BigTV English

Zoom Lays Off Employees:కోతల్లో ‘జూమ్’

Zoom Lays Off Employees:కోతల్లో ‘జూమ్’

Zoom Lays Off Employees:కరోనా సమయంలో జూమ్ హవా అంతా ఇంతా కాదు. టెక్కీల నుంచి స్టూడెంట్స్ దాకా అంతా జూమ్ మీటింగ్స్ ద్వారానే పని చేసుకున్నారు… చదువుకున్నారు. డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో… ఉద్యోగుల్ని కూడా ఎక్కువగానే నియమించుకుంది… జూమ్. ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో… ఆ కంపెనీ పరిస్థితి కూడా తల్లకిందులయ్యేలా ఉంది. అందుకే… ఉద్యోగుల్ని తీసేస్తున్న కంపెనీల జాబితాలో జూమ్ కూడా చేరింది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం మందిని… అంటే 1300 మంది ఉద్యోగుల్ని తీసేయబోతున్నట్లు ప్రకటించింది… జూమ్.


అమెరికాలో విధుల నుంచి తొలగించిన ఉద్యోగులకు… లేఆఫ్ వివరాలతో అరగంటలో మెయిల్ పంపుతామన్నారు… జూమ్ సీఈఓ ఎరిక్ యువాన్. తీసేసిన ఉద్యోగులు కష్టపడి పనిచేసే ప్రతిభావంతులు అయినప్పటికీ… ఆర్థిక పరిస్థితి కారణంగా వారికి ఉద్వాసన పలకక తప్పడం లేదని ఆయన జూమ్ అధికారిక బ్లాగ్‌లో ప్రకటించారు. అయితే అమెరికా వెలుపల పని చేసే వారి విషయంలో… ఆయా దేశాల నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని యువాన్ తెలిపారు. అమెరికాలో ఉద్యోగాల నుంచి తీసేసిన వారికి చట్ట ప్రకారం 16 వారాల వేతనం, హెల్త్‌కేర్‌ కవరేజీ, ప్రతిభ ఆధారంగా ఇచ్చే 2023 ఆర్థిక సంవత్సరపు బోనస్‌, 6 నెలల పాటు స్టాక్‌ ఆప్షన్‌పై అధికారం ఇవ్వగా… అమెరికాయేత ఉద్యోగుల కోసం ఆగస్టు 9వ తేదీ వరకు సమయం ఇచ్చారు. అక్కడి స్థానిక చట్టాలను పరిగణనలోకి తీసుకుంటేనే ఇదే వర్తిస్తుంది.

వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌, ఆన్ లైన్ క్లాసులు గణనీయంగా తగ్గిపోవడంతో… జూమ్ రెవెన్యూ భారీగా తగ్గింది. అందుకే ఉద్యోగుల తొలగింపు నిర్ణయంతో పాటు తన ఏడాది జీతంలో 98 శాతం కోత విధించుకుంటున్నట్లు జూమ్ సీఈఓ ఎరిక్ యువాన్ ప్రకటించాడు. అంతేకాదు… ఎగ్జిక్యూటివ్ బోనస్‌ను వదులుకోబోతున్నానని, తద్వారా సంస్థపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని చెప్పాడు. కొవిడ్ సమయంలో జూమ్ ఏకంగా 3 రెట్లు పెరిగిందని, ప్రజల మధ్య కనెక్టివిటీని పెంచడానికి వేగవంతంగా నియామకాలు చేపట్టామని, కొందరు ఉద్యోగుల్ని తీసేసినా భవిష్యత్తులో తమ సృజనాత్మకత కొనసాగిస్తామని ఎరిక్‌ యువాన్‌ వెల్లడించాడు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×