (75), గ్రీన్ (23) స్కోర్ పెంచేందుకు ప్రయత్నించారు. గ్రీన్ అవుటైన తర్వాత ఇషాన్ కు సూర్యకుమార్ యాదవ్ (66) తోడుకావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఫోర్లు, సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మూడో వికెట్ కు 9.1 ఓవర్లలో 116 పరుగులు జోడించారు. దీంతో ముంబై విజయం ఖాయమైపోయింది. కానీ ఒక ఓవర్ వ్యవధిలోనే ఇద్దరూ అవుట్ కావడంతో మ్యాచ్ పై ఉత్కంఠ పెరిగింది. అయితే టిమ్ డేవిడ్ (19 నాటౌట్), తిలక్ వర్మ (26 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ముంబై మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

పంజాబ్ బౌలర్లలో నాథన్ ఇల్లీస్ 2 వికెట్లు, అర్షదీప్ సింగ్, రిషి ధావన్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో అర్ష దీప్ సింగ్ ఘోరంగా విఫలమయ్యాడు. 3.5 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చాడు. అతడి బౌలింగ్ లో ముంబై బ్యాటర్లు 8 ఫోర్లు, నాలుగు సిక్సులు బాదారు. ఇషాన్ కిషన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.


Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×