E-Paper
Advertisement

CM Revanth Reddy: చదువుల తల్లికి చేయూత.. గిరిజన యువతికి సీఎం రేవంత్ ఆర్థిక సాయం

CM Revanth Reddy: చదువుల తల్లికి చేయూత.. గిరిజన యువతికి సీఎం రేవంత్ ఆర్థిక సాయం
Advertisement

CM Revanth Reddy: ఎంబీబీఎస్‌లో సీటు సాధించింది ఆ యువతి. కానీ, ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత లేదు. ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోన్న ఆ గిరిజన బాలికకు రేవంత్ సర్కార్ ఆర్థిక సాయం అందించింది.

కుమురం భీం జిల్లాకు చెందిన గిరిజన బాలిక సాయిశ్రద్ధ డాక్టర్ కావాలన్నది కోరిక. నీట్‌లో ఎస్టీ విభాగంలో 103 వ ర్యాంకు సాధించింది. మంచి ర్యాంకుతో సీటు సాధించినా ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతోంది.

Advertisement

యువతికి డాక్టర్ కావాలనే కోరికైతే బలంగా ఉంది కానీ, ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. ఈ విషయం చివరకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వచ్చింది. ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యతను  ప్రభుత్వం తీసుకుంది. ఆర్ధిక సాయం అందజేసింది.

సాయిశ్రద్ధ, ఆమె తల్లిదండ్రులు బుధవారం ముఖ్యమంత్రిని కలిశారు. వైద్య విద్యకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు. వైద్య విద్య పూర్తి చేయాలన్న కల నెరవేరుతున్నందుకు ఈ సందర్భంగా సాయిశ్రద్ధ, కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో పోస్టు చేశారు.  డాక్టర్ కావాలన్న ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుందని రాసుకొచ్చారు.

 

 

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×