Besan For Skin Whitening: ఆహార రుచిని పెంచే శనగపిండి అందాన్ని కూడా పెంచుతుంది. శతాబ్దాల తరబడి వంటకాల్లో శనగపిండిని ఉపయోగించడానికి ఇందులోని పోషకాలే కారణం. చర్మాన్ని ఆరోగ్యంగా మార్చడంలో ఉపయోగపడే పోషకాలు శనగ పప్పులో ఉంటాయి. శనగపిండిని అమ్మమ్మల కాలం నుంచి గ్లోయింగ్ స్కిన్ కోసం వాడుతున్నారు. ముఖ్యంగా ఇది తరుచుగా ముఖానికి వాడటం వల్ల ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా ముఖం చాలా స్మూత్‌గా తయారవుతుంది.
శనగపిండి చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. శనగపిండిలో ఇంట్లోని వంటగదిలో ఉండే కొన్ని పదార్థాలను కలిపి ఫేస్ ప్యాక్ లాగా తయారు చేసుకుని వాడవచ్చు. వీటి వల్ల కూడా బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. పండగలు, ఫంక్షన్స్ సమయంలో మీ ముఖంపై తక్షణ మెరుపును పొందాలనుకుంటే, మీరు 4 విధాలుగా శనగపిండి ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని ఉపయోగించవచ్చు. మరి చర్మ సౌందర్యానికి శనగపిండిని ఎలా వాడాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శనగపిండి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి ?
1. జిడ్డు చర్మం కోసం శనగపిండి ఫేస్ ప్యాక్:
కావలసినవి:
శనగపిండి – 2 టీస్పూన్లు
పెరుగు – 1 టీస్పూన్
నిమ్మరసం – కొన్ని చుక్కలు
తయారీ విధానం:పైన చెప్పిన అన్ని పదార్థాలను ఒక బౌల్‌లో వేసి బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి 15-20 నిమిషాలు వదిలివేయండి. ఆ తర్వాత
చల్లటి నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ తరుచుగా వాడితే రిజల్ట్ ఈజీగా మీరు చూడవచ్చు.
2. మొటిమల కోసం శనగపిండి ఫేస్ ప్యాక్:
కావలసినవి:
శనగపిండి – 2 స్పూన్
పసుపు పొడి – 1/4 టీస్పూన్
తేనె – 1 టీ స్పూన్
నీరు- తగినంత
తయారీ విధానం: పైన చెప్పిన మోతాదు్లో అన్ని పదార్థాలను తీసుకుని ఒక బౌల్‌లో వేసి మిక్స్ చేసుకోండి. తర్వాత ముఖానికి అప్లై చేయండి. 15-20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీటితో కడగాలి.
3. పొడి చర్మం కోసం శనగపిండి ఫేస్ మాస్క్:
కావలసినవి:
శనగపిండి – 2 టీస్పూన్లు
పాలు – 1 టీస్పూన్
గ్లిజరిన్ – కొన్ని చుక్కలు
తయారీ విధానం: పైన తెలిపిన మోతాదుల్లో అన్ని పదార్థాలను తీసుకుని పేస్ట్ లాగా చేయండి. తర్వాత ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు వదిలివేయండి. అనంతరం
గోరువెచ్చని నీటితో కడగాలి.
4. మచ్చలు తగ్గడానికి శనగపిండి ఫేస్ మాస్క్:
కావల్సినవి:
శనగపిండి – 2 టీస్పూన్లు
టమాటో రసం – 1 టీస్పూన్
పెరుగు – 1 టీస్పూన్
తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో అన్ని పదార్థాలను కలపి పేస్ట్ లాగా చేయండి. తర్వాత దీనిని మచ్చలు ఉన్న చోట అప్లై చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.తర్వాత చల్లటి నీటితో కడగాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోండి:
శనగపిండి ఫేస్ మాస్క్‌ను వారానికి 2-3 సార్లు ఉపయోగింవచ్చు.
ఏదైనా కొత్త ఫేస్ ప్యాక్ ముఖానికి వేసుకునే ముందు, మీ మోచేతికి కొద్ది మొత్తంలో అప్లై చేసి 24 గంటలు అలాగే ఉంచండి. అలెర్జీ లేకపోతేనే మఖానికి ఉపయోగించండి. బయటికి వెళ్లే ముందు సన్‌స్క్రీన్ రాయడం మర్చిపోవద్దు.
Also Read: ఇవి వాడితే.. మీ ముఖం వజ్రంలా మెరిసిపోతుంది తెలుసా ?
శనగపిండి ఫేస్ మాస్క్ వల్ల కలిగే ప్రయోజనాలు:
చర్మాన్ని శుభ్రపరుస్తుంది.
మొటిమలను తగ్గిస్తుంది.
చర్మం మెరుపును తగ్గిస్తుంది .
మచ్చలను తగ్గిస్తుంది.
చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.